Wednesday 24 April 2024

కొత్త ఫిమేల్ సింగర్స్ (4 గురు) వెంటనే కావాలి!

> మిలియన్స్‌లో మీ పాట ప్రపంచమంతా వినాలనుకుంటూన్నారా? 
> సెలబ్రిటీ ఫిలిం సింగర్ కావాలనుకుంటున్నారా? 

ఇది మంచి అవకాశం. 


ఈ యాడ్ చదవండి, అప్లై చేయండి. 
అప్లై చేసుకోడానికి చివరి తేది: 28-04-2024

email: mchimmani10x@gmail.com 

ఒక సినిమా, రెండు దారులు!


ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే – ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు. ఎంచుకొని తీరాలి. 

మొదటి దారి – మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని, దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం. 

రెండో దారి – మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయడం.

మొదటి దారిలో – మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎంతో కొంత ‘విషయం’ ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము. “నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. 

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. 

రెండో దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

ప్రతి వందమందిలో 5 గురు మాత్రమే ఈ బాటలో ఉంటారు.

మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు ఈ 5 గురు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు.

కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు, కాని ఫలితాలు మాత్రం అవే ఫాలో అవుతుంటాయి... విజయవంతంగా. 

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే...

ఒక్క 5 శాతం మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు.

95 శాతం మంది పనిలేకుండా బిజీగా ఉంటారు. 

ఇప్పుడు చెప్పండి... ఏ బిజీ మీకిష్టం? 

Tuesday 23 April 2024

కొత్త లిరిక్ రైటర్స్‌కు అవకాశం!

> టాలెంట్ ఉండి, "ఒక్క ఛాన్స్" కోసం చూస్తున్న కొత్త లిరిక్ రైటర్స్‌కు మాత్రమే ఈ అవకాశం 
> తెలంగాణ మాండలికంలో మేమిచ్చే ట్యూన్స్‌కు పాటలు రాయగలగాలి.


ఇంక మీదే ఆలస్యం!  

అప్లై చేసుకోడానికి చివరి తేది: 28 ఏప్రిల్ 2024. 
email: mchimmani10x@gmail.com 

Saturday 20 April 2024

రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్!


"మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి!” 

రజినీకాంత్ ఈ మాట ఊరికే అనలేదు. ఆయన అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వందలు చూసుంటారు. 

కట్ చేస్తే - 

ఒక టెక్నీషియన్‌గా తన పని, పరిమితుల పట్ల కనీస అవగాహన లేని అనుభవానికి అర్థం లేదు.  

డైరెక్టర్ విజువల్‌గా తనకు ఏం కావాలో, ఎలా కావాలో చెప్పి చేయించుకోడానికే కెమెరామన్. 

ఈ కనీస అవగాహన లేనిచోట ఈగో ఉంటుంది. "డైరెక్టర్‌కు నాకంటే బాగా తెలుసా" అన్న చిన్నచూపు ఉంటుంది. ఇంక, నానా ఫీలింగ్స్ ఉంటాయి. 

"అరుపులు కేకలు లేకుండా కూల్‌గా షూటింగ్ చేసుకుందాం" అని నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా అన్నందుకు, "యూనియన్‌కు వెళ్తా" అని ఒక సీనియర్ కెమెరామన్ నా సినిమా షూటింగ్ ఒకరోజు దాదాపు ఆపేసినంత పనిచేయడం నాకింకా గుర్తుంది. తర్వాత మేమిద్దరం మంచి మిత్రులమయ్యాం. అది వేరే విషయం. 

అద్భుతమైన స్కిల్ ఉండి కూడా, కేవలం ముక్కుమీద కోపం, ఇలాంటి చిన్న చిన్న ఈగోల వల్ల ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎందరో ఉంటారు. ఎన్ని అవలక్షణాలున్నా కొందరు మాత్రం అంత త్వరగా ఎగ్జిట్ కారు. ఆ కొందరికి కొన్ని ఎక్‌స్ట్రా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అలా వదిలేద్దాం. 

కట్ చేస్తే - 

ఇప్పటికే నాలుగైదు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్‌లంటే నాకు చాలా ఇష్టం. 

ఎక్కడా తడబడకుండా, స్పష్టమైన తెలుగులో ధారాళంగా మాట్లాడతారు. తను చెప్పాలనుకున్న పాయింట్ నుంచి అంత సులభంగా డీవియేట్ అవరు. స్వల్పంగా అలా కాస్త పక్కకెళ్ళినా, చివరకు ఒక మాంచి మేకు దిగ్గొట్టినట్టుగా తను చెప్పాలనుకున్నది చెప్పి స్పీచ్ ముగిస్తారు. 


ఇవ్వాళ "ఎక్స్"లో ఆయన లెటర్ హెడ్ మీద రాసి పెట్టిన పోస్టు చూశాక ఈ బ్లాగ్ రాయాలనిపించింది...

ఎంతయినా తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్, తనకంటే సీనియర్ అయిన కెమెరామన్ మీద ఈ పోస్టు పెట్టడానికి ముందు ఆయన ఎంత మథనపడివుంటారు? ఎంత బాధపడివుంటారు? 

టీవీచానెల్స్‌లోనో, యూట్యూబ్ చానెల్స్‌లోనో ఎన్నయినా ఇంటర్యూలిచ్చుకోవచ్చు. ఆయా చానెల్స్ కోరుకొనే ఏ బుల్‌షిట్ అయినా మాట్లాడుకోవచ్చు. కాని, ఇంకొకరిని బాధపెట్టేలా కాదు. 

నీకు మరీ అంత కోరిక ఉంటే డైరెక్టర్ కావచ్చుగా?

కాలేకపోతే అక్కడితో మర్చిపో.

అంతే కాని, ఇంకో శాఖలో పనిచేస్తూ, తనే డైరెక్టర్ అయినట్టుగా ఫీలవ్వటం, అలాంటి భ్రమలో ఉంటూ డైరెక్టర్స్‌ను ఇలా కెలకటం, బాధపెట్టడం నిజానికి అందరూ చేయరు. 

చేసే కొందరితోనే సమస్య. 

అప్పటికప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను కెమెరామన్‌ను చేసి, సక్సెస్‌ఫుల్‌గా సినిమా పూర్తిచేసి, హిట్ చెయ్యగలిగిన రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్.   

పి సి శ్రీరాం, రవి కె చంద్రన్, అనిల్ మెహతా, రాజీవ్ మీనన్, సంతోష్ శివన్ లాంటి గొప్ప కెమెరామెన్ల యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలు నేను చూసినట్టు గుర్తులేదు. ఒకవేళ వారి ఇంటర్వ్యూలు ఉన్నా, "అంతా నేనే" అన్న పనికిరాని ఈగోతో మాట్లాడివుండరు. వారు కలిసి పనిచేసిన డైరెక్టర్స్ గురించి తప్పుగా అసలు మాట్లాడివుండరు.  

Because they know very well that the cinematographer is essentially translating the director's vision into imagery, not engaging in any politics.  

- Manohar Chimmani 

Friday 19 April 2024

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు!


6 గురు మ్యూజిక్ డైరెక్టర్స్... 

ఒకరు 21 సినిమాలు చేశారు. ఇంకొకరు 11 సినిమాలు చేశారు. ఇంకొకరు 3 సినిమాలు ఒకేసారి ఇప్పుడు, రైట్ నౌ, చేస్తున్నారు. ఇంకో ఇద్దరు మ్యూజిక్ లోనే బాగా సంపాదిస్తూ పిచ్చి బిజీగా ఉన్నారు. 

ఈ 6 గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌లో దాదాపు అందరికీ సొంత రికార్డింగ్ సెటప్స్/స్టూడియోలు ఉన్నాయి. ఒకరికి 3 నగరాల్లో 3 స్టూడియోలున్నాయి. 

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో కావల్సినంత ఉంది. ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో యునిక్. 

పైగా, అందరికీ ఫీల్డులో ఎన్నెన్నో అనుభవాలున్నాయి.   

వీరందరితో ఇంటర్వ్యూలు #Yo ఆఫీసులో జరిగాయి. ఈ ఆరుగురూ #Yo లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు... ఏ క్షణం ఓకే చెప్తానా అని! 

సినీఫీల్డులో ఒక అవకాశానికున్న విలువ అది.  

ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మా కోర్ టీమ్ మొత్తం నేను చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ చూశారు. 

సో వాట్? 

మా ప్రదీప్‌చంద్ర మాత్రం మాకు దొరకటం లేదు... అతనికంత టెన్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే - ఈ అవకాశం కోసం, పై 6 గురికి ఉన్న టెన్షన్లో కనీసం 0.001% కూడా లేదు. 

ప్రదీప్ ఎక్కడ మిస్ అవుతాడా అని నేను పర్సనల్‌గా పడుతున్న టెన్షన్లో కనీసం 0.0001% కూడా అతనికి లేదు. 

ఇది కూడా ఎలాంటి అతిశయోక్తి లేని నిజం.   

Monday 15 April 2024

నీ సుఖమే నే కోరుతున్నా...


మనం చూసే దృష్టిని బట్టే మనకు అన్నీ కనిపిస్తాయి...

మనుషుల్లో నేను మంచిని, గొప్పతనాన్ని, సంకల్పబలాన్ని, మానవత్వాన్ని చూస్తాను. కొందరు లేని చెడు కోసం ఎప్పుడూ తవ్వకాలు చేస్తుంటారు. 

అదొక అనారోగ్యం అనుకొని జాలిపడటం తప్ప మరేం చెయ్యలేం.

పడుతున్నాడు కదా అని ఎదుటి మనిషిని ఏ మాటపడితే అది అనడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలా ఏ మాటపడితే అది ఎలా అనగలుగుతున్నావో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. 

అందరూ ఒకలాగే ఉండరు. నువ్వు అనుకుంటున్నట్టు అసలు ఉండరు.

ఒక మనిషి గురించి ఒకసారి నువ్వు తప్పుగా ఆలోచించడం మొదలుపెడితే - అతను పుట్టినప్పటినుంచీ మనకు అతనిలో తప్పులే కనిపిస్తాయి. అతను దగ్గినా తుమ్మినా కూడా తప్పుగానే కనిపిస్తుంది. 

ఒకరివైపు మనం ఒక వేలు చూపిస్తున్నప్పుడు, మనవైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయో మనం తప్పక చూసుకోవాలి.

విత్ దట్ సెడ్...  

బహుశా కొన్ని అనారోగ్యాలు కూడా ఇలా చేయిస్తాయేమో అని కూడా ఆ వ్యక్తి గురించి నేను పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నాను. 

ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి బాధపడుతున్నాను. 

ఆ వ్యక్తి పైన జాలిపడుతున్నాను. 

ఆ అవ్యక్తిని ఇంకా ప్రేమిస్తున్నాను. 

అన్-కండిషనల్ సారీ చెప్పేదాకా, ఆ వ్యక్తిని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. 

కట్ చేస్తే - 

ముందూ వెనకా ఆలోచించకుండా - ఒక వ్యక్తికి - అత్యున్నత గౌరవమిచ్చి, ప్రేమనిచ్చి మాట్లాడటం కూడా తప్పే అని తెలుసుకోవడం ఈమధ్యకాలంలో నాకు మరొక కొత్త జ్ఞానోదయం. 

అయినా సరే, నీ సుఖమే నే కోరుతున్నా...             

***

(నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి, మరేదీ పట్టించుకోకుండా, అనారోగ్యం నుంచి అతిత్వరగా కోలుకోవాలని ఆశిస్తూ రాసిన బ్లాగ్ ఇది.)    

Wednesday 10 April 2024

2 ఆదాయం, 14 ఖర్చు


పంచాంగ శ్రవణాలు, రాశిఫలాలు, ఆదాయవ్యయాల పట్టికలు, రాజపూజ్యాలు... ఇవన్నీ నా చిన్నప్పటినుంచీ చూస్తున్నాను. 

అప్పట్లో వరంగల్లో, మా ఇంటికి కనీసం ఒక అరడజన్ వేర్వేరు పంచాంగాల కాంప్లిమెంటరీ కాపీలు ఉగాదికి ముందు రోజే వచ్చేవి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ రాశిఫలాలు, టేబుల్స్ చదివేవాన్ని. వాటిలో ఏ ఒక్క పంచాంగంలోని రాశిఫలాలు, ఇంకో పంచాంగంలోని రాశిఫలాలతో సమానంగానో దగ్గరగానో ఉండేవి కాదు. ఈ ఒక్క "ఇన్‌కమ్ & రెస్పెక్ట్" టేబుల్ తప్ప. 

అంత చిన్నతనంలోనే, ఈ పంచాంగాల్లోని దాదాపు ప్రతి పేజీ చదివి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.       

నా పద్దెనిమిదో యేట వరంగల్ వదిలి, హైద్రాబాద్ వచ్చాక ఇవి నాకెప్పుడూ కంటపడలేదు... తాజాగా గత 4, 5 ఏళ్ళుగా సోషల్ మీడియాలో రకరకాల రూపాల్లో చూడ్డం తప్ప.   

కట్ చేస్తే - 

మొన్న మా అసిస్టెంట్ డైరెక్టర్ లహరి ఈ లేటెస్టు క్రోధి నామ సంవత్సరం టేబుల్ చూపించి, "ఇది మనం బీట్ చెయ్యాలి సార్" అంది. 

"ఆల్రెడీ చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను" అని చెప్పాను. 

పంచాంగం ప్రకారం, గత సంవత్సరం నా ఆదాయం 14, వ్యయం 2. డబ్బు నిజంగానే చాలా వచ్చింది. కాని, ఒక్క పైసా మిగల్లేదు. టేబుల్ ప్రకారం చాలా చాలా మిగలాలి మరి! 

లేటెస్టుగా నేను చూసిన క్రోధి టేబుల్ ప్రకారం అయితే - నాకు ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14 అని ఉంది.

పోయిన సంవత్సరం టేబుల్‌కు పూర్తి రివర్స్ అన్నమాట! 

ఇదే నిజం అవుతుంది అనుకుంటే మాత్రం, ఇంత డిజాస్టరస్ ఇన్‌కమ్ ప్రెడిక్షన్ మైండ్‌లో పెట్టుకొని ఇంక నేనేం పనిచేస్తాను? చేసినా... నాకు వచ్చేది జస్ట్ 2, ఖర్చయ్యేది 14 అన్నప్పుడు, అసలు చెయ్యకుండా కూర్చోడం బెటర్ కదా?  

బట్, నో. 

నేను పనిచేస్తాను. నా టార్గెట్స్ రీచ్ అవుతాను. 

ఈ 2/14 ఈక్వేషన్ మాత్రం నా దరిదాపుల్లో ఎప్పుడూ లేదు, ఉండదు. 

విత్ దట్ సెడ్ - 

నేనేం నాస్తికున్ని కాదు. 

కాని, ఇలాంటి కొన్ని విషయాలు మాత్రం నాకు చిన్నప్పట్నుంచీ మంచి ఎంటర్‌టైన్మెంటునిస్తున్నాయి...  

Monday 1 April 2024

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు...


ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి, హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 67.

"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 77.  

2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 69. 

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఇప్పుడు పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించి, మల్టిపుల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అవి ఏవైనా కానీ, అతనిష్టం. పని చేస్తున్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 62. 

సో వాట్?!

నాగార్జునకు 64, చిరంజీవికి 68 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు?

మర్చిపోయాను...

తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమని ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 93.  

Age is just number. 

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్. 

Sunday 31 March 2024

అర్థవంతమైన జీవితం అంటే అది...


జస్ట్ ఒక అమ్మాయి. 
చాలెంజ్ చేసింది. 
టాప్ హీరోయిన్ అయ్యింది. 
బాలీవుడ్ రాజకీయాలతో విసుగొచ్చి, 
ఒంటరిగా హాలీవుడ్ వెళ్ళింది. 
అక్కడా అడ్డా సాధించింది. 
డబ్బూ, పేరూ సంపాదించుకొంది.

రైటర్ అయింది.
మోటివేషనల్ స్పీకర్ అయింది. 
ఇంటర్నేషనల్ లెవెల్లో! 

తనకంటే పదేళ్ళు చిన్నవాడైన 
ఒక అమెరికన్ పాప్ సింగర్‌ను 
ప్రేమించి పెళ్ళిచేసుకుంది.
అతను మన 
హిందూ సాంప్రదాయాలంటే 
పడిచచ్చేవాడిగా మారిపోడానికి 
కారణమైంది. 

మన పండుగలూ పబ్బాలూ 
తన రూట్సూ - 
ఏ ఒక్కటీ మర్చిపోకుండా... 
ఇప్పటికీ, 
సొంత ఊరికి వచ్చి
తనవారందరి మధ్య 
ఆనందంగా జరుపుకుంటుంది.

ఇప్పుడు మళ్ళీ హిందీలో, 
చాలా గ్యాప్ తర్వాత 
భన్సాలీ సినిమాలో 
హీరోయిన్‌గా చేయబోతోంది. 

గట్స్ అంటే అలా ఉండాలి.

సినిక్ విమర్శలు చేయడం, 
శాడిస్టిక్ రివ్యూలు రాయడం, 
చెత్త థంబ్‌నెయిల్స్ పెట్టడం లాంటి 
పాకీ పని కాదు. 
ఒక లక్ష్యం పెట్టుకొని
దాన్ని సాధించడం గొప్ప. 
అదే స్థాయిలో
ముందుకు దూసుకెళ్తుండటం గొప్ప. 


అర్థవంతమైన జీవితం అంటే అది... 
అర్థవంతమైన జీవితం అంటే నిజంగా అది...   
ఊరికే గాసిప్స్ రాయడం, 
అలాంటి చెత్త వీడియోలు చెయ్యటం కాదు.  
ఏరోజుకారోజు వృధాగా గడపటం 
అంతకన్నా కాదు. 

Thursday 28 March 2024

ఆ హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్


ఒక హీరోయిన్ ఫ్యాన్స్, ఆమె నటించిన లేటెస్ట్ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూసి, ఆమె ఆ సినిమాలో టూమచ్ గ్లామర్-షో చేసిందని, లిప్-లాక్స్ ఇచ్చిందనీ... ట్రోల్స్‌తో బాగా రెచ్చిపోయారు. ట్రోల్స్ ఎంత టూమచ్‌గా చేశారంటే, ఆ హీరోయిన్ తన సొంత సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు కూడా వెళ్ళకుండా హర్ట్ అయి అసలు బయటికి కదలలేనంతగా! 

ఆ హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్. 

ఆ సినిమా పేరు టిల్లూ స్క్వేర్. 

ఒక హీరోయిన్‌గా, తనకిష్టమైన పాత్రలో, తనకిష్టమైనట్టు నటించే ఫ్రీడమ్‌ను కాదనడానికి అసలు ఎవరు వీళ్ళంతా? 

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో ట్రోల్స్‌నే కాదు. మనం పెట్టిన పోస్టు కింద కామెంట్స్ కూడా పట్టించుకొంటే కష్టం. 

ఇలా ట్రోల్స్ చేసేవాళ్లందరినీ పట్టించుకుంటే అసలు మనం సోషల్ మీడియాలో ఉండలేం. సినిమాల్లో కూడా ఉండలేం. 

ఒక లిమిట్‌ను మించి ట్రోల్స్ చేసేవాళ్ళంతా ఒక మంద మెంటాలిటీకి చెందినవారు. ఎప్పుడూఒ ఒక రకమైన మాస్ హిస్టీరియాలో బ్రతుకుతుంటారు. 

ట్రోలింగ్ పేరుతో, ఇలాంటి సిక్ పేషంట్స్ చేసిన సొల్లును అంత సీరియస్‌గా పట్టించుకోవడం అనుపమ తప్పు. అసలు ట్రోల్స్ చదవడం కోసం తన ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోవడం అనేది ఆమె చేసిన మరింత పెద్ద తప్పు.

అనుపమలా మరీ అంత సెన్సిటివ్‌గా ఉంటే, సినిమాల్లో హీరోయిన్‌గా ఏమో గాని, అసలు బ్రతకడమే కష్టం. 

Take it light #Anupama! 

అనుపమ నటించిన "టిల్లు స్క్వేర్" రేపు విడుదలవుతున్న సందర్భంగా సిద్ధు, అనుపమ & టీమ్‌కు ఆల్ ది బెస్ట్.