Sunday 30 September 2018

'వరంగల్ ఈస్ట్' టికెట్ ఎవరికిస్తే బాగుంటుందో మీకు తెలుసా?

(జస్ట్ అలా సరదాగా రాశాను)   
***

నేను పుట్టింది, పెరిగింది "వరంగల్ ఈస్ట్" నడిబొడ్డులో! 

పక్కా లోకల్ ... 

ఉస్మానియాలో 2 పీజీలు చేశాను. 2 గోల్డ్ మెడల్స్ సాధించాను. 3 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేశాను.

తిక్కలేచినప్పుడు, ఒక్కొక్కటిగా  ఆ జాబ్స్‌ను  రెజైన్ చేసిన రికార్డు కూడా ఉంది. 

అలాగని నేనేం రిచ్ కాదు. 

హైద్రాబాద్ వచ్చి పాతికేళ్లయినా ఇక్కడ నాకు జానెడు జాగా లేదు. సొంతిల్లు లేదు. అది వేరే విషయం. 

ఇప్పుడు ఫ్రీలాన్సర్‌గా లోకల్ నుంచి, మల్టీ నేషనల్ స్థాయి వరకు యాడ్స్ చేస్తున్నాను. ఒక్క 'అమెజాన్ డాట్ కామ్‌'కే ఫ్రీలాన్సర్‌గా ఓ అరడజన్ పనులు చేస్తున్నాను. రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా, సోషల్ మీడియా ప్రమోషన్ స్ట్రాటజిస్ట్‌గా .. ఇంకో డజన్ క్రియేటివ్ జాబ్స్ చేస్తున్నాను.  

రైటర్‌గా నంది అవార్డు తీసుకున్నాను. 

సినిమాల్లో 'స్పెషల్ అప్పియరెన్స్' ఇచ్చినట్టు, అప్పుడప్పుడూ డైరెక్టర్‌గా ఏదో ఒకటీ అరా సినిమాలు కూడా డైరెక్ట్ చేస్తుంటాను. 

ఇప్పుడు "నమస్తే హైదరాబాద్", ఇంకో రెండు సినిమాలు చేస్తున్నాను.

బట్, సినిమాలు నా ప్రధాన వ్యాపకం ఎప్పుడూ కాదు.

జస్ట్ ఫర్ ఫన్.

జస్ట్ ఫర్ బిజినెస్. 

అంతే. 


ఈ ఫీల్డుని ఏ క్షణమైనా వదిలేస్తాను. 

దీన్ని మించిన ప్యాషనేట్ పనులు నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో.

అవి ముఖ్యం నాకు. 


చెప్పాలంటే, అవే ముఖ్యం.     

కట్ టూ నా తెలంగాణ - 

నేను పుట్టిన తెలంగాణ అంటే నాకు ప్రాణం. 

ఆ తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు నేనొక హార్డ్‌కోర్ ఫ్యాన్‌ను.

ఉద్యమసమయం నుంచి, ఇప్పటిదాకా .. తెలంగాణపైన, కేసీఆర్ పైన ఎన్నో ఆర్టికిల్స్ రాశాను. బ్లాగ్ పోస్టులు రాశాను. వీటన్నిటి సంకలనంతో ఒక పుస్తకం కూడా త్వరలో పబ్లిష్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాను. 

అయితే, ఎప్పుడా పని చేస్తానో ఇప్పుడే చెప్పలేను.   

ఏపీతో సహా, దేశంలోని ఎన్నో ఇతర ప్రాంతాలంటే కూడా నాకెంతో ఇష్టం. 

నా స్నేహితుల్లో అత్యధికభాగం మంది ఆంధ్ర నుంచే ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా ఉన్నారు. 

అంతెందుకు .. నా భార్య పుట్టిపెరిగింది హైద్రాబాదే అయినా, ఆమె పేరెంట్స్ కడపవాళ్లు! 

సో, రాజకీయాలు వేరు. స్నేహాలు, బంధుత్వాలు వేరు.

కట్ చేస్తే - 

ఏ లెక్కప్రకారం చూసినా, 'వరంగల్ ఈస్ట్' స్థానానికి మనోహర్ చిమ్మని 'రైట్ క్యాండిడేట్' అని .. పలు పార్టీలు నాకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు నిపుణుల సమాచారం.

దీనికితోడు, నా కమ్యూనిటీవాళ్లు ఈ నియోజకవర్గంలో 32 శాతం ఉన్నట్టు నిపుణుల గణాంకాలు చెప్తున్నాయి. కనీసం ఇంకో 15 శాతం వోట్లు పార్టీలకతీతంగా నాకే గుద్దుతారని వరంగల్ లోని నా మిత్రులు, శ్రేయోభిలాషుల అధికారిక అంచనా. 


ఏ పార్టీ నుంచి పోటీచేసినా మనోహర్ చిమ్మని గెలుస్తాడని 'ఇండియా టుడే' విశ్లేషణ! 

మన ఇంటిపార్టీ టీఆరెస్‌లో, ఆల్రెడీ ఈ 'వరంగల్ ఈస్ట్' సీటు గురించి నానా లొల్లి నడుస్తోంది. కాబట్టి, నాకు నా ఫేవరేట్ టీఆరెస్ నుంచి ఛాన్స్ లేనట్టే అనుకుంటున్నాను.

టీఆరెస్ కానప్పుడు, ఇంక ఏ రాయి అయితేనేం? 


సో, వేరే ఏదో ఒక పార్టీ తప్పదు. 

ఏ పార్టీ నుంచి గెలిచినా, తర్వాత ఎలాగూ మన రాజకీయాల్లోని ఎవర్‌గ్రీన్ అండ్ గుడ్-ఓల్డ్ ప్రాక్టీస్ ఒకటి ఉండనే ఉంది.

అదేంటో తర్వాత మరోసారి వివరంగా మాట్లాడుకుందాం.

సరే, ఇదంతా ఎలా ఉన్నా, మన కేసీఆర్ గారు చెప్పినట్టు మన దేశ రాజకీయాల్లో ఒక 'గుణాత్మక మార్పు' అనేది ఇప్పుడు చాలా అవసరం.

అది తెలంగాణ నుంచే మొదలవ్వాలి.

వరంగల్ ఈస్ట్ నుంచే మొదలవ్వాలి.  


సో .. వరంగల్ తూర్పు సీటు కోసం, తెలంగాణ ప్రగతి కోసం, ఏ క్షణమైనా, ఏ గొంగలిపురుగునైనా నేను కూడా ముద్దుపెట్టుకుంటాను!  

జై కేసీఆర్!
జై తెలంగాణ!! 

Now the ball is in the court of all parties ... 😃

Thursday 27 September 2018

సోషల్ మీడియా ప్రమోషనే ఎన్నికల్లో 'ట్రంప్ కార్డ్' కాబోతోందా?

ఖచ్చితంగా అవును!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇప్పుడు అందరికీ తెలిసిన నిజం ఇది.

ముఖ్యంగా పొలిటీషియన్‌లకు, పాలిటిక్స్‌ను ఫాలో అవుతున్నవారికి మాత్రం చాలా బాగా తెలుసు.

కట్ టూ పాయింట్ - 

ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రమోషన్ ప్రాధాన్యం తెలిసి, ఆ అవసరం ఉన్నవారికోసం మాత్రమే ఈ పోస్ట్:

ఒక రైటర్ గా, ఫిల్మ్ డైరెక్టర్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా, సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ గా .. ఒక పూర్తిస్థాయి టీమ్, నా పర్యవేక్షణలో పనిచేస్తుంటుంది.

నాతోపాటు, నా టీమ్‌లోని వాళ్లంతా  సోషల్ మీడియా ప్రమోషన్ లో నిష్ణాతులు.

ఏ పొలిటిల్ పార్టీ అన్న విషయంతో సంబంధంలేకుండా, రానున్న 2018/2019 ఎన్నికల్లో, పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశించే అభ్యర్థులకు నేను అత్యున్నతస్థాయి సోషల్ మీడియా ప్రమోషన్ అందిస్తాను.

ఇది నా వృత్తిలో ఒక భాగం. ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ఆఫర్.

ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశిస్తున్న అభ్యర్తులకు వర్తిస్తుంది.

ఇది 100% ప్రొఫెషనల్ సర్వీస్. నాకు నచ్చిన ఆఫర్స్, ప్యాకేజెస్ మాత్రమే నేను స్వీకరిస్తాను. మీరు ఆశించిన స్థాయిని మించిన  సర్వీస్ నా నుంచి, నా ఆధ్వర్యంలో పనిచేసే నా టీమ్ నుంచి  ఉంటుంది.

నిజంగా ఆసక్తి, అవసరం, స్థోమత ఉన్న పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశించే అభ్యర్థులు .. మీ ప్రపోజల్ నాకు 'ఈమెయిల్' చేయండి. వెంటనే స్పందిస్తాను: mchimmani@gmail.com 

థాంక్యూ.
బెస్ట్ విషెస్ ...

Friday 21 September 2018

Addicted to KCR

ఈరోజు నుంచీ, త్వరలో రానున్న 2018/2019 ఎలక్షన్స్ అయిపోయేవరకూ .. నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద, నా బ్లాగులో, ట్విట్టర్‌లో .. నేను ఎప్పుడూ పోస్ట్ చేసే నా రెగ్యులర్ పోస్టులతోపాటు .. నా అభిమాన కేసీఆర్, టీఆరెస్ లకు అనుకూలమైన పోస్టులు కూడా కొల్లలుగా ఉంటాయి.

కేసీఆర్ 'హార్డ్ కోర్ ఫ్యాన్' గా, ఇది పూర్తిగా నాకు నేను వాలంటరీగా చేస్తున్న పని.

ఒక తెలంగాణ బిడ్డగా ఇది నా బాధ్యతగా భావించి, ఉడతా భక్తిగా నేనీ పని చేస్తున్నాను. 

రాజకీయాలు వేరు, స్నేహం వేరు అనుకోగలిగిన నా మిత్రులు ఏపార్టీవారైనా, నా పోస్టులను హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

సింపుల్ గా ఇగ్నోర్ కూడా చెయ్యొచ్చు.

అది మీ ఇష్టం.

ఇది అస్సలు నచ్చని మిత్రులు ఎవ్వరైనా ఉంటే, నన్ను వెంటనే అన్ ఫ్రెండ్ చెయ్యొచ్చు. నిర్మొహమాటంగా బ్లాక్ చెయ్యొచ్చు.

అర్థంలేని కామెంట్స్, అసభ్యకరమైన/అభ్యంతరకరమైన భాషతోకూడిన కామెంట్స్ కు మాత్రం
నా ఫేస్‌బుక్ టైమ్ లైన్ మీద/బ్లాగులో/ట్విట్టర్‌లో స్థానం లేదని సవినయ మనవి. 

అలాంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే, వాటిని వెంటనే డిలీట్ చేస్తాను.

క్షణం కూడా ఆలోచించకుండా, ఆయా వ్యక్తులను బ్లాక్ చేస్తాను.

థాంక్యూ.
బెస్ట్ విషెస్ ...                              

Thursday 20 September 2018

ఫేస్‌బుక్కా, ట్విట్టరా?

ఫేస్‌బుక్ నిజంగా ఇప్పుడొక ఫిష్ మార్కెట్ అయిపోయింది.

కేవలం అతికొద్ది శాతం మంది మాత్రమే ఈ ఫేస్‌బుక్‌ను ఒక మంచి డిగ్నిటీతో, డీసెన్సీతో ఉపయోగిస్తున్నారు. వారు మాత్రం నన్ను క్షమించాలి. పైన ఫిష్ మార్కెట్ అన్నందుకు. 

ముందే చెప్పినట్టు, మిగిలిందంతా జస్ట్ ఒక ఫిష్ మార్కెట్. లేదా, ఓ సనత్‌నగర్ సండే మార్కెట్. ఒక కల్లు దుకాణం. ఒక లోకల్ బార్. 

ఇదంతా నేను సరదాకి చెప్తున్నాను.

కొటేషన్లు, రాజకీయాలు, సినిమాలు, ఇతర వ్యక్తిగత దృక్పథాలు సరే. ఎవరి ఇష్టం వారిది. 

కానీ, ఫేస్‌బుక్ వాల్ చివరికి ఎలా తయారయ్యిందంటే:

> ఒక డాన్స్ మాస్టర్ తన తల్లి చనిపోతే, ఆ తర్వాతి కార్యక్రమాన్ని ఒక ఈవెంట్‌లాగా .. తన తల్లి శవం బ్యాక్‌డ్రాప్‌లో ఫోటోలకు పోజులిస్తూ దిగాడు. అవన్నీ తన వాల్ మీద పోస్ట్ చేశాడు.

> ఒకతను సూసైడ్ చేసుకొంటూ లైవ్ రికార్డ్ చేసుకున్నాడు. 

> ఇప్పుడు ఏకంగా ప్రతి హత్యను, వాటి సిసి రికార్డింగ్‌లను పోస్ట్ చేస్తున్నారు.   

> పోస్టుల్లో బూతుమాటలకు అసలు లెక్కేలేదు.

ఇట్లా ఇంకో వంద చెప్పుకోవచ్చు. 

ఇవన్నీ నేను ఎంత వద్దనుకొన్నా నా కంటపడుతున్నాయి. 


కట్ టూ నా గొడవ - 

ఫేస్‌బుక్, బ్లాగింగ్, ట్విట్టర్ .. ఈ మూడింటినీ నేనొక "స్ట్రెస్ బస్టర్" టూల్స్‌లాగా భావించి ఉపయోగిస్తాను. అది కూడా రోజుకి కొన్ని నిమిషాలు. మొత్తంగా ఒక గంట కూడా ఎన్నడూ ఉపయోగించలేదు ఎన్నడూ.

పైన చెప్పిన నేనిష్టపడని, నాకు నచ్చని ఒక 101 కారణాలవల్ల ఇప్పుడు నాకు ఫేస్‌బుక్ అనేది ఏ క్షణం వదిలేయాలా అన్న స్థాయికి వచ్చేసింది.

ఆ క్షణం త్వరలోనే రావాలని కోరుకొంటున్నాను.

కానీ, మార్కెటింగ్ పాయింటాఫ్ వ్యూలో ఫేస్‌బుక్ అనేది ఒక మంచి మాస్ సోషల్ మీడియా సాధనం. ఇప్పుడు నేను చేస్తున్న ఒకటి రెండు సినిమా ప్రాజెక్టుల ప్రమోషన్ దృష్ట్యా కొంచెం ఆలోచిస్తున్నాను.

లాజిగ్గా ఆలోచిస్తే ఇది కూడా తప్పే.

అసలు సోషల్ మీడియా జోలికి వెళ్లని పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు, ఇతర రంగాల సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు.

మనకు ఒక హాబీ నచ్చనప్పుడు సింపుల్‌గా దానికి గుడ్‌బై చెప్పడం బెటర్ అనేది నా హంబుల్ ఒపీనియన్.

ట్విట్టర్ ఒక్కటి చాలు. కావాలనుకొంటే తప్ప, కింద కామెంట్స్ చూసే అవసరం కూడా ఉండదు. నా బ్లాగ్ పోస్టుల లింక్‌ను అక్కడ పోస్ట్ చెయ్యొచ్చు. ఫేస్‌బుక్ ద్వారా సాధించగలిగిన ఇతర పాజిటివ్ లక్ష్యాలన్నిటినీ ట్విట్టర్‌తో కూడా సాధించవచ్చు.

ముఖ్యంగా, టైమ్ కూడా ఎక్కువ వృధా కాదు.

సో, ఇప్పటికయితే నా అలోచన ఇది.

దీన్ని ఏ క్షణమైనా నేను ఆచరణలోకి తేవచ్చు.  

Wednesday 19 September 2018

77 రోజులు

చాలా పెద్ద గ్యాప్ తర్వాత, మళ్లీ నాకత్యంత ప్రియమైన నా 'బ్లాగింగ్' మీద పడ్డాను.

జూన్ 29 నుంచి సెప్టెంబర్ 13 వరకు.

నిజంగా చాలా పెద్ద గ్యాప్.

బహుశా ఇంత పెద్ద గ్యాప్ ఇంతకుముందు నేనెప్పుడూ తీసుకోలేదు.

పనికొచ్చేదో, పనికిరానిదో .. మొత్తానికి ఏదో ఓ చెత్త, ఆ క్షణం నేను రాయాలనుకున్నది వెంటనే ఇక్కడ నా బ్లాగులో రాసేసేవాణ్ణి.

ఇదొక హాబీ. ఒక ఆనందం. ఒక థెరపీ. ఒక మెడిటేషన్.


కట్ టూ ఆ 77 రోజులు - 

అనుకోకుండా ఒక ప్రొఫెషనల్ టూర్.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు.

కేవలం ఒక 4 రోజుల పని అనుకున్నాను. కాని, అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల పనుల్లో ఊహించనివిధంగా కనెక్ట్ అవుతూ, అక్షరాలా 77 రోజులు ఉండాల్సి వచ్చింది!

మధ్యలో ఒకటి రెండు సార్లు కొన్ని గంటలకోసం అత్యవసరంగా హైదరాబాద్ వచ్చి వెళ్లినా, ఆ కొద్ది సమయం అసలు లెక్కలోకి రాదు.

1989 నుంచి 1991 వరకు, సరిగ్గా ఒక రెండేళ్లు, గుంటూరులోని మద్దిరాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ 'జవహర్ నవోదయ విద్యాలయ'లో నేను పనిచేశాను. ఆ తర్వాత, అక్కడ ఉద్యోగం రిజైన్ చేసి కర్నూలు ఆలిండియా రేడియోలొ చేరాను. తర్వాత, ఆ ఉద్యోగం కూడా రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చాను.

అది వేరే విషయం.

చెప్పొచ్చేదేంటంటే, నాకు గుంటూరుతో చాలా సంబంధబాంధవ్యాలున్నాయి. అప్పటి జ్ఞాపకాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

అప్పటి నవోదయ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. అప్పటి నా సహోద్యోగుల్లో కూడా కొందరం ఇప్పటికీ కలుస్తుంటాం. 

ఈ నేపథ్యంలో, గుంటూరు అంటే నాకు చాలా ఇష్టం.

అయితే, అప్పటి గుంటూరు వేరు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పటి గుంటూరు వేరు.

ఎక్కడ  చూసినా షోరూములు, జివెల్రీ షాపులు, కిక్కిరిసిన ట్రాఫిక్‌తో డెవలప్‌మెంట్ బాగానే ఉంది. కానీ, ఏదో సంథింగ్ మిస్ అవుతున్నానన్న ఫీలింగ్.

బహుశా, ఆనాటి సహజమైన 'టౌన్ ఫీలింగ్' అనుకుంటాను. అదిప్పుడు లేదు. 

నేను బాగా తిరిగిన అప్పటి గుంటూరే నాకిప్పటికీ ఇష్టం.

గుంటూరులో ఈ 77 రోజుల నా మొత్తం ట్రిప్‌లో నాకు బాగా నచ్చింది ఒక్కటే.

బ్రాడీపేటలో ఉన్న శంకర్‌విలాస్‌లో రవ్వదోశ.