Friday 23 June 2023

జోహార్ తెలంగాణ అమరవీరులారా...


"చిన్నదో పెద్దదో... ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకునేవారు కేసీఆర్ గారిని, వారి సంకల్ప శక్తిని ఆదర్శంగా తీసుకుంటే చాలు."

ఇది నేను ఎవరికో చెప్తున్న సలహా కాదు. తాజాగా నాకు నేనే ఇచ్చుకుంటున్న సెల్ఫ్ మోటివేషన్. 

కట్ చేస్తే -

నాకున్న నానా యావగేషన్స్, తలనొప్పుల మధ్యలో ఎందుకులే అని కొన్ని రోజులు అప్పుడప్పుడు నా పొలిటికల్ బ్లాగింగ్, సోషల్ మీడియా పోస్టుల విషయంలో కొంచెం గ్యాప్ తీసుకుంటుంటాను. 

ఇలా గ్యాప్ వచ్చినప్పుడు మిత్రులు కొందరు "ఏమయిందివయా... అంత బిజీ అయిపోయినవా, ఏం రాస్తలేవేంది... కేసీఆర్‌ను మర్చిపోయినవా?" అంటారు. 

అదేపనిగా వరుసపెట్టి పొలిటికల్ బ్లాగ్స్, సోషల్ మీడియా పోస్టులు రాస్తున్నప్పుడు, "సక్కగ ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీసి ఇన్ని పైసల్ సంపాదించుకోక నీకెందుకన్నా ఈ పాలిటిక్స్?" అని అనేది కూడా ఈ మిత్రులే! 

ఇలాంటి నేపథ్యం మధ్య - మరోవైపు - ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ ప్రెస్‌మీట్లతో, తమ నిరంతర విజయాల పరంపరతో సింపుల్‌గా అలా ఛాలెంజ్ విసురుతుంటారు...

"అసలు నువ్వు రాయకుండా ఉండగలవా?" అని.  

ఈరోజు సాయంత్రం "అమరజ్యోతి" ప్రారంభోత్సవం ఒక ఎమోషనల్ మూమెంట్. 

కేసీఆర్ గారి ఉపన్యాసంలో వారు చెప్పిన రెండు విషయాలు వారిపట్ల నా అభిమానాన్ని, గౌరవాన్ని పదింతలు చేశాయి. 

కళ్ళు చెమర్చాయి... 

ఉద్యమ సమయంలోని ఒకానొక సందర్భంలో - కొండా లక్ష్మణ్ బాపూజీ గారి  జలదృశ్యంలో టీఆరెస్ ఆఫీసు ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వ దమనకాండలో భాగంగా - జలదృశ్యం ఆఫీసులోని ఫర్నిచర్, పేపర్లు, ఫైళ్ళు, డాక్యుమెంట్స్ అన్నిటినీ తెచ్చి బయట రోడ్డుమీద పడేశారు. 

అదే జలదృశ్యం దగ్గర ఇప్పుడు తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణం "అమరజ్యోతి"ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు కేసీఆర్!     

రేపటి నుంచి రాష్ట్ర సందర్శనకు వచ్చే జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకులు, బిజినెస్‌మెన్ వంటివారందరికీ మొట్ట మొదట మనం చూపించబోయే సందర్శన స్థలం... అమరజ్యోతి!

ఇదీ... తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మాహుతి చేసుకొన్న అమరవీరుల త్యాగానికి కేసీఆర్ గారిస్తున్న గౌరవం!

హాట్సాఫ్... 

కట్ చేస్తే - 

త్వరలో నేను ప్రచురించబోతున్న నా తాజా పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే అమరజ్యోతి ప్రాంగణంలో ఉన్న సమావేశమందిరంలోనే చేయాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను...  

No comments:

Post a Comment