Wednesday 31 August 2022

ఎందుకని ఈ ఒక్క సినిమాకే ఇంత శాడిస్టిక్ మాస్ హిస్టీరియా?


తొంభై శాతం సినిమాలు ఫ్లాపవుతాయి. పత్తాలేకుండా పోతాయి. 

సినిమా పుట్టినప్పట్నుంచీ ఇది అతి మామూలుగా జరుగుతున్న విషయమే. అందరికీ తెలిసిన విషయమే.

ఎన్నెన్నో చారిత్రాత్మక సూపర్ డూపర్ హిట్లిచ్చిన దర్శకరత్న దాసరి సినిమాల్లో సూపర్ ఫ్లాపులు లేవా? 

దళపతి, రోజా వంటి అద్భుత సినిమాల రూపశిల్పి మణిరత్నం అతి దారుణమైన అట్టర్ ఫ్లాపులివ్వలేదా? 

అలాగే, పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపుల్లో ఇదొకటి అనుకుందాం. 

లైగర్. 

సో వాట్? 

కట్ చేస్తే -

ఏ డైరెక్టర్ కూడా పనికట్టుకొని పొగరుతోనో, ఈగోతోనో, అసలేం ఆలోచించకుండానో ఒక ఫ్లాప్ సినిమా తీయాలనుకోడు. 

అప్పుడప్పుడు అంచనాలు తప్పవుతాయి, అనుకున్న ఫలితం రాదు. 

అంతమాత్రాన ఆ ఫిలింమేకర్ ప్రేక్షకులను తక్కువ అంచనా వేశాడని అనుకోడానికి వీళ్లేదు. వందల కోట్ల తన డబ్బు చూస్తూ చూస్తూ అలా వృధా చేసుకుంటాడనుకోడానికీ వీళ్లేదు. 

అదలా జరుగుతుందంతే. 

లైగర్ విషయంలోనూ జరిగిందదే. 

అంతకు ముందు ఎన్ని వందల సినిమాలు ఫ్లాప్ కాలేదు? 

లైగర్ కంటే దారుణంగా అర్థం పర్థం లేకుండా ఎన్ని సినిమాలు రాలేదు? 

కాని, ఈ ఒక్క సినిమాకే ఎందుకింత శివమెత్తిపోయారు? రిలీజ్ కంటే ముందే 'ఫ్లాప్ ఫ్లాప్' అని ఎందుకంత సంబరం? 

ఇంతకుముందెప్పుడైనా ఒక ఫ్లాపైన సినిమాకు 3000 లకు పైగా రివ్యూలు మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని వచ్చాయా? 

అసలిన్ని రివ్యూలు ఒక సూపర్ హిట్ అయిన సినిమాకైనా రాస్తారా? 

ఎందుకని ఈ ఒక్క సినిమాకే ఇంత పూనకం? 

ఎందుకని ఇంత శాడిస్టిక్ మాస్ హిస్టీరియా?  

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త హీరో - చూస్తుండగానే - ఒక టాప్ రేంజ్ హీరోగా దూసుకెళ్తున్నాడని లోపల్లోపలి భయమా?

డైరెక్టర్ పూరి లాగే, పెద్ద హీరోలని పెద్దగా పట్టించుకోకుండా, హిట్లో ఫట్లో వరుసగా తన సినిమాలు తను చేసేసుకొంటూ, తన దారిలో తను వెళ్తున్నాడని జెలసీ నిండిన వేదనా? 

కట్ చేస్తే - 

లైగర్... అదేం చెత్త సినిమా కాదు. ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమా. అత్యుత్తమమ స్థాయి సాంకేతిక విలువలతో తీసిన సినిమా.

లోపాలున్నాయి. 

ఆ లోపాల కారణంగా అది సూపర్ డూపర్ హిట్ కాకపోవచ్చు. కాని, మామూలు పరిస్థితుల్లో అయితే సవాల్ లేకుండా ఒక మాదిరిగా నడిచే సత్తా ఉన్న సినిమా. 

ఒక పక్కా ప్లానో, మాస్ హిస్టీరియానో తెలీదు... రిలీజ్‌కు ముందునుంచే దాడిచేసిన వేలకొద్ది సోకాల్డ్ రివ్యూల పుణ్యమా అని, సినిమా నచ్చినవాళ్ళు కూడా నోరెత్తలేకపోయారు. 

చూడాలనుకున్నవాళ్ళు కూడా నాన్ స్టాప్‌గా వస్తున్న ఈ ఫ్లాప్ రివ్యూల మాస్ హిస్టీరియా ప్రభావంతో అసలా వైపే వెళ్లలేకపోయారు. 

ప్రేక్షకులకు, రివ్యూయర్స్‌కు చాన్స్ ఉంది, ఆప్షన్ ఉంది. చూడొద్దు అనుకుంటే ఆ సినిమా చూడకుండా ఉండొచ్చు. 

నా సినిమా చూడు అని ఎవ్వడూ పీక పట్టుకొని పిసికి చంపడు.  

ఆఫ్టర్ ఆల్... సినిమా అంటే జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సాధనం మాత్రమే. 

అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే మరోటి. ఎన్నెన్నో ఆప్షన్స్ ఉన్నాయి.           

అంతే తప్ప - సినిమా చూసి, సినిమా ఎలా తీయాలో పూరికి పాఠాలు చెప్తూ, సినిమా ఫలితాల మీద దారుణమైన ప్రభావం పడేలా వేల కొద్ది రివ్యూలు రాయాల్సిన పనిలేదు. 

ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్ళపాటు ఎంతో శ్రమించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న విజయ్ దేవరకొండను ఎగతాళి చేయనవసరం లేదు.    

ఒక భారీ బడ్జెట్ సినిమా ఫ్లాపైతే, సినిమా పరిశ్రమ మీదే ఆధారపడిన కనీసం ఒక రెండువేల కుటుంబాలు రోడ్డునపడతాయి. 

లైగర్ మీద పనికట్టుకొని రాసిన ఈ మూడువేల రివ్యూల పుణ్యమా అని ఇప్పుడదే జరిగింది.   

అంత శాడిజం అవసరమా? 

రివ్యూకో వంద రూపాయాలు జీయస్టీ కట్టాలి అని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెడితే వీరిలో ఎంతమంది రివ్యూలు రాసేవాళ్ళు? 

This is it.

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు.
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే!
- శ్రీశ్రీ 

My Love and Hugs to Puri Jagannadh, Charmme, Vijay Devarakonda, Ananya Panday and the entire Team!

Sunday 28 August 2022

ఆరంభింపరు నీచ మానవులు... (2)


నాకిష్టమైన అమెరికన్ సీరియల్ ఎంట్రప్రెన్యూర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్, రచయిత, బ్లాగర్... జేమ్స్ ఆల్టుచర్ కొన్ని నిజాల్ని చాలా అద్భుతంగా చెప్తుంటాడు. 

"ఇది పోస్ట్ చేస్తే ఎవరేమనుకుంటారో నాగురించి అన్న ఫీలింగ్ లేకుండా నువ్వు ఏదన్నా పోస్ట్ చేస్తున్నావంటే, నువ్వు రాసినదానికి అర్థం లేనట్టే. ఇదే సూత్రం నువ్వు రాసే పుస్తకాలకు కూడా వర్తిస్తుంది, నీ మొత్తం క్రియేటివ్ యాక్టివిటీకి వర్తిస్తుంది." 

కట్ చేస్తే - 

నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం ప్రచురిస్తున్నప్పుడు నేనూ ఇలాగే ఫీలయ్యాను. కాని, నా మనసు చెప్పినట్టు ముందుకే వెళ్ళాను. 

నేను ఊహించినట్టుగానే కేసీఆర్ గారి మీద నా పుస్తకం ఒక "బెస్ట్ సెల్లర్ బుక్" అయ్యింది. నా తోటి కేసీఆర్, తెలంగాణ అభిమానులందరినుంచి ఆశీస్సులు, అభినందనల వెల్లువను మోసుకొచ్చింది. 

మరోవైపు, నిన్నటి పోస్టులో నేను రాసినట్టు కొందరు మానసిక వ్యాధిగ్రస్తులు ఊరికే బట్టలు చింపుకొని బాధపడేట్టుచేసింది. 

అయితే - ఈ రెంటిలో దేన్ని పట్టించుకోవాలన్నది మన ఇష్టం.    

ఏది ఎలా వున్నా... కేసీఆర్ పట్ల, వారి దార్శనికత పట్ల, తెలంగాణ పట్ల నాకున్న అభిమానాన్ని ఇలాంటి ఏ నెగెటివిటీ మార్చలేదు. ఒక బాధ్యతగా నేను చేయబోతున్న ఇలాంటి మరో గొప్ప ప్రయత్నం నుంచి నా దృష్టిని ఏమాత్రం మరల్చలేవు.     

Creativity takes courage!              

Friday 26 August 2022

ఆరంభింపరు నీచ మానవులు... (1)


"మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు? అయినా సరే, ఆయన మీద పొద్దుగాల లేస్తే ఎంతమంది రాళ్లేస్తలేరే?" 

మొన్న సాయంత్రం ఆఫీసు నుంచి కార్లో ఇంటికి వెళ్తున్నప్పుడు ఫోన్లో ఒక మిత్రుడు అన్న మాట అది.

కట్ చేస్తే - 

నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"ను తెలంగాణ ఐటీ & ఇండస్ట్రీస్ మినిస్టర్, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న జూలై 5 నాడు ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. 

కేసీఆర్ కేంద్రబిందువుగా గత కొన్నేళ్ళుగా నేను రాసిన వందలాది బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, దినపత్రికల ఎడిట్ పేజీ ఆర్టికిల్స్ లోంచి - ఎన్నిక చేసిన ఒక 55 ఆర్టికిల్స్‌తో - ఒక అందమైన సంకలనంగా రూపొందించిన పుస్తకమిది. 

ప్రస్తుతం నేను ఎండీగా పనిచేస్తున్న స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ స్వర్ణసుధ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.  

ఈ పుస్తకం ధర తెలిపే (విటిపి) పేజీలో, ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదన్న విషయాన్ని తెలుపుతూ, ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్ని చారిటీస్‌కు వినియోగిస్తాం అని స్పష్టంగా చెప్పాం. 

కట్ చేస్తే - 

ఈ పుస్తకం ప్రచురణ కోసం భారీగా చందాలు వసూలు చేశారని, "క్విడ్ ప్రో కో" దృష్టితో ఈ పుస్తకం ప్రచురించారనీ, ఫోటోలు-రివ్యూల కోసం పదులకొద్దీ కాల్స్ చేస్తున్నారనీ ఒక బాధాతప్త హృదయుని జెలసీ ఫేస్‌బుక్ పోస్టు రూపంలో కనిపించింది.  

దాన్ని 3 రోజుల క్రితమే మిత్రులు నా దృష్టికి తెచ్చారు.

రాళ్లేయటం మామూలేగా అనుకున్నాను కాని, నేను స్పందించకపోతే అదే నిజం అని కొందరైనా అనుకునే ప్రమాదం ఉంది. కొందరు అతి దగ్గరి మిత్రులు కూడా "ఈగర్లీ వెయిటింగ్" అనటంతో ఇంక ఇది రాయక తప్పడం లేదు.       

పై ఆరోపణల్లో మొదటిదానికి జవాబు పై పేరాల్లో చాలా స్పష్టంగా ఉంది. పుస్తకంలోనే ప్రింట్ రూపంలో కూడా ఉంది. 

స్వర్ణసుధ పబ్లికేషన్స్ సంస్థవాళ్ళు ఈ పుస్తకాన్ని ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీతో చాలా ఖర్చుపెట్టి ప్రచురించారు. 

ఇక, క్విడ్ ప్రో కో విషయానికొద్దాం...

నేనింతకు ముందు జర్నలిజం పైన రాసిన పుస్తకం ఒక యూనివర్సిటీలో ఎమ్మే విద్యార్థులకు రిఫరెన్స్ బుక్స్ లిస్టులో ఉంది. ఆ యూనివర్సిటీ నుంచి ఏదైనా క్విడ్ ప్రో కో ఆశించి రాశానా నేనా పుస్తకం? 

సినీఫీల్డుకు సంబంధించి నేను రాసిన ఇంకో పుస్తకం "ది బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్" కేటగిరీ కింద నాకు నంది అవార్డు సాధించిపెట్టింది. నేను సినీఫీల్డు నుంచి సో కాల్డ్ క్విడ్ ప్రో కో ఏదైనా ఆశించి రాసినట్టా ఆ పుస్తకాన్ని?   

ఇప్పుడీ పుస్తకం కూడా "నేను ఎందుకు రాశాను" అన్నదాని మీద పుస్తకం ప్రారంభంలోనే "ప్రొలోగ్" పేరుతో ఒక 6 పేజీల అధ్యాయం రాశాను.    

ఇక "పదుల సంఖ్యలో కాల్స్" అనే ఆరోపణకు అసలు అర్థం లేదు. 

మామూలుగానే నేను చాలా రిజర్వ్‌డ్. ఈ విషయంలో నేనిప్పటివరకు కేవలం ఇద్దరే ఇద్దరు మిత్రులకు కాల్ చేశాను-లేదా-మెసేజ్ పెట్టాను. అది కూడా, రచయితలుగా వారిద్దరూ ఏంటో నాకు తెలుసు కాబట్టీ, నా పుస్తకం గురించి వారు రాసే ఆ రెండు వాక్యాలు నేను చదవాలన్న పర్సనల్ క్యూరియారిసిటీతోనే అడిగాను. అది పూర్తిగా నా వ్యక్తిగతం. 

ఇంతకు మించి - కేవలం (నన్ను బుక్ పంపమని అడిగిన) ఇద్దరికో ముగ్గురికో మెసేజ్ మాత్రం పెట్టాను చాలా క్యాజువల్‌గా... "బుక్ అందాక వీలైతే ఫోటో పంపండి, రివ్యూ రాయగలిగితే రాయండి" అని. 

ఆ మెసేజ్ కూడా ఎందుకు పెట్టానంటే - కేసీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్‌గా, పార్టీ కార్యకర్తలుగా వారి సేవల స్థాయి గురించి నాకు వ్యక్తిగతంగా కొంత తెలుసు కాబట్టి, బుక్ గురించి వారి ఫీలింగ్స్ తెల్సుకోవాలని. అంతే.  

ఏళ్ళుగా పరిచయం ఉన్న అతిదగ్గరి మిత్రులకే ఏడాదికోసారి కూడా ఫోన్స్ చేసుకొనే వీలులేని ఈ రోజుల్లో - ఎలాంటి పరిచయం లేని ఎవరెవరికో పదుల సంఖ్యలో కాల్స్ చేసే సమయం నాకైతే లేదు. 

ముందుమాటలు, రివ్యూలు ఒక పుస్తకం సేల్స్ పెంచవు అన్న విషయం తెలిసినవాణ్ణి. ఒక పుస్తకం ఎందుకు బెస్ట్ సెల్లర్ అవుతుందో కూడా తెలిసినవాణ్ణి. ఇలాంటి అర్థం లేనివాటికి స్పందించాల్సి రావడం పెద్ద విషాదం.  

ఓయూలో రెండు పీజీలు చదివాను. పీజీ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. సుమారు పదిహేనేళ్ళపాటు మూడు కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేశాను, రిజైన్ చేశాను. 

కేసీఆర్ గారి మీద అభిమానంతో - ఒక రచయితగా - నాకు చేతనైనంతలో నేను చేసిన ఈ చిరు ప్రయత్నం మీద ఇలాంటి నిమ్నస్థాయి ఆలోచనలు చేసేవారు కూడా ఉండటం అన్నది నిజంగా నేను ఊహించని విషయం. 

వారికి నా ప్రేమ, వారిపైన నా జాలి, వారి పట్ల నా విచారం, వారి మానసిక స్థాయికి నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. 

వారి కారణంగా ఇలాంటి పోస్టు ఒకటి రాయాల్సివచ్చినందుకు మాత్రం నిజంగా బాధపడుతున్నాను. 

కట్ చేస్తే - 

ఈ పోస్టు ప్రారంభంలో నా మిత్రుడు అన్న మాట ఒకటి కోట్ చేశాను. మొన్న ఫోన్లో ఆ మాట విన్నతర్వాత "నిజమే కదా" అనిపించింది. 

మనలోని నిరాశ నిస్పృహలు, అసమర్థత, జెలసీ, నెగెటివిటీలను ఇంకొకరు చేసే మంచి పనుల మీద బురదచల్లడానికి ఉపయోగించకూడదు. అంతకంటే శాడిజం ఇంకోటి ఉండదు. 

కేసీఆర్ గారి మీద, వారి ప్రభుత్వం మీద, వారి కుటుంబం మీద, తెలంగాణ మీద నాన్-స్టాప్‌గా ఇప్పుడు జరుగుతున్న రకరకాల దాడులకు నేపథ్యం కూడా అలాంటి శాడిజమే.  

వాళ్ళు చేయలేరు, ఇంకొకర్ని చేయనివ్వరు. 

Monday 22 August 2022

బ్లాగింగ్ నాకేమిచ్చింది? - 2


జీవితంలో ఒక దశ తర్వాత చెయ్యాలనుకున్నది చేసేసుకుంటూ పోవడమే. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్! 

ఆ దశ కొందరికి కొంచెం ఎర్లీగా వస్తుంది. కొందరికి కొంచెం ఆలస్యంగా వెలుగుతుంది. నాలాగా. 

కట్ చేస్తే -   

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో, హిపోక్రసీ లేకుండా నిజాలనే రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. 

అందుకే, ఈ బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ "ఏదో రాయాలి కాబట్టి రాస్తాను" అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

అందరూ, అన్నీ, ఇక్కడే, నా ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మీదే నాకు కనెక్ట్ కావడం ప్రారంభమైంది.   

21 ఆగస్టు 2012 నాడు, అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు చూస్తుండగానే 10 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 3651 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ! 

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం!      

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." ~Kate Christensen

Sunday 21 August 2022

బ్లాగింగ్ నాకేమిచ్చింది? - 1


మనిషన్న తర్వాత ఏదో ఒక ఎడిక్షన్ ఉంటుంది... 

ఎడిక్షన్ అంటే అది ఏ తాగుడో, జూదమో, ఇంకేదో కానక్కర్లేదు. చచ్చేంత ఇష్టం ఉండే ఏదైనా పాజిటివ్ అలవాటు కూడా కావచ్చు.

నాకున్న ఏకైక ఎడిక్షన్ బ్లాగింగ్. 

కనీసం ఒక అయిదారు సార్లు ఇంక బ్లాగింగ్ బంద్ చేద్దామనుకున్నాను. కాని, అలా జరగలేదు. బహుశా జరగదు. 

కట్ చేస్తే - 

21 ఆగస్ట్ 2012...

సరిగ్గా పదేళ్ళ క్రితం, ఇదేరోజు, నేను నా బ్లాగింగ్ జర్నీ ప్రారంభించాను. ఇప్పటికీ ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో నా బ్లాగ్‌లో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను. 

పనికొచ్చేదో, పనికి రానిదో... ఏదో ఒకటి రోజూ కాసేపు ఇలా రాయడం చాలా అవసరం నాకు. అంతలా ఎడిక్టయ్యాను.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడం కోసం మాత్రం నాకు నిజంగా తప్పనిసరి.

ఇంతకు ముందు చాలా సార్లు నాకు నేనే చెప్పుకున్నట్టు... రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది.

ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా, జీవిత పర్యంతం మనం ఇష్టంగా ఫీలయ్యి, అన్నీ పంచుకోగలిగిన ఒకటి రెండు అద్భుత స్నేహాలను కూడా అందిస్తుంది.  

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.” - James Altucher    

Wednesday 17 August 2022

కేసీఆర్ బుక్‌తో క్రియేటివ్‌గా ఫోటో తీసుకోవడం ఎలా?


రాజేంద్రప్రసాద్ రేగొండ పోస్ట్ చేసిన అద్భుతమైన ఫోటోను మీరు చూస్తున్నారు. 

అయితే, నా బుక్ "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకంతో పాటు మీరూ ఉండాలి ఫోటోలో. ఆసక్తి ఉన్నవారు పుస్తకంతోపాటు మీరున్న ఫోటోను (ఒక్క ఫోటో మాత్రమే) నాకు ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్‌లో పంపించండి.  

ఫోటోని మీరు ఎంత క్రియేటివ్‌గా తీయగలిగితే అంత మంచిది. మీ క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. 

అలా మీరు నాకు పంపించిన ప్రతి ఫోటోనూ సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్/ట్విట్టర్/ఇన్‌స్టాగ్రామ్) నేను పోస్ట్ చేస్తాను.  

Tuesday 16 August 2022

అది ఇప్పటి బ్లాగ్ పోస్ట్ కాదు!


నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" లోని ఒక వ్యాసం చదివి కొంతమంది మిత్రులు ఇబ్బందిగా ఫీలవుతున్నారని నా దృష్టికి వచ్చింది. 

వందలాది నా బ్లాగ్ పోస్టులు, పత్రికల్లో వచ్చిన నా అర్టికిల్స్ లోంచి ఎన్నిక చేసిన కొన్ని వ్యాసాల సంకలనమే నా ఈ పుస్తకం. సుమారు పదేళ్ళ క్రితం నేను రాసినవి కూడా ఇందులో ఉన్నాయి.

కొందరు మిత్రులు ఇబ్బందిగా ఫీలవుతున్న ఆ వ్యాసం కూడా 2018 జనవరి నాటిది అనుకుంటాను. 

అప్పుడు ఆ బ్లాగ్ ప్రారంభంలో నేను అలవోకగా లిస్ట్ చేసిన కొందరు ఇప్పుడు పార్టీలో లేరు. అలాంటి కొన్ని పేర్లని నేను తీసేశాను. కాని, ఇంకా ఒకటి రెండు మిస్ అయ్యాయని అర్థమైంది. 

అయినా సరే, ఆయావ్యక్తుల్లో వచ్చిన మార్పు మీరు అర్థంచేసుకోవడానికి ఈ వ్యాసం ఉపయోగపడాలని నా భావన. కాని, అసలు కంటెంట్‌నంతా వదిలేసి, మరోలా అర్థం చేసుకున్నారు. 

పుస్తకం రీప్రింట్ చేసినప్పుడు మొత్తం పేర్లను తీసేసి ఎడిట్ చేస్తాను.  

కట్ చేస్తే - 

అప్పుడు 2018 జనవరిలో, ఆ వ్యాసం ప్రారంభానికి అలవోకగా నేను ఎత్తుకున్న లీడే ఆ పేర్లు తప్ప, అది మన సోషల్ మీడియా సైన్యం డైరెక్టరీ కాదు అన్న పాయింట్ స్పష్టంగా బ్లాగులో తెలిపాను. 

దయచేసి "అందులో నా పేరు లేదు" అని ఎవ్వరూ బాధపడకూడదని విజ్ఞప్తి. 

కేసీఆర్ సోషల్ మీడియా సైన్యం ఇంటెన్సిటీ, అవసరం గురించి చెప్పడమే ఇక్కడ ప్రధానం తప్ప వ్యక్తులు కాదని మరొక్కసారి నా సవినయ మనవి.

లక్ష్యం ముఖ్యం.

వ్యక్తులు కాదు! 

Saturday 13 August 2022

కొన్ని జ్ఞాపకాలుగానే బాగుంటాయ్!


మా అమ్మానాన్నలకు మేం అందరం అబ్బాయిలమే. నాకు కూడా ఇద్దరూ అబ్బాయిలే.  

ఇది ఒక లోటు అని మా పేరెంట్స్ ఇద్దరూ బాగా ఫీలవుతుంటే నేను లైట్ తీసుకునేవాణ్ణి. కాని, ఇంట్లో ఒక అమ్మాయైనా లేకపోవడం నిజంగా లోటేనని నాకు పాతికేళ్ళు దాటాక అర్థమైంది.

కొన్ని షేర్ చేసుకోడానికో, కొన్ని దాచుకోడానికో, కొన్ని సహాయాలు అడగడానికో... ఒక అక్కో చెల్లో నిజంగా అవసరం. 

నా జీవితంలోని ఒకటి రెండు సందర్భాల్లో నేను ఇది బాగా ఫీలయ్యాను. కాని, ఎప్పుడూ ఎవ్వరిదగ్గరా బయటపడలేదు. 

కట్ చేస్తే - 

మా చిన్నప్పుడు (వరంగల్లో) మా చిన్నమ్మల కూతుళ్ళు - ఇందిర, మంజుల - ఇద్దరూ ప్రతి రాఖీ పండుగకు టంచన్‌గా టైమ్‌కు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. ఈసారి ఏ మాడల్ రాఖీలు తెస్తారా అని గెస్ చేస్తుండేవాళ్లం. చాలా ఆనందంగా గడిచేది. 

ఇలాంటిదే - ప్రతి మూడేళ్ళకో, నాలుగేళ్ళకో ఒకసారి "కుడుకలు ఇవ్వటం" అనే పండుగ లేదా సీజన్ ఒకటి వచ్చేది. ఇందిర, మంజుల వచ్చి మాకు కుడుకలు ఇచ్చి, నోటి నిండా చక్కెర పోసేవారు. ఈ పండుగ సమయంలో కూడా ఇందిర, మంజుల ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్లం మేము. 

కట్ చేస్తే - 

1983లో నేను వరంగల్ వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చాను...

హైద్రాబాద్‌లో నేను హెచ్ ఎం టి లో పనిచేస్తున్నప్పుడు నా రూమ్‌కు పోస్ట్ ద్వారా వచ్చేవి రాఖీలు. తర్వాత యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు ఓయూలో నా హాస్టల్‌కు కూడా పోస్ట్‌లో వచ్చేవి రాఖీలు. తర్వాత నేను నవోదయ విద్యాలయ, గుంటూరులో పనిచేస్తున్నప్పుడు, ఆలిండియా రేడియో ఎఫ్ ఎం కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మా ఇందిర, మంజుల రాఖీలను పోస్టులో కనీసం ఒకరోజు ముందుగానే చేరేలా పంపేవాళ్ళు. నా పెళ్లయిన కొత్తలో కూడా ఒకటి రెండేళ్ళు రాఖీలు హైద్రాబాద్‌కు పోస్టులో వచ్చాయి.  

అంతే... 

క్రమంగా రాఖీలు పోస్టులో రావడం ఆగిపోయింది. కుడుకలు ఇచ్చే పండుగ గురించి పూర్తిగా మర్చిపోయాను. 

తర్వాత్తర్వాత మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువసార్లే. 

మా మధ్య దూరాలు కూడా ఎంతగా పెరిగాయంటే - అక్కడ వరంగల్లో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవడానికి కూడా నేను గుర్తుకురానంతగా! ఒకవేళ గుర్తుకొచ్చినా - ఏ వాట్సాప్‌లోనో ఒక మెసేజ్ (కాల్ కూడా కాదు!) పెట్టేసి వదిలేసేటంతగా!! 

అయితే - ఇది ఎవ్వరి మీదా నా కంప్లైంట్ కాదు. 

జస్ట్... మన ఆలోచనల్లో, మన జీవనశైలిలో వచ్చిన మార్పు గురించి ఒక అవలోకనం చేసుకోవడం. అంతే. 

మానవసంబంధాలను అమితంగా ప్రభావితం చేసిన ఈ మార్పు గురించి నేనిప్పుడసలు ఏమాత్రం బాధపడటం లేదు. 

ఎందుకంటే - ఎవరు ఎలా మారినా, ఏవి ఎలా మారినా - అవన్నీ చిన్నప్పటి నా జ్ఞాపకాలను ఏ మాత్రం మార్చలేవు.  

Friday 12 August 2022

యాదగిరిగుట్టలో డూప్లెక్స్ విల్లా ఎందుకు కొనాలి?


ప్ర: ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు?
జ: ఏ ఇతర ఇన్వెస్ట్‌మెంట్లలో రానన్ని రిటర్న్స్ ఇందులో వస్తాయి కనుక... ఇతర అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఉండే రిస్క్ ఇందులో ఉండదు కనుక. 

కట్ చేస్తే - 

యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి అతి దగ్గరలో, స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మేమిప్పుడు లగ్జరీ డూప్లెక్స్ విల్లాలు అమ్ముతున్నాం. 

ముఖ్యంగా, 133 గజాల్లో 2BHK డీలక్స్ విల్లాలు హాట్‌కేక్స్‌లా సేలవుతున్నాయి. 

ఎందుకని?
అంత స్పెషల్ ఏంటి?

> 36 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఇది. 
> 500 లగ్జరీ డూప్లెక్స్ విల్లాలు. 
> రోడ్స్, కరెంట్, వాటర్ కనెక్షన్, డ్రైనేజి వంటి వేసిక్ అమెనిటీస్ అన్నీ పూర్తయ్యాయి. 
> గ్రీనరీ కోసం ప్లాంటింగ్ కూడా అయిపోయింది. 
> కొనుక్కున్న కస్టమర్స్‌కు విల్లాలు కట్టడం ఆల్రెడీ ప్రారంభించాం.  
> సుమారు 5 ఎకరాల్లో "క్లబ్ హౌజ్" నిర్మిస్తున్నాం. దీన్లో: జిమ్, యోగా, స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రెన్స్ పార్క్, బార్, రెస్టారెంట్, బాంక్వెట్ హాల్, ఎట్సెట్రా ఎన్నో ఉన్నాయి.
> పక్కనే బస్వాపూర్ రిజర్వాయర్ ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. 
> సురేంద్రపురి, శిల్పారామం, స్వామివారి సన్నిధి... అన్నీ అతి దగ్గరలోనే!
> వీకెండ్స్‌లో కుటుంబంతోనో, ఫ్రెండ్స్‌తోనో ఎంజాయ్ చెయ్యడానికి మీకు సొంతంగా ఒక రిసార్ట్ ఉన్నట్టే!!
> ఏడాదికి 15 రోజులు ఫ్రీ స్టే! 
> ప్రతి నెలా రెంట్ గ్యారంటీ! 
> మీ ప్రొఫైల్‌ను బట్టి 70% బ్యాంక్ లోన్ వస్తుంది.
> ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఈ యాదగిరిగుట్టలో - చూస్తుంటే ఇంకెంతో డెవలప్‌మెంట్ మీరూహించని స్థాయిలో జరగబోతోంది. అంటే - కేవలం ఒక రెండు మూడేళ్ళలోనే మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు వాల్యూ చాలా చాలా పెరుగబోతోంది. 

ఇవి చాలనుకుంటాను... ఇక్కడ మీరు విల్లా కొనాలా వద్దా అన్న అంచనా వేసుకోవడానికి. 

ఈ ఆదివారం, 14 వ తేదీ, మా "సైట్ మేలా"కు రండి.  ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ & లంచ్ సౌకర్యం ఉంది.     

శ్రావణ మాసం సందర్భంగా, విల్లా ధరలో, మీరు ఊహించని స్థాయిలో సెన్సేషనల్ తగ్గింపు ఆఫర్ ఉంది. టోకెన్ అడ్వాన్స్‌తో సొంతం చేసుకోండి! 

Don't Miss It! 

పూర్తి సమాచారం కోసం కాల్ చేయండి: 9989578125  

"The Best Investment on Earth is Land!"

Thursday 11 August 2022

"కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం కొనుక్కోవడం ఎలా?


జూలై 5 వ తేదీనాడు గౌరవ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించిన నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఇప్పుడు 4 చోట్ల అందుబాటులో ఉంది:

2. నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ, హైద్రాబాద్: 040-24652387, 9000413413 
3. పాలపిట్ట బుక్స్, సుందరయ్య పార్క్, బాగ్ లింగంపల్లి, హైద్రాబాద్: 9848787284, 9490099327  
4. స్వర్ణసుధ పబ్లికేషన్స్, ఎర్రగడ్ద, హైద్రాబాద్: 8142626944, 9989578125

బుక్ కావల్సినవారు పై నంబర్స్‌లో దేనికి కాల్ చేసినా మీకు వివరాలు చెప్తారు. ఆ ప్రకారంగా ప్రొసీడ్ అయ్యి, పుస్తకాన్ని కొరియర్-లేదా-రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు. 

తెలుగుబుక్స్.ఇన్ కూడా అంతే. ఆన్‌లైన్‌లో మీ పేమెంట్ అయిపోద్ది. వాళ్ళు మీకు పుస్తకం పంపిస్తారు.     

కట్ చేస్తే -

ఈ పుస్తకం రాయడం వరకే నా పని. స్వర్ణసుధ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. పైన చెప్పిన నాలుగు చోట్ల పుస్తకాన్ని అమ్ముతున్నారు. 

ఇది లాభాపేక్షతో చేసిన పనికాదు. 

కేవలం కేసీఆర్ పైన, తెలంగాణ పైన అభిమానంతో - పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న దృక్పథంతో రాశాను. పబ్లిష్ చేశాను. ఇదే విషయం చాలా స్పష్టంగా ఈ పుస్తకం రేట్ పేజిలో (VTP/వెర్సో ఆఫ్ ది టైటిల్ పేజి) తెలిపాను. 

పుస్తకం ప్రోలోగ్‌లో కూడా ఈ పుస్తకం నేనెందుకు రాశాను అన్నదాని మీద మరింత వివరంగా తెలిపాను. 

చదివిన ప్రతి ఒక్కరూ పుస్తకం చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తుండటం నాకు చాలా ఆనందాన్నిస్తోంది.

చాలా మంది నేరుగా ఆయాచోట్లకు వెళ్ళి కొనుక్కుంటున్నారు. లేదా, అయా నంబర్స్‌కు కాల్ చేసి, ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి, కొరియర్-లేదా-రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తెప్పించుకొంటున్నారు. 

మొత్తానికి నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం హాట్ కేక్‌లా సేలవుతోంది. 

పుస్తకం అందగానే మిత్రులంతా ఉత్సాహంగా సొషల్ మీడియాలో ముందు పుస్తకంతో ఫోటోలు పెడుతున్నారు. చదివిన తర్వాత రివ్యూలు కూడా పోస్ట్ చేస్తున్నారు. 

సుప్రసిద్ధ సౌండ్ ఇల్యూజనిస్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు తన రివ్యూను ఏకంగా ఒక 3 నిమిషాల అద్భుతమైన వీడియో బైట్ రూపంలో అందించడం విశేషం. 

అందరికీ నా ధన్యవాదాలు.    

కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ పుస్తకాన్ని ఇప్పటికే విదేశాల్లో లండన్, కెనెడా, ఆస్ట్రేలియా, జెర్మనీ, అమెరికా, సౌతాఫ్రికా దేశాల నుంచి కూడా కేసీఆర్ అభిమానులు ఆర్డర్ పెట్టి కొనుక్కున్నారు. పుస్తకం ఆయా దేశాలకు ఇప్పటికే చేరింది. 

అయితే - టీఆరెస్ ఎన్నారై శాఖలున్న మొత్తం 52 దేశాలకు కూడా ఈ పుస్తకం చేరాలన్నది నా అభిలాష. నా ఆశయం. 

ఆయా ఎన్నారై టీఆరెస్ శాఖల అధ్యక్షులు, సభ్యులు కొందరు ఈ విషయంలో ఇప్పటికే స్పందించారు. టీఆరెస్ లండన్ శాఖ ఫౌండర్, ఇప్పడు ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు. 

కట్ చేస్తే - 

మా స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ & స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి సహృదయంతో ఇచ్చిన అనుమతితో ఇప్పటికే కనీసం ఒక 300 వరకు పుస్తకాలను కేవలం కాంప్లిమెంటరీగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలకు ఉచితంగా అందించాను. అయితే - ఒక ఉద్యోగిగా నాకుండే పరిమితులు మీకు తెలియంది కాదు. 

"మనోహర్ నాకు పంపించలేదు" అని మాత్రం దయచేసి ఎవ్వరూ అనుకోవద్దని మనవి... అర్థం చేసుకుంటారని నమ్మకం. 

మరోవైపు - కేసీఆర్ డైహార్డ్ ఫ్యాన్‌గా, తెలంగాణ, టీఆరెస్ అభిమానిగా... మిత్రుడు నవీన్ కుమార్ భువనగిరి, లండన్ నుంచి బల్క్‌గా పుస్తకాలకు ఆర్డర్ పెట్టి - ఇక్కడ లోకల్‌గా ఉన్న ఎందరో కేసీఆర్ అభిమానులకు, టీఆరెస్ వారియర్స్‌కు ఉచితంగా పుస్తకం పంపిస్తుండటం చాలా గొప్ప విషయం. నిన్న కూడా ఇంకో బల్క్ ఆర్డర్ పెట్టారు నవీన్.

నిజంగా హాట్సాఫ్ టు నవీన్ కుమార్ భువనగిరి! 

అయితే - నవీన్ కుమార్ భువనగిరి లాంటి కేసీఆర్, తెలంగాణ అభిమానులు కనీసం ఇంకో నలుగురయిదుగురు ముందుకురావడం అవసరం. 

ఎందుకంటే - ఇంకా చాలామంది మిత్రులు పుస్తకం కోసం మా ఇన్‌బాక్సుల్లోకి మెసేజెస్ పంపిస్తున్నారు. 

వీరిలో కొనగలిగినవారుంటారు. కొనలేని వారుంటారు. వారు ఎవరైనా సరే, ఈ పుస్తకం చదవాలకున్న ప్రతి కేసీఆర్ ఫ్యాన్‌కు దీన్ని చేర్చడం మన బాధ్యత.  

Sunday 7 August 2022

మహాసముద్రాలు దాటిన "కేసీఆర్" అభిమానం!


ఎర్రగడ్డ డీటీడీసీ నుంచి రోడ్లూ హైవేలూ, నదులు, పర్వతాలు, ఎవరెస్టులు, సముద్రాలు, మహాసముద్రాలు దాటేసుకొని... సుమారు 7700 కిలోమీటర్లు అకాశమార్గంలో ప్రయాణం చేసి, కొంచెం ఆలస్యంగానైనా, సరిగ్గా ఫ్రెండ్‌షిప్ డే రోజు నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" లండన్ చేరుకుంది. 

లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను రాసిన కేసీఆర్ పుస్తకం చేత్తో పట్టుకొని నా మిత్రుడు తీసుకొన్న ఫోటోలు చూస్తే ఒక్కసారిగా గూస్‌బంప్స్ రావా?  


లండన్‌లోని అత్యంత ఎత్తైన రూఫ్ గార్డెన్ (టాలెస్ట్ బిల్డింగ్) మీదకెక్కితే అక్కడనుంచి వెనకెక్కడో చిన్నగా కనిపిస్తుంటాయి లండన్ బ్రిడ్జ్, దాని కింద థేమ్స్ నది. అంత ఎత్తుకెక్కి... నిల్చుని కాసేపు, ఆరామ్‌గా కూర్చొని కాసేపు, చేతిలో కేసీఆర్ పుస్తకాన్ని తిరగేస్తుంటే ఎలా ఉంటుంది ఆ అనుభూతి? అలాంటి అనుభూతినే గుండెలనిండా నింపుకొని, అంత ఎత్తుకెక్కి నా మిత్రుడు తీసుకొన్న ఫోటోలు చూసిన మొట్టమొదటివాణ్ణి నేనైనప్పుడు ఇంకెలా ఉంటుంది నాకు?

కళ్ళు చెమర్చవా? 


కేసీఆర్ పట్ల, తెలంగాణ పట్ల నా ఈ మిత్రునికున్న అభిమానం గురించి ఇంతకుముందే నా బ్లాగ్‌లో రాశాను. 

ఆ అభిమానం ఎంత అంటే... అక్కడ లండన్ నుంచే ఆర్డర్ పెట్టి, ఇక్కడున్న ఎందరో తనతోటి కేసీఆర్ అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని ఒక గిఫ్ట్‌గా పంపించేంత!    


ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మర్చిపోకూడదనుకొనేవాడు... అలా ఉన్నప్పుడే సాటిమనిషిపట్ల ప్రేమ, మానవత్వం అనేవి అతి సహజంగా మనలో ఎప్పుడూ బ్రతికే ఉంటాయి అన్నది మనసా-వాచా-కర్మేణా నమ్మి ఆచరిస్తున్నవాడు... నేలమీదుండే మనిషి, నిగర్వి... నవీన్  కుమార్ భువనగిరి నా మిత్రుడు అని చెప్పుకోవడం నాకు మాత్రం గర్వంగానే ఉంటుంది. 

నిరంతరమ్ జ్ఞానోదయమ్!


మన ప్రమేయం లేకుండానే కొన్ని కొన్నిసార్లు ఒకరోజు చాలా చెత్తగా గడిచిపోతుంది. నెగెటివిటీ మనచుట్టూ కమ్ముకుంటుంది. పెయిన్ ఉంటుంది. మానసికంగా గాయపడతాం. 

ఇవన్నీ అసలు మన ప్రమేయం లేకుండానే, మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే జరుగుతాయ్ ఒక్కోసారి, ఒక్కోరోజు. 

నిన్నంతా నాకు అలాగే గడిచింది.

అయితే - ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అయ్యాం, ఎంత పాజిటివ్‌గా ఉన్నాం అన్నదానిమీదే మన తర్వాతిరోజు ఆధారపడి ఉంటుంది. 

కట్ చేస్తే - 

సమయం వృధా అయిపోతుంది అని బాధపడటం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. 

సమయం ఎప్పుడూ వృధా కాదు. అసాధ్యం. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మనమే వృధా అవుతాం. 

జీవితంలో ప్రతి ఒక్కరోజు విలువైందే. అది తిరిగిరాదు. ఈ నిజాన్ని అర్థం చేసుకొని, సమయానికి విలువ ఇచ్చినప్పుడు జీవితంలోని ప్రతి పార్శ్వం అద్భుతంగా ఉంటుంది. 

దురదృష్టవశాత్తు ఈ జ్ఞానోదయం చాలామందికి చాలా ఆలస్యంగా అవుతుంది.    

“Always remember, your focus determines your reality.”
— George Lucas

Saturday 6 August 2022

థియేటర్లు అవే, రేట్లూ అవే, ప్రేక్షకులూ వాళ్ళే!


బింబిసార, సీతారామం... నిన్న రిలీజైన ఈ రెండు సినిమాలూ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. థియేటర్లలో వసూళ్ళు కూడా బాగున్నాయి. 

ఈమధ్య రిలీజై-అట్టర్ ఫ్లాపైన కొన్ని సినిమాలతో పోలిస్తే వీటి వసూళ్ళు సూపర్ డూపర్‌గా ఉన్నాయి. చెప్పాలంటే - పిచ్చి కలెక్షన్స్ అన్నమాట! 

ఇంక - రివ్యూల విషయానికొస్తే - షరా మామూలే...  

ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ సాగింది. ..సెకండాఫ్ అద్భుతంగా ఉంది, ఫస్టాఫే సాగింది... ఇలా ఎవరికి తోచింది వాళ్ళు, వాళ్ళ వాళ్ళ టేస్టులనుబట్టి, వాళ్ళ వాళ్ళ 'బ్రాండ్ ఇమేజ్‌'ను బట్టి, రివ్యూయర్స్ ఏదో ఒకటి రాసేసి వాళ్ళ తిప్పలేదో వాళ్ళుపడ్డారు.  

నేనింకా బింబిసార చూళ్ళేదు కాని, నేను నమ్మే కొందరు రెగ్యులర్ సినీగోయర్స్ ద్వారా తెలుసుకున్నదేంటంటే - 

టైం ట్రావెల్ కథ బింబిసారలో కళ్యాణ్‌రాం బాగాచేశాడు. అసలీ సినిమా కథ ఒప్పుకొని భారీ రిస్క్ చేసిన కళ్యాణ్‌రాం నమ్మకం నిజమైంది.  హిట్ కొట్టాడు. ఆ సినిమా ప్రిరిలీజ్ పంక్షన్లో అనుకుంటాను... జూనియర్ ఎన్‌టీఆర్ చెప్పింది అక్షరాలా నిజమైంది.

Congrats to the Team of Bimbisaara...

ఇక సీతా రామం...

Hearty Congrats to Hanu Raghavapoodi, Swapna Cinema & Vaijayanthi Movies!

రాత్రే చూశాను. 

విజువల్ ట్రీట్. క్లాసిక్ ప్రేమ కథ.

సెన్సిబుల్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు రెండోసారి, మూడోసారి చూడ్డానికి కూడా థి-యే-ట-ర్ల కే వెళ్ళొచ్చు! 

దుల్కర్ అండ్ మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ బాగుంది. అసలీ రామం పాత్రకు తెలుగులో ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది చాలాసార్లు. వేరే ఇంకెవరైనా "డీక్యూ"లా ఆహా అనిపించడం కష్టం.     

ఇంక మృణాల్ ఠాకూర్... చెప్పేదేముంది... She's so lovely! 

ఆమె మెథడ్ యాక్టింగ్, లుక్స్, స్మైల్, స్లిమ్ ఫిగర్, రొమాన్సింగ్... Simply fascinating...

కట్ చేస్తే -     

జనాలు థియేటర్లకు రావట్లేదని ...మన ఇండస్ట్రీవాళ్ళు సినిమా షూటింగ్స్ అపేశారు. ఏం చెయ్యాలా అని నానా రకాల బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు. 

అయితే, జస్ట్ 2 నెలల కిందనే - విక్రమ్, మేజర్ సినిమాలు కూడా ఇలాగే హిట్టయ్యాయి.   

సేమ్ టు సేమ్... నిన్న  కూడా... ఒకేరోజు రిలీజ్ అయిన రెండు సినిమాలూ హిట్ అయ్యాయి.  కలెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి.   

ఇవాళ రేపు... వీకెండ్ కలెక్షన్ ఇంకా పెరుగుతుంది. 

మరి... థియేటర్లు అవే, రేట్లూ అవే. ప్రేక్షకులు కూడా అదే ప్రేక్షకులు. 

జస్ట్... సినిమాలే మారాయి. 

సో... వాట్ నెక్స్‌ట్? ఇప్పుడు మేధోమథనం ఏ విషయంలో జరగాలి?   

ఎవరు మారాలి? ఏవి మారాలి? ఎలా మారాలి? ఎందుకు మారాలి? 

ఇప్పుడదే మనవాళ్ల ముందున్న మిలియన్ డాలర్ కొశ్చన్!   

Thursday 4 August 2022

ఇంకెన్నాళ్ళీ వాట్సాప్ కథలు?


మన చదువులు మన వివేచనా శక్తికి కొలమానాలు కావు అని చెప్పడానికి ఈ మధ్య చాలా ఎక్కువ ఉదాహరణలు చూస్తున్నాను.

మనకు గుడ్డిగా ఒక హీరో మీదనో, ఒక హీరోయిన్ మీదనో ఇష్టం ఉండొచ్చు. దానివల్ల నష్టం లేదు. అది సినిమాలవరకే పరిమితం. 

కాని, రాజకీయాల్లో అలా కాదు. 

అంత గుడ్డిగా ఎవరినీ ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫాలో అయితే, కనీసం ఒక కనీస స్థాయి లాజిక్‌కు మన వాదన, మన ఫాలోయింగ్ నిలబడగలగాలి. 

కట్ చేస్తే -  

రాజకీయాల్ని నేను పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. కాని, మన జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని రాజకీయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు కూడా రాజకీయాల్ని పట్టించుకోకుండా ఉండటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి ఫూలిష్ బాక్స్‌లో నేనుండలేను. నాకు ఊపిరాడదు.  

ఈ నేపథ్యంలోనే నేను రాసి, ప్రచురించిన పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్". 

సరిగ్గా నెల క్రితం, జులై 5 వ తేదీనాడు, ట్విట్టర్‌లో నాకు మాట ఇచ్చినట్టుగానే - ప్రగతిభవన్‌లో నా పుస్తకాన్ని లాంచ్ చేశారు... మన డైనమిక్ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.   

గత ఎనిమిదేళ్ళలో ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నేతృత్వంలో వచ్చిన భారీ మార్పులు, తెచ్చిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చూపిస్తున్న అద్భుత ఫలితాలు, పార్టీలతో ప్రమేయం లేకుండా వీటన్నింటిని శ్లాఘిస్తున్న ప్రపంచం... ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్న నిజాలు. 

మరోవైపు - వాస్తవాలు, కనీస లాజిక్స్‌తో సంబంధం లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజెస్ ఫార్వార్డ్స్‌కే అంకితమైన ఒక సమూహం. ఈ సమూహంలో ఏదో పెద్దగా చదువుకోనివాళ్ళు మాత్రమే ఉన్నారనుకోడానికి వీళ్లేదని నా వ్యక్తిగత అనుభవంలో ఈ మధ్య బాగా తెలుస్తోంది. 

డిగ్రీలు, పీజీలు చదివి, మంచి మంచి ఉద్యోగాల్లో-వ్యాపారాల్లో ఉన్నవారు కూడా వీరిలో కోకొల్లలుగా ఉండటం పెద్ద విషాదం.   

థాంక్స్ టు కేసీఆర్... పైన నేను పెట్టిన ఫోటో క్రిస్టల్ క్లియర్‌గా తెలంగాణలో ఈ ఎనిమిదేళ్ళలో జరిగిన అభివృద్ధిని గురించి నాలుగు ముక్కల్లో చెప్తోంది. 

ఇదే ఎనిమిదేళ్ళలో - జాతీయస్థాయిలో గాని, తత్ పార్టీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో గాని, ఇంకే రాష్ట్రంలో గాని... ఈ స్థాయిలో, ఈ నాలుగు కోణాల్లో జరిగిందా? 

ఒకవేళ జరిగింది అంటే ఉదాహరణలివ్వండి. మీరు సాధించినవి కాలర్ ఎగరేసి ఇలా చెప్పుకోండి. అందరూ తప్పక మెచ్చుకుంటారు. 

వీటిని పక్కనపెట్టి... వాడు ఈ బట్టలేసుకోవద్దు, వీడు ఇది తినొద్దు, ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తాం, గార్భా డాన్సుకు కూడా పన్ను వేస్తాం, ఈడీల్ని పంపుతాం, అరెస్టులు చేస్తాం... అసలేందివన్నీ? 

ఇంకెన్నాళ్ళు ఇలాంటి డైరెక్ట్‌గా సమాధానం చెప్పలేని, డైరెక్ట్‌గా మొహం చూపలేని ఈ  వాట్సాప్ కథలు? 

75 సంవత్సరాల వజ్రోత్సవ వేళ... కనీసం ఇకనుంచయినా దేశం కోసం ఆలోచించండి... ప్రజల కోసం అలోచించండి. 

రాజకీయాలంటే దోపిడీ, దుర్మార్గం కాదు.

దార్శనికత. 

అది మా కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది...

Tuesday 2 August 2022

మనోహర్ చిమ్మని - పరిచయం | For Ready Reference


మనోహర్ చిమ్మని వరంగల్‌లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలోనూ, లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్సెస్ లోనూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పీజీ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. జర్నలిజం, అడ్వర్టైజింగ్ అంద్ మేనేజ్‌మెంట్ సబ్జక్టుల్లో పీజీ డిప్లొమా చేశారు. రష్యన్ భాషలో మూడేళ్ళ అడ్వాన్స్‌డ్ డిప్లొమా చేశారు.   

మనోహర్ చిమ్మని పేరుతోనూ, వివిధ కలంపేర్లతోనూ వీరు రాసిన వ్యాసాలు, ఫీచర్లు, కథలు, సీరియల్స్ మొదలైనవి అన్ని ప్రధాన పత్రికల్లో అచ్చయ్యాయి. రేడియోలో కూడా ప్రసారం అయ్యాయి. రష్యన్ నుంచి నేరుగా తెలుగులోకి అనువదించిన వీరి అనువాద కథలు కూడా విపుల, ఆంధ్రజ్యోతి వీక్లీ, ఉజ్వల వంటి పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 

మనోహర్ చిమ్మని రాసిన "ఆధునిక జర్నలిజం" పుస్తకం కాకతీయ యూనివర్సిటీలో పీజీ స్థాయిలో రికమండెడ్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. వీరు రాసిన "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం 'సినిమారంగంలో ఉత్తమ పుస్తకం'గా నంది అవార్డు గెల్చుకొంది.  

గతంలో - హెచ్ఎమ్‌టి, నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో వంటి మూడు కేంద్రప్రభుత్వ సంస్థల్లో వివిధ హోదాల్లో సుమారు పదిహేనేళ్ళ పాటు పనిచేశారు మనోహర్ చిమ్మని. ప్రస్తుతం స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ - ఫ్రీలాన్స్ రైటర్‌గా, ఫిలిం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.     

ఈ మధ్యే, 5 జులై 2022 నాడు, మనోహర్ చిమ్మని రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.    

దర్శకరచయితగా మనోహర్ చిమ్మని ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు. ఫ్రీలాన్స్ రైటింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ వీడియో మేకింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ప్రమోషన్... వీరి ఇతర ఆసక్తులు. 

థాంక్స్ టు కరోనా... ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా విషయాల్లో భారీ మార్పులొచ్చాయి. వెబ్ సీరీస్‌లు, ఓటీటీలు వంటి కొత్త ఆదాయ మార్గాలు పెరిగాయి. 

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడొక భారీ కార్పొరేట్ ఇండస్ట్రీగా రూపొందింది. చాలా విషయాల్లో బాలీవుడ్‌నే బీట్ చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగింది.  

ఇంతకు ముందు సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు.

కంటెంట్ ఈజ్ ద కింగ్. మనీ ఈజ్ ద అల్టిమేట్ గోల్.    

ఈ నేపథ్యంలో - రచయిత-దర్శకుడిగా, నిర్మాతగా పూర్తిస్థాయిలో సినిమాల నిర్మాణం చేపట్టారు మనోహర్ చిమ్మని.   

మైక్రో బడ్జెట్‌లోనే, సీరీస్ ఆఫ్ ట్రెండీ కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్స్ నిర్మించి అటు థియేటర్స్‌లోనూ, ఇటు ఓటీటీల్లోనూ వరుసగా సినిమాలు రిలీజ్ చేసే లక్ష్యంతో ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మనోహర్ చిమ్మని.   

ఈవైపు ఆసక్తి ఉన్న లైక్ మైండెడ్ కొత్త ఇన్వెస్టర్స్ మనోహర్‌ను కాంటాక్ట్ చేయొచ్చు. 

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం. 


-- Manohar Chimmani
Email: mchimmani10x@gmail.com
Whatsapp: +91 9989578125

Short AV on Manohar Chimmani: https://youtu.be/UiN7ffs2wuA 
 
Manohar Chimmani's Link-Tree: https://linktr.ee/mchimmani 

Follow me on Twitter: https://twitter.com/MChimmani 
Visit my Blog: https://nagnachitram.blogspot.com  

Monday 1 August 2022

My 'ABOUT' in English | For Ready ReferenceHey!

I’m Manohar Chimmani.

Film Director, Producer, Nandi Award Winning Writer, Blogger. 

Managing Director of Swarnasudha Projects Private Limited, Hyderabad. 

I’m a Life Member in Telugu Film Directors’ Association (TFDA) and Telugu Film Chamber of Commerce (TFCC).

From working as Machinist in workshops to becoming Nandi Award Winning Writer and Film Director, it’s an insatiably curious journey.

Let me take you through a brief journey of my life…

To name a few highlights of my academic career, I topped and won two Gold Medals in the two Post-Graduate courses I completed from Osmania University, Hyderabad. I topped my batch in Russian Advanced Diploma as well, which is a 3 year course equivalent to degree in Russian language. Later, I have also added post-graduate diploma courses in Journalism and Advertising & Management to the list.

Writing has always been part of my life. I wrote many short stories, articles, features, serials and plays in all the leading newspapers and magazines in Telugu and in Radio from my student days. I translated and published many Russian short stories into Telugu.

To quote a couple of achievements, my book “Adhunika Journalism” is listed as one of the text books for reference in the Department of Telugu at Kakatiya University, Warangal. My book on screen writing “Cinema Script Rachanashilpam” won the prestigious Nandi Award.

Very recently - I wrote a book on Hon Chief Minister of Telangana State KCR garu - with the title: "KCR - The Art of Politics", and the same was launched by Hon Minister and Working President of BRS, KTR garu.  

Professionally, I worked in three Central Government Organizations – HMT, Jawahar Navodaya Vidyalaya and All India Radio in various capacities for about 14 years and finally settled down as a Freelancer in different creative arenas.

So far, I made four feature films in Telugu as Writer-Director, as a hobby. Thanks to Corona, number of new big-income avenues like OTTs and Web Series, etc have been opened up in the field of film production. Now, I am fully into filmmaking as my prime profession as Writer, Producer and Director. 

My latest passionate project – a series of trendy commercial feature films is in pre-production stage. 

Likeminded and aspiring Film Investors are welcome for collaboration.

Please feel free to reach out to me. I look forward to a beautiful creative journey together.

Best Wishes,
Manohar Chimmani
 
Follow me on Twitter: https://twitter.com/MChimmani