Monday 26 June 2023

ఇకనుంచైనా వ్యవస్థను వాడుకో!


వ్యవస్థను వాడుకో...

ఇంగ్లిష్‌లో దీన్ని ఎలా చెప్పాలో తెలియక మా ఇంగ్లిష్ రైటర్‌ భరత్‌ను అడిగాను. మక్కీ కి మక్కీ కాకుండా - కరెక్ట్‌గా దీనికి సమానమైన ఎక్స్‌ప్రెషన్ ఇంగ్లిష్‌లో నాకు కూడా తెలియదు, ఆలోచించి చెప్తా అన్నాడు.  

ఉద్యోగం, బాధ్యతలు, బిజినెస్ ఆలోచనల మధ్య అంత టైమ్ దొరకే అవకాశం లేదు మా భరత్‌కు. ఇందాకే మళ్ళీ ఒక మెసేజ్ పెట్టాను. 

కట్ చేస్తే -

ఈమధ్య నాకు బాగా దగ్గరగా తెలిసిన ఒక ఫ్రెండు - చాలా కష్టాల్లో ఉండి - అతనికి ఏమాత్రం తెలియని ఒక ఫీల్డులోకి ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళాడు. ఒకటికి పదిసార్లు నెలకు జీతం ఎంత, ట్రాన్‌స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా వుంటుందీ... అన్నీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే వెళ్ళాడు. 

ఆరు నెలలు గడిచాయి... 

శాలరీ లేదు, ట్రాన్స్‌పోర్ట్ లేదు. 

ఏ పని చెయ్యాలని అయితే అక్కడ ఉద్యోగానికి తీసుకున్నారో ఆ పని చేయించుకోడానికి అక్కడ ఫండ్స్ నిల్! 

అదొక గ్రూప్ ఆఫ్ అరడజన్ కంపెనీలు...

అక్కడసలు మాడర్న్ బిజినెస్ బేసిక్స్ కూడా తెలియవు. బిజినెస్ డల్‌గా ఉంది. 

వాళ్లకు తెలిసిందల్లా పనికిరాని ఈగోలు, ఎవరికివాళ్లే అవతలివాళ్ళ గురించి ఏదేదో అనుకోవడాలు, ఎదురుచూడటాలు, చివరికి గొడవలు... అదే బిజినెస్ స్టైల్ అనుకొని మురిసిపోవడం, అంతా బాగుంది అనుకోవడం... మళ్ళీ గొడవలు. 

ఇక, వాళ్ల కస్టమర్లతో వారికున్న గొడవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.    

అయినా సరే, బెట్టుగా ఉన్నారు. లెవెల్ తగ్గేదేలే అన్నట్టున్నారు.  

అప్పుడప్పుడూ ఖర్చుల కోసం సిగ్గు విడిచి పదో పరకో అడుక్కోలేక -  ఒక ఆరు నెలలు దాటిన తర్వాత విధిలేక గుచ్చీ గుచ్చీ అడిగాడు మా ఫ్రెండు. 

" అదేంటి... ఇంత పెద్ద పోస్టు... నువ్వు శాలరీ అడుగుతావేంటీ? ఎండీ స్థాయి పోస్టులకు శాలరీ ఉండదు. నువ్వే సంపాదించుకో, ఎంతయినా తీసుకో." 

అదీ షాకింగ్ సమాధానం!  

"నేనే సంపాదించుకొని తీసుకునేటట్టయితే - అదేదో నేనే చేసుకునేవాణ్ణి కదా..." మా ఫ్రెండు బాధతో అనుకోవడం. 

అసలక్కడ బిజినెస్ లేని పరిస్థితుల్లో ఇంకొకరికి ఏవేవో ప్రామిస్ చేసి తీసుకురావడం ఎందుకు? అనుకున్నది కాని పరిస్థితుల్లో ఆ విషయం నేరుగా చెప్పకుండా - నా ఫ్రెండుని రకరకాల మాటలతో ప్రతిరోజూ మానసికంగా హింసించడం ఎందుకు? 

"నిజంగా ఇలాంటి వ్యవహార శైలినే బిజినెస్ అంటారా? అదే నిజమైతే అలాంటి బిజినెస్ వాతావరణంలో ఇంకా నేను ఉండటం నన్ను నేను మోసం చేసుకోవడమే" అంటూ నా దగ్గర తన బాధంతా వెళ్లగక్కుకున్న నా ఫ్రెండ్‌కు నేనేం చెప్పగలను? 

స్నేహం, రిలేషన్‌షిప్స్ వేరు. మనవైపు జరిగిన పొరపాటు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎదుటివారి బలహీన పరిస్థితులతో మైండ్ గేమ్ ఆడుకోవడం వేరు. 

అయినా సరే - అక్కడ అన్నిరోజులు ఉన్నందుకు - వాళ్ళకు ఎంతో కొంత తనవైపు నుంచి ఉపయోగపడే సహాయం ఏదైనా చేసిరావాలని ఇంకా అక్కడే ఉన్న నా మిత్రుడికి ఏం చెప్పాలి?

అందుకే ఈ బ్లాగ్ పోస్టుకు హెడ్డింగ్ అది పెట్టాను... 

Friday 23 June 2023

జోహార్ తెలంగాణ అమరవీరులారా...


"చిన్నదో పెద్దదో... ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకునేవారు కేసీఆర్ గారిని, వారి సంకల్ప శక్తిని ఆదర్శంగా తీసుకుంటే చాలు."

ఇది నేను ఎవరికో చెప్తున్న సలహా కాదు. తాజాగా నాకు నేనే ఇచ్చుకుంటున్న సెల్ఫ్ మోటివేషన్. 

కట్ చేస్తే -

నాకున్న నానా యావగేషన్స్, తలనొప్పుల మధ్యలో ఎందుకులే అని కొన్ని రోజులు అప్పుడప్పుడు నా పొలిటికల్ బ్లాగింగ్, సోషల్ మీడియా పోస్టుల విషయంలో కొంచెం గ్యాప్ తీసుకుంటుంటాను. 

ఇలా గ్యాప్ వచ్చినప్పుడు మిత్రులు కొందరు "ఏమయిందివయా... అంత బిజీ అయిపోయినవా, ఏం రాస్తలేవేంది... కేసీఆర్‌ను మర్చిపోయినవా?" అంటారు. 

అదేపనిగా వరుసపెట్టి పొలిటికల్ బ్లాగ్స్, సోషల్ మీడియా పోస్టులు రాస్తున్నప్పుడు, "సక్కగ ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీసి ఇన్ని పైసల్ సంపాదించుకోక నీకెందుకన్నా ఈ పాలిటిక్స్?" అని అనేది కూడా ఈ మిత్రులే! 

ఇలాంటి నేపథ్యం మధ్య - మరోవైపు - ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ ప్రెస్‌మీట్లతో, తమ నిరంతర విజయాల పరంపరతో సింపుల్‌గా అలా ఛాలెంజ్ విసురుతుంటారు...

"అసలు నువ్వు రాయకుండా ఉండగలవా?" అని.  

ఈరోజు సాయంత్రం "అమరజ్యోతి" ప్రారంభోత్సవం ఒక ఎమోషనల్ మూమెంట్. 

కేసీఆర్ గారి ఉపన్యాసంలో వారు చెప్పిన రెండు విషయాలు వారిపట్ల నా అభిమానాన్ని, గౌరవాన్ని పదింతలు చేశాయి. 

కళ్ళు చెమర్చాయి... 

ఉద్యమ సమయంలోని ఒకానొక సందర్భంలో - కొండా లక్ష్మణ్ బాపూజీ గారి  జలదృశ్యంలో టీఆరెస్ ఆఫీసు ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వ దమనకాండలో భాగంగా - జలదృశ్యం ఆఫీసులోని ఫర్నిచర్, పేపర్లు, ఫైళ్ళు, డాక్యుమెంట్స్ అన్నిటినీ తెచ్చి బయట రోడ్డుమీద పడేశారు. 

అదే జలదృశ్యం దగ్గర ఇప్పుడు తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణం "అమరజ్యోతి"ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు కేసీఆర్!     

రేపటి నుంచి రాష్ట్ర సందర్శనకు వచ్చే జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకులు, బిజినెస్‌మెన్ వంటివారందరికీ మొట్ట మొదట మనం చూపించబోయే సందర్శన స్థలం... అమరజ్యోతి!

ఇదీ... తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మాహుతి చేసుకొన్న అమరవీరుల త్యాగానికి కేసీఆర్ గారిస్తున్న గౌరవం!

హాట్సాఫ్... 

కట్ చేస్తే - 

త్వరలో నేను ప్రచురించబోతున్న నా తాజా పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే అమరజ్యోతి ప్రాంగణంలో ఉన్న సమావేశమందిరంలోనే చేయాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను...  

Monday 19 June 2023

Crowdfunding Yo!


Yo!

🎥 Unleash the Magic of Cinema! Support Our Spectacular Feature Film! 🎥

Are you ready to embark on an extraordinary cinematic journey? We are thrilled to present our groundbreaking feature film project, and we need your support to make it a reality! Join us in creating a cinematic masterpiece that will captivate audiences across TS, AP, India and beyond.

🌟 Introducing Yo! 🌟

Step into a world of wonder, where dreams come alive and stories unfold. Yo! is an enchanting anthology of 10 trendy love stories. Set against breathtaking landscapes and locations, it weaves together heartwarming characters, gripping emotions, and unforgettable moments... Blended with a tint of hot romance. 

🎬 Why Your Support Matters 🎬

Bringing a feature film to life is a monumental undertaking that requires immense passion, creativity, and resources. By supporting our crowdfunding campaign, you become an integral part of this cinematic adventure. Your contributions will directly impact the quality of the film, ensuring top-notch production values, stunning visuals, and an immersive experience that will leave audiences spellbound.

💫 Be Part of Something Extraordinary 💫

When you support Yo!, you join a community of film enthusiasts, dreamers, and visionaries. Together, we can create a fascinatingly fantabulous cinematic marvel that showcases the trendy lifestyle vibes of youth and their relationships. Your involvement goes beyond financial support; it's an opportunity to leave your mark on the Indian film industry and support the next generation of talented filmmakers, artists and technicians. 

🌐 Our Vision, Your Backing 🌐

With your generous contributions, we can:
✅ Assemble a stellar cast of fresh and emerging talents.
✅ Employ cutting-edge production techniques to bring the script to life.
✅ Create awe-inspiring visual treats that transport viewers to magical realms.
✅ Craft a mesmerizing musical score that resonates with hearts and souls.
✅ Promote the film widely to ensure it reaches the widest possible audience.

🌟 Exclusive Rewards Await You 🌟

We believe in expressing our gratitude to our backers. By supporting our crowdfunding campaign, you, the A1 and A Supporters, gain access to a range of exclusive rewards, including:
🎁 VIP premiere tickets to the film's grand premiere.
🎁 Limited-edition Yo! merchandise and collectibles.
🎁 Personalized thank-you messages from the cast and crew.
🎁 Behind-the-scenes access and exclusive updates on the film's progress.
🎁 Special recognition in the film's title credits.
🎁 Meet & Greet Evening with the cast and crew. 
And -
🎁 Proportionate share in profits. 
 
🌈 Together, Let's Create Cinematic Magic! 🌈

Join us on this extraordinary journey and help us create a feature film that will touch hearts, inspire minds, and leave an indelible mark on the Indian film industry. Your support is crucial in turning our vision into reality. Every contribution, no matter how big or small, A1 or A, makes a difference.

🙏 Support Yo! today and be a part of post-corona cinema history! 🙏

Interested?

Say Yo! on my whatsapp and let's get connected:

Manohar Chimmani
Nandi Award Winning Writer, Director and Producer
Author, "KCR - The Art of Politics"
+91 9989578125  

రాజకీయాలను వాడుకోవడం ఎలా?


On a lighter note...

గతంలో గ్యాస్ నూనె అమ్ముకున్నవాడు ఒక న్యూస్‌పేపర్, ఒక టీవీ చానల్ పెట్టాడు... అప్పట్లో ఒక ముఖ్యమంత్రినే జేబులో పెట్టుకొని, మీడియా అధినేత అవతారమెత్తి వేల కోట్లు సంపాదించాడు. 

జస్ట్ గోడకి ఒక పెద్ద డిస్‌ప్లే మానిటర్ పెట్టుకొని - ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతను, ఆయన కుటుంబాన్ని అదే పనిగా చాలా చెత్త స్థాయిలో తిడుతూ - ఒక కోన్ కిస్కా అనామకుడు వందల కోట్లు సంపాదించాడు. 

కట్ చేస్తే - 

రాష్ట్రం మీద, రాష్ట్రం సాధించిన నాయకుని మీద అభిమానంతో - రాత్రింబవళ్ళు వాలంటరీగా యుద్ధం చేస్తున్న వారియర్స్ మాత్రం - కనీసం వొంటిమీదేసుకునే ఒక ఉత్తుత్తి కోటు కుట్టించుకొనే స్థాయికి కూడా ఎదగలేకపోయారు. వారి జీవితాల్లో నిరంతర సంఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అనునిత్యం అవమానాలు బోనస్.  

మరిక్కడ -
నిజంగా ఎవరి కృషి పనిచేస్తున్నట్టు?
నిజంగా ఎవరి IQ కు పవర్ ఉన్నట్టు?
ఎందుకలా? 

"ఇది తెలిసీ సరైన సమాధానం చెప్పలేదో నేను మళ్ళీ చెట్టెక్కుతాను" అని ఈసారి వార్నింగ్ ఇవ్వకుండానే చెట్టెక్కేశాడు భేతాళుడు.  

Wednesday 14 June 2023

ఒక పెద్దాయన చెప్పిన 2 చిన్న విషయాలు!


కొన్నాళ్ళ క్రితం నేను చదివిన ఒక సీనియర్ జర్నలిస్టు బ్లాగ్ పోస్టులోని సారాంశాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా రాస్తున్న పోస్టు ఇది. 

సుమారు ఒక 15 ఏళ్ల క్రితమే ఆలిండియా రేడియో నుంచి రిటైరయిన ఈ జర్నలిస్టుకు రాజకీయాల మీదున్న సంపూర్ణ అవగాహనను అంత ఈజీగా కొట్టిపారేయలేం.  

ఎలాంటి సాగతీత లేకుండా నేను రాస్తున్న ఈ పోస్టు కొందరికైనా ఉపయోగపడుతుందని నా నమ్మకం. 

కట్ చేస్తే - 

ప్రపంచంలో ఏ పొలిటికల్ లీడర్‌కైనా, ఏ పొలిటికల్ పార్టీకైనా ప్రధానంగా రెండు రకాల ఫ్యాన్స్ ఉంటారు.

హార్డ్ కోర్ ఫ్యాన్స్.
హార్డ్ ఫ్యాన్స్.  

హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభిమానం అస్సలు మారదు. ఎలాంటి ప్రలోభాలకు లొంగదు. ప్రవాహం మధ్యలో ఉన్న ఒక రాయి మీద నీటి వొరవడికి ఏర్పడిన ఒక గ్రూవ్ లాంటిది వీరి అభిమానం. ఆ గ్రూవ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప పోదు. ఇలాంటి అభిమానులు తమ నాయకుని మీద, పార్టీ మీద ఈగ వాలనీయరు. ఎవరైనా తమ నాయకుని మీద ఒక చిన్న కామెంట్ చేస్తే వంద రెట్లు ఉతికి ఆరేస్తారు. వీరి వోట్లు, వీరి వాలంటరీ సేవలు స్విజ్ బ్యాంకులో దాచుకున్న డబ్బుతో సమానం. ఎక్కడికీ పోవు.       

హార్డ్ ఫ్యాన్స్ అలా కాదు. వీరి అభిమానం సీజనల్‌గా ఉంటుంది. ఉంటే ఆకాశం ఎత్తులో ఉంటుంది. ఏదైనా తమకు అనుకూలం కాని చిన్న సంఘటన జరిగినప్పుడు అప్పటిదాకా ఆకాశం ఎత్తులో ఉన్న అభిమానం క్షణంలో మాయమైపోతుంది. ఓవర్‌నైట్‌లో పార్టీ మారగలుగుతారు. వీరికి ఉండే కొన్ని అదనపు క్వాలిటీస్‌తో తమ నాయకున్ని, తర్వాతి హయరార్కీని ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా ఇంప్రెస్ చేయగలుగుతుంటారు. గుర్తింపునీ పదవులనూ పొందుతారు. 

అసలు విషయం ఏంటంటే - 
రాజకీయ నాయకులు గాని, పార్టీలు గాని తమ కోసం ప్రాణం పెట్టే హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే - ఆ వోట్ బ్యాంకు, వారి సేవలు పదిలం కాబట్టి! 

హార్డ్ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా పట్టించుకుంటారు. పేరు పేరునా గుర్తించుకుంటారు. కారణం - ఇలాంటివాళ్లతోనే రాజకీయాలు, రాజనీతి బాగా నడుస్తాయి కాబట్టి!! 

దీన్ని బట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొన్ని భ్రమల్లోంచి బయటపడాలి. ఏదైనా ఒక సున్నితమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆగాలి. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించాలి. 

ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా పార్టీలు, వ్యవస్థలు నడుస్తూనే ఉంటాయి, ఆగిపోవు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి.  

ఏ వ్యవస్థ అయినా సరే తనను నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తిని సంతృప్తి పరుచడం అన్నది అసాధ్యం అన్న నిజాన్ని అర్థం చేసుకోవాలి. 

Friday 9 June 2023

ఆదిపురుష్!


సినిమా ప్రధానంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. ప్రజల విశ్వాసాలకు, నమ్మకాలకు హాని కలిగించనంతవరకు సమస్య లేదు.

సినిమా మార్కెటింగ్ విషయంలో కూడా అంతే. ఇబ్బందిపెట్టని, బాధపెట్టని ఎలాంటి మార్కెటింగ్ గిమ్మిక్ అయినా ఓకే. 

అలాంటి ఒక ప్రయత్నమే లేటెస్టుగా ఆదిపురుష్ కోసం చేశారు. థియేటర్లో ఒక సీట్ హనుమంతుని కోసం ఖాళీ పెట్టాలని.  

అది వాళ్ళిష్టం. వాళ్ళ నమ్మకం. 

ఒక బజ్ అయితే బాగానే క్రియేట్ అయ్యింది. ఫ్రీ ప్రమోషన్ భారీగా జరుగుతోంది. 

వారి స్ట్రాటెజీ సక్సెస్ అయినట్టే. 

ఇక సక్సెస్ కావల్సింది సినిమా. 

కట్ చేస్తే -

ఓం రౌత్‌కి, టీసీరీస్‌కు రామాయణాన్ని 3D సినిమా రూపంలో అలా చెప్పాలనిపించింది. 

మరీ వరస్ట్ కండిషన్స్‌లో అదొక త్రీడీ కార్టూన్ మువీలా ఉండొచ్చు. తప్పేముంది? 

సంపూర్ణ రామాయణం చూసిన కాలంలోనే మనం ఆగిపోలేదు కదా? 

అప్పుడు గిర్రు గిర్రున డయల్ చేసే ఫోన్లుండేవి. ఇప్పుడే ఫోన్లు వాడుతున్నాం? 

సాంకేతికంగా వచ్చే మార్పులన్నీ మన జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ ప్రవేశిస్తాయి. సినిమా అందులో మొదటిది.

ప్రభాస్ కోసమో, కృతి సనన్ కోసమో ఈ సినిమా చూసే ఈ తరం ప్రేక్షకులు... కనీసం ఇలాగైనా రామాయణం అనేది ఒకటుంది, దాని కథ అది అని రామాయణం గురించి కొంతయినా తెలుసుకుంటారు. 

అసలు పుస్తకాలే చదవడం మర్చిపోతున్న ఈ తరానికి మన పురాణేతిహాసాలను ఇలాగైనా పరిచయం చేయడం మంచిదే అని పాజిటివ్‌గా ఎందుకు అనుకోకూడదు?

మరో వైపు... పూర్ గ్రాఫిక్స్, పాత్రల వేషధారణ, రావణున్ని పరోక్షంగా ఇంకో మత నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేయడం వంటి విషయాల్లో ఆదిపురుష్ సినిమా పైన ఇప్పటికే ఆరోపణలున్నాయి. అవన్నీ ఈ సినిమాను ఎక్కడికి తీసుకెళ్తాయనే విషయం ఒక వారం తర్వాతే తెలుస్తుంది.     

ఇదంతా పక్కనపెడితే - 

అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా... సినిమా బాగుంటే చూస్తారు. బాగా లేకపోతే చూడరు.

Best wishes to Om Raut and his team.    

జై శ్రీరామ్!           

Wednesday 7 June 2023

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ - 5


నేనిప్పటివరకు డైరెక్టర్‌గా చేసిన 3 సినిమాల్లో సుమారు ఒక 55 మంది కంటే ఎక్కువ కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. 

వీళ్ళల్లో - హీరోలు, హీరోయిన్స్, విలన్స్, ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్, డాన్స్ మాస్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, మేనేజర్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులు... ఇలా దాదాపు ముఖ్యమైన అన్ని క్రాఫ్టుల నుంచి ఉన్నారు. 

ఈ సినిమాలన్నీ కూడా చేయాలనిపించినాప్పుడు, అన్నీ కుదిరినప్పుడు, అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా చేశాను తప్ప - నిజంగా నేనెప్పుడూ సినిమాల్లోకి పూర్తిగా దిగిపోలేదు. అలాంటి అవకాశం మొన్నమొన్నటివరకూ నాకు లేదు.     

డైరెక్టర్‌గా నాపేరుతో రిలీజైన నాలుగో సినిమాకు నిజానికి నేను పని చేయలేదు. శాటిలైట్ రైట్స్ బిజినెస్ కోసం నా పేరు వాడుకున్నారు. అది వేరే విషయం.  

కట్ చేస్తే -         

నేను పరిచయం చేసినవాళ్లల్లో చాలా మంది ఇప్పుడు వివిధ భాషల్లో నటిస్తూ, వివిధ స్థాయిల్లో బిజీగా ఉన్నారు. 

వెండితెరకు పరిచయమై లైమ్‌లైట్‌లోకి వచ్చాక, కొందరికి ఇతర వేర్వేరు ఫీల్డుల్లో మంచి అవకాశాలొచ్చి వెళ్ళిపోయారు. స్థిరపడ్డారు. మంచి స్థాయిలో ఉన్నారు. 

వీరందరిలో కొందరి గురించి నా తర్వాతి బ్లాగ్ పోస్టుల్లో క్లుప్తంగా చెప్తాను.

కట్ చేస్తే - 

కోవిడ్ తర్వాత - ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అనేక ఆదాయ మార్గాలు, ఓటీటీ వంటి ప్లాట్‌ఫామ్స్, పెరిగిన క్రేజ్... ఇవన్నీ మళ్ళీ బాగా టెంప్ట్ చేస్తున్నాయి.

మరోవైపు, నాక్కూడా మనీ వాల్యూ బాగా తెలిసివచ్చింది. సినిమాలు చేసుకుంటూ నాకిష్టమైన ఓ డజన్ కంట్రీలు సోలోగా తిరగాలనుకుంటున్నాను. 

కొంచెం ఆలోచించి, ఎవరితో సంబంధం లేకుండా, ఎలాంటి తలనొప్పులు కొత్తగా కొని తెచ్చుకోకుండా, కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని చెయ్యాలి. అంతా బాగుంటుంది. 

చిన్న బడ్జెట్స్ చాలు. కొత్తవాళ్ళు, అప్‌కమింగ్ వాళ్ళు చాలు. 

మూవీస్. మనీ. మస్తి. 

కట్ చేస్తే - 

ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న 2 సినిమాల్లో ఒక సినిమా Yo! ప్రిప్రొడక్షన్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. 

ఇంకో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్‌లో ఉంది. 

బైదివే - ఈ 2 సినిమాల్లో ఆల్రెడీ ఫేమ్‌లో ఉన్నవాళ్ళు కొందరుంటారు.

వారితో పాటు - కొత్త హీరోహీరోయిన్లు, కొత్త సపోర్టింగ్ ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్‌ను కూడా పరిచయం చేస్తున్నాను. 

డైరెక్షన్ & రైటింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ రైటర్స్‌ని కూడా కొత్తగా చాలా మందిని పరిచయం చేస్తున్నాను. 

ఇప్పుడు కొత్తగా పరిచయం చేస్తున్న టెక్నీషియన్స్‌లో ఒకరిద్దరు చీఫ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు.  

వారు ఎవరన్నది తర్వాతి పోస్టుల్లో...   

Monday 5 June 2023

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ - 4


నా ఫిలిం ప్రొడక్షన్ హౌజ్‌నుంచి నేను చేస్తున్న రెండు సినిమాల్లో ఒకదాన్లో 18-29 మధ్య వయసున్న, కోరియోగ్రఫీ బాగా తెలిసిన న్యూ టాలెంట్/ఫ్రెష్ జంట ఒకటి కావాలి. వారికి యాక్టింగ్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి.

సినిమాలో ఈ జంటకు మంచి ఫోకస్, ప్రమోషన్ ఉంటుంది. బాగా ఎస్టాబ్లిష్ అయ్యే చాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. 

ఆసక్తి ఉన్న కోరియోగ్రాఫర్స్/డాన్స్ బాగా తెలిసిన న్యూ టాలెంట్/ఫ్రెష్ అమ్మాయిలు, అబ్బాయిలు/జంటలు మీ ప్రొఫైల్స్ నాకు వాట్సాప్ చేయొచ్చు. వెంటనే ఆడిషన్‌కు రావల్సి ఉంటుంది. 

వాట్సాప్ నంబర్: 9989578125.

కట్ చేస్తే - 

సినిమా స్క్రిప్ట్ రైటింగ్‌ బేసిక్స్‌తో పాటు - స్క్రిప్టుని స్క్రిప్ట్ ఫార్మాట్‌లో రాయడం తెలిసిన కొత్త అసిస్టెంట్ రైటర్స్‌కు (18-35) మా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో అవకాశం ఉంది. 

ఇది ఉద్యోగం కాదు. అవకాశం మాత్రమే. ఆసక్తి ఉన్నవాళ్ళు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వెంటనే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రావల్సి ఉంటుంది. వాట్సాప్ నంబర్: 9989578125. 

ఇంకొన్ని అవకాశాల గురించి రేపు, ఇంకో పోస్టులో. 

కౌంట్ డౌన్ మనకు తెలియదు!


అంతా మన చేతుల్లో ఉందనుకుంటాం. 

ఉండదు అని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు గుర్తుచేస్తుంటాయి

కట్ చేస్తే -

జనగాం దగ్గర తరిగొప్పుల నివాసి అయిన ఒక రచయిత, కవి, నిత్య సంచారి (తమ్ముడు బీఆరెస్ వేణుతో కలిసి) ఒకసారి కొంపల్లి వచ్చి నన్ను కలిశాడు. 

కాఫీ తాగాం, చాలా సేపు మాట్లాడుకున్నాం. 

"సార్, మీ ఆఫీసుకు వచ్చి కూడా మిమ్మల్ని కలుస్తాను. మీరు రాసిన కేసీఆర్ బుక్ మీ చేత్తో తీసుకొని మీతో ఫోటో దిగాలి, ఫేస్‌బుక్‌లో పోస్టు చెయ్యాలి" అని తక కోరిక చెప్పాడు. 

అలాగే రమ్మన్నాను. 

తర్వాత అతను సిటీకి వచ్చి ఫోన్ చేసిన రెండు మూడు సార్లు నేను ఆఫీసులో లేను. 

కొన్ని గంటల క్రితం ఫేస్‌బుక్‌లో అతని ఫోటో చూశాను... అతను చనిపోయాడు!     

అతని పేరు జంగం వీరయ్య. 

వీరయ్య కొన్ని పుస్తకాలు రాశాడు, పబ్లిష్ చేశాడు. కొందరు సీనియర్ సాహితీవేత్తల్ని జనగాం ఆహ్వానించి ప్రోగ్రామ్స్ చేశాడు. 

ఇప్పుడు లేడు! 

వయస్సు ఒక నలభై ప్లస్ ఉంటుందేమో. అంతే...

కట్ చేస్తే - 

మొన్న రాత్రి రైలు ప్రమాదం. 

ట్రక్కుల్లో విసిరేస్తున్న వందలాది శవాలు. 

అప్పటిదాకా వాళ్ళంతా జీవితం మీద ఎన్నెన్ని ఆశలతోనో బతుకుతున్న మనలాంటి మనుషులే కదా... 

ఒక్క ప్రమాదం అసలు జీవితమే లేకుండా చేసేసింది! 

ఇలాంటి సందర్భాల్లోనే మన ఆలోచనల్లో స్మశాన వైరాగ్యం ఎంటరవుతుందనుకుంటాను. 

ప్రాక్టికాలిటీలో ఆలోచించినా అంతే... 

మనం ఎన్నాళ్ళుంటామో తెలీదు. ఉన్నన్నాళ్ళు ఇన్నిన్ని టెన్షన్స్ పెంచుకుంటూ పోవటం అవసరమా? 

వీలైతే చేతనైనంత మంచి చేద్దాం. జీవితాన్ని వీలైనంత కూల్‌గా ఎంజాయ్ చేద్దాం.

Sunday 4 June 2023

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ - 3


"నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి."
- మణిరత్నం 

మొన్న మణిరత్నం బర్త్‌డే నాడు ఒక ఆర్టికిల్ చూస్తున్నపుడు అతను చెప్పిన ఈ మాట కనిపించింది. 

ఇంటా బయటా ఎన్నో అనుభవించకపోతే, మణిరత్నం ఇంత గొప్ప వాస్తవం చెప్పేవాడు కాదు అని నాకనిపించింది. 

అంతదాకా ఎందుకు... మణిరత్నం డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న రోజుల్లో సుహాసిని డేట్స్ అడిగితే ఇవ్వలేదు. మణిరత్నం అప్పుడు అంత పెద్ద డైరెక్టర్ కాదు. సుహాసిని మాత్రం అప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్! 

1987లో అనుకుంటాను... మణిరత్నం 'నాయకుడు' సినిమాతో డైరెక్టర్‌గా ఇండియాలోనే టాప్ రేంజ్‌కి ఎదిగిపోయాడు. 1988లో సుహసిని  అతన్ని పెళ్ళిచేసుకుంది. 

దటీజ్ సినిమా. 🙂   

కట్ చేస్తే - 

ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, కొత్త కొత్త కథాంశాలతో మణిరత్నం ఇంకా సినిమాలు తీస్తున్నాడు. ప్రేక్షకులను అతని సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు. 

"ఇంకా మణిరత్నం సినిమాలెందుకు తీస్తున్నాడు?" అని అసలు సినిమా తీయడంలో ఓనమాలు కూడా ప్రాక్టికల్‌గా తెలియని వెర్రి విశ్లేషకులు రాస్తున్నది పట్టించుకోకుండా - ఆమధ్యే ఒక "ఓకే బంగారం" సినిమా తీసి, యూత్‌కి కనెక్ట్ అయ్యే అడ్వాన్స్‌డ్ ట్రెండీ సబ్జెక్టులను కూడా తనెంత బాగా తీయగలడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మణిరత్నం. 

సుధ కొంగర, గౌతమ్ మీనన్, సుహాసిని, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకులుగా మొన్నీమధ్యే "పుతం పుదు కాలై" పేరుతో ఒక 5 అద్భుత కథల యాంథాలజీ సినిమాను నిర్మాతగా తీశాడు!

మొన్నటికి మొన్న "పి యస్ - 1", "పి యస్ - 2" లు తీసి, భారీ సినిమాలకు భారీ గ్రాఫిక్స్ లాంటి హంగులు అంత అవసరం లేదు అని హిట్ కొట్టి నిరూపించాడు. 

తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ ఎందుకంటే... అప్పుడు మాత్రమే తను అనుకున్నట్టు సినిమా తీయడానికి వీలవుతుంది కాబట్టి. ఒకవేళ ఫట్ అయినా ఇంకొకరెవరో కారణం అని చెప్పి తప్పించుకొనే వీలుండదు కాబట్టి! 


ఇంకో లివింగ్ లెజెండ్ ఇళయరాజా, మణిరత్నం... వీళ్ళిద్దరి పుట్టినరోజు జూన్ 2 కావడం విశేషం.    
  
తన మద్రాస్ టాకీస్ బ్యానర్‌లో ఇంకెన్నో కొత్త సినిమాల పనుల్లో ఇప్పటికీ బిజీగా ఉన్న లివింగ్ లెజెండ్... 67 ఏళ్ళ మణిరత్నం విషయంలో 'Age is Just a Number' అన్నది వంద శాతం నిజం.   

Saturday 3 June 2023

కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్ - 2


సినిమాఫీల్డులో ఎంట్రీ అనేది అంత ఈజీ కాదు...

మంచి కాంటాక్ట్స్ ఉండాలి, లేదంటే బాగా డబ్బుండాలి.

టాలెంట్ అనేది బై డిఫాల్ట్ ఉండితీరాలి. కాని, కేవలం టాలెంట్‌తోనే ఫీల్డులోకి ప్రవేశించి ఒక స్ఠాయికి చేరుకోవడం అనేది చాలా అరుదుగా కొందరికే సాధ్యమౌతుంది. 

ఇలాంటి పరిస్థితుల్లో - మీ సమయం వృధా కావద్దు అనుకుంటే - కోపరేటివ్ ఫిలిం మేకింగ్ అనేది ఒక మంచి చాన్స్. 

ఆర్టిస్టులుగానో, అసిస్టెంట్ డైరెక్టర్స్‌గానో ఈ పద్ధతిలో సినీఫీల్డు ఎంట్రీ చాలా ఈజీ.   


ఇన్వెస్ట్ చేస్తూ, హీరోలుగా ఇంట్రడ్యూస్ కావాలనుకోనే కొత్త హీరోలకు, కొత్త సపోర్టింగ్ ఆర్టిస్టులకు కూడా సూపర్ వెల్కమ్!! 

మీకు వీలయినంత ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఇన్-ఫిలిం కోచింగ్ ద్వారా ప్రవేశించొచ్చు. 

కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. కనెక్ట్ అవండి. పాజిబిలిటీస్  చర్చిద్దాం.  

ఒక్కటే గుర్తుపెట్టుకోండి... 

ఏదీ
ఊరికే
రాదు! 

కట్ చేస్తే - 

చిన్న గ్యాప్ తర్వాత - "కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్" కాన్సెప్ట్‌తో నేను 2 సినిమాలు ప్రారంభించాను.

అందులో మొదటిది:
Yo! 

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి పనిచేయాలనుకొనే కొత్త ఇన్వెస్టర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీ పూర్తి వివరాలు తెలుపుతూ నాకు Whatsapp/Call చెయ్యొచ్చు: 9989578125  

"It's a kind of fun to do the impossible!"
- Walt Disney

"కోపరేటివ్ ఫిలిం మేకింగ్" - 1


1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగజ్ ఇదే పధ్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పధ్ధతిలోనే తీశాను.  

2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" తీశాడు.  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది ఉండదు. 

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు!!

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే - దీనికి ప్రొడ్యూసర్ ఉండడు. 

అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.  

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు. 

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ దాకా... ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు అద్భుత విజయం సాధించాయి. 


కొంచెం గ్యాప్ తర్వాత - ఇప్పుడు నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది. 

వీటిలో మొదటిది... 
Yo!

రెండో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్లో ఉంది. 

Friday 2 June 2023

ఆ కఠోర శ్రమ, ఆ విజయాలు, ఆ పతకాలు దేని కోసం?


అతని పేరు రాయడం కూడా నాకు ఇష్టం లేదు. 66 సంవత్సరాల వయస్సు. రెజ్లర్స్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడు. 

ఇప్పుడే ఎన్‌డీటీవీ పోర్టల్లో అతని మీద మహిళా రెజ్లర్లు ఇచ్చిన కంప్లెయింట్స్ గురించి, అతని మీద బుక్ అయి ఉన్న 2 ఎఫ్ ఐ ఆర్ ల గురించీ చదివాను. 

ఎంత దారుణమైన స్థితిలో ఉంది మన దేశం? 

అంత నీచమైన ఆరోపణలతో 2 ఎఫ్ ఐఆర్ లు ఫైల్ చేయబడి, అతని మీద ఇంకా ఎలాంటి చర్యలు లేవంటే ఏమనుకోవాలి?

అతనే ఒక నాన్-బీజేపీ ఎంపి అయ్యుంటే ఇలాగే జరిగేదా? 

దేశ రాజధాని నడిరోడ్డు మీద - దేశానికి పథకాలు సంపాదించిపెట్టిన రెజ్లర్ మహిళలు - అంత బాహాటంగా జరిగింది చెప్తూ, తమకు న్యాయం కావాలి అని, వెంటనే అతన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేసి, విచారించి శిక్షించాలని ఆందోళన చేస్తుంటే ఎంతమంది స్పందించారు?

ఎన్ని రాజకీయ పార్టీలు వారికి అండగా నిలిచాయి?

నడి రోడ్డు మీద రెజ్లర్స్‌ను అంత బలవంతంగా మ్యాన్‌హాండ్లింగ్ చేస్తూ - పోలీసులు తీసుకెళ్ళిన వార్లని చూశాక కూడా - ఈ సోకాల్డ్ సంఘాలు, ఎంపవర్‌మెంట్ గ్రూపులు, మేధావి వర్గాలు... ఏం చెయ్యలేకపోయాయన్నది ఎంత ఘోరమైన నిజం? 


రెజ్లర్ల ఆ కఠోర శ్రమ, ఆ విజయాలు, ఆ పతకాలు దేని కోసం? 

అధికారం అనే అండే లేకపోతే అసలెందుకూ పనికిరాని ఇలాంటి మానసిక వికలాంగుల లైంగిక వేధింపుల కోసమా?     

కట్ చేస్తే -

యాజిటీజ్‌గా ఇదే సమస్యని సబ్జక్ట్‌గా తీసుకొని - ఆ మధ్య భరత్ కమ్మ దర్శకత్వంలో తీసిన అద్భుత సినిమా "డియర్ కామ్రేడ్"ను ఒక అట్టర్‌ఫ్లాప్ చిత్రంగా రాసిన రివ్యూయర్ మేధావులున్న ఈ దేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళాక్రీడాకారులకు ఇంతకన్నా మేలు ఏం జరుగుతుంది? 

తెల్లారి లేస్తే గుడ్‌మాణింగ్‌లు, ఆ డేలు, ఈ డేలు అంటూ రొటీన్ పోస్టులు పెట్టుకునే మనకు ఈ రెజ్లర్ల ఆందోళన కనిపించదు.

రాజకీయాల గురించి, వారి వారి అభిమాన హీరోల గురించీ, వారి రికార్డుల గురించి, రాబోయే సినిమాల ఫస్ట్ గ్లింప్స్ గురించి... ఇంకా వేటివేటి గురించో స్టేటస్‌లు, పోస్టులు పెట్టుకొనే మన దేశపు సోషల్ మీడియా జీవులకు అసలీ సమస్య కనిపించదు. 

వీరి ఆందోళన వెనుక ఒక రాజకీయ పార్టీ హస్తం ఉంది అని నిస్సిగ్గుగా కొందరంటారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించే అమ్మాయిలు - ఏదో ఒక పార్టీ చెప్పిందని - ఇంత సున్నితమైన విషయాల మీద రోడ్డుమీదకెక్కుతారా? 

వాళ్లంతా దేశం కోసం పతకాలు సాధించి తెచ్చిన చాంపియన్స్! డబ్బుల కోసం, పవర్ కోసం సిగ్గులేకుండా అటూఇటూ దూకే పొలిటీషియన్స్ కాదు.  

కామన్ సెన్స్! 


మరోవైపు - దేశంలోని మిగిలిన క్రీడాకారులు, క్రికెటర్స్‌, సినీస్టార్స్ ఎవ్వరూ... ఈ మహిళా రెజ్లర్స్ ఆందోళన విషయంలో అసలు స్పందించకపోవడం అన్నది వారి సెలబ్రిటీ స్థాయినే ప్రశ్నార్థకం చేస్తోంది.   

ఇందాకనే ఒక న్యూస్ చదివాను. 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీం - కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, వెంగ్ సర్కార్, మొహిందర్ అమర్‌నాథ్... మొదలైనవాళ్లంతా ఆందోళన చేస్తున్న రెజ్లర్స్‌కు సంఘీభావం తెలుపడం గొప్ప విషయం. 

రియల్లీ హాట్సాఫ్! 

డియర్ కపిల్ & టీమ్... నిజంగా మీరే నిజమైన హీరోలు!   

కట్ చేస్తే -

ఒక తప్పును ఖండించడానికి కూడా పాలసీలు, ఇమేజ్‌లు, రకరకాల ఫిల్టర్స్, ఐడెంటిటీలు, విధేయతలు అడ్డొచ్చే మనుషులున్న దేశం ఇది. ఇంకా ఎందుకిక్కడ మీరంతా? 

డియర్ రెజ్లర్స్... క్రీడాకారులకు నిజమైన విలువిచ్చే ఇంకే దేశమైనా వెళ్ళిపోండి. మీకెంతో సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాయి ఆ దేశాలు...