Wednesday 14 June 2023

ఒక పెద్దాయన చెప్పిన 2 చిన్న విషయాలు!


కొన్నాళ్ళ క్రితం నేను చదివిన ఒక సీనియర్ జర్నలిస్టు బ్లాగ్ పోస్టులోని సారాంశాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా రాస్తున్న పోస్టు ఇది. 

సుమారు ఒక 15 ఏళ్ల క్రితమే ఆలిండియా రేడియో నుంచి రిటైరయిన ఈ జర్నలిస్టుకు రాజకీయాల మీదున్న సంపూర్ణ అవగాహనను అంత ఈజీగా కొట్టిపారేయలేం.  

ఎలాంటి సాగతీత లేకుండా నేను రాస్తున్న ఈ పోస్టు కొందరికైనా ఉపయోగపడుతుందని నా నమ్మకం. 

కట్ చేస్తే - 

ప్రపంచంలో ఏ పొలిటికల్ లీడర్‌కైనా, ఏ పొలిటికల్ పార్టీకైనా ప్రధానంగా రెండు రకాల ఫ్యాన్స్ ఉంటారు.

హార్డ్ కోర్ ఫ్యాన్స్.
హార్డ్ ఫ్యాన్స్.  

హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభిమానం అస్సలు మారదు. ఎలాంటి ప్రలోభాలకు లొంగదు. ప్రవాహం మధ్యలో ఉన్న ఒక రాయి మీద నీటి వొరవడికి ఏర్పడిన ఒక గ్రూవ్ లాంటిది వీరి అభిమానం. ఆ గ్రూవ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప పోదు. ఇలాంటి అభిమానులు తమ నాయకుని మీద, పార్టీ మీద ఈగ వాలనీయరు. ఎవరైనా తమ నాయకుని మీద ఒక చిన్న కామెంట్ చేస్తే వంద రెట్లు ఉతికి ఆరేస్తారు. వీరి వోట్లు, వీరి వాలంటరీ సేవలు స్విజ్ బ్యాంకులో దాచుకున్న డబ్బుతో సమానం. ఎక్కడికీ పోవు.       

హార్డ్ ఫ్యాన్స్ అలా కాదు. వీరి అభిమానం సీజనల్‌గా ఉంటుంది. ఉంటే ఆకాశం ఎత్తులో ఉంటుంది. ఏదైనా తమకు అనుకూలం కాని చిన్న సంఘటన జరిగినప్పుడు అప్పటిదాకా ఆకాశం ఎత్తులో ఉన్న అభిమానం క్షణంలో మాయమైపోతుంది. ఓవర్‌నైట్‌లో పార్టీ మారగలుగుతారు. వీరికి ఉండే కొన్ని అదనపు క్వాలిటీస్‌తో తమ నాయకున్ని, తర్వాతి హయరార్కీని ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా ఇంప్రెస్ చేయగలుగుతుంటారు. గుర్తింపునీ పదవులనూ పొందుతారు. 

అసలు విషయం ఏంటంటే - 
రాజకీయ నాయకులు గాని, పార్టీలు గాని తమ కోసం ప్రాణం పెట్టే హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే - ఆ వోట్ బ్యాంకు, వారి సేవలు పదిలం కాబట్టి! 

హార్డ్ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా పట్టించుకుంటారు. పేరు పేరునా గుర్తించుకుంటారు. కారణం - ఇలాంటివాళ్లతోనే రాజకీయాలు, రాజనీతి బాగా నడుస్తాయి కాబట్టి!! 

దీన్ని బట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొన్ని భ్రమల్లోంచి బయటపడాలి. ఏదైనా ఒక సున్నితమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆగాలి. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించాలి. 

ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా పార్టీలు, వ్యవస్థలు నడుస్తూనే ఉంటాయి, ఆగిపోవు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి.  

ఏ వ్యవస్థ అయినా సరే తనను నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తిని సంతృప్తి పరుచడం అన్నది అసాధ్యం అన్న నిజాన్ని అర్థం చేసుకోవాలి. 

1 comment:

  1. అయితే మీరు .... ?
    గవర్నమెంట్ మీది , మీరు తలుచుకుంటే ఎవరి అప్పోయింట్మెంట్ అయినా దొరుకుతుంది .
    గవర్నమెంట్ దగ్గర , కొన్ని వందల కోట్ల పబ్లిసిటీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి , అందులో మీరు జస్ట్ ఒక రెండు , మూడు పట్టారు అంటే , ఖేల్ ఖతం దుఖాన్ బంద్ , ప్రభాస్ తో సినిమా చేసేయొచ్చు . ఏమంటారు ??

    ReplyDelete