Friday 2 June 2023

ఆ కఠోర శ్రమ, ఆ విజయాలు, ఆ పతకాలు దేని కోసం?


అతని పేరు రాయడం కూడా నాకు ఇష్టం లేదు. 66 సంవత్సరాల వయస్సు. రెజ్లర్స్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడు. 

ఇప్పుడే ఎన్‌డీటీవీ పోర్టల్లో అతని మీద మహిళా రెజ్లర్లు ఇచ్చిన కంప్లెయింట్స్ గురించి, అతని మీద బుక్ అయి ఉన్న 2 ఎఫ్ ఐ ఆర్ ల గురించీ చదివాను. 

ఎంత దారుణమైన స్థితిలో ఉంది మన దేశం? 

అంత నీచమైన ఆరోపణలతో 2 ఎఫ్ ఐఆర్ లు ఫైల్ చేయబడి, అతని మీద ఇంకా ఎలాంటి చర్యలు లేవంటే ఏమనుకోవాలి?

అతనే ఒక నాన్-బీజేపీ ఎంపి అయ్యుంటే ఇలాగే జరిగేదా? 

దేశ రాజధాని నడిరోడ్డు మీద - దేశానికి పథకాలు సంపాదించిపెట్టిన రెజ్లర్ మహిళలు - అంత బాహాటంగా జరిగింది చెప్తూ, తమకు న్యాయం కావాలి అని, వెంటనే అతన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేసి, విచారించి శిక్షించాలని ఆందోళన చేస్తుంటే ఎంతమంది స్పందించారు?

ఎన్ని రాజకీయ పార్టీలు వారికి అండగా నిలిచాయి?

నడి రోడ్డు మీద రెజ్లర్స్‌ను అంత బలవంతంగా మ్యాన్‌హాండ్లింగ్ చేస్తూ - పోలీసులు తీసుకెళ్ళిన వార్లని చూశాక కూడా - ఈ సోకాల్డ్ సంఘాలు, ఎంపవర్‌మెంట్ గ్రూపులు, మేధావి వర్గాలు... ఏం చెయ్యలేకపోయాయన్నది ఎంత ఘోరమైన నిజం? 


రెజ్లర్ల ఆ కఠోర శ్రమ, ఆ విజయాలు, ఆ పతకాలు దేని కోసం? 

అధికారం అనే అండే లేకపోతే అసలెందుకూ పనికిరాని ఇలాంటి మానసిక వికలాంగుల లైంగిక వేధింపుల కోసమా?     

కట్ చేస్తే -

యాజిటీజ్‌గా ఇదే సమస్యని సబ్జక్ట్‌గా తీసుకొని - ఆ మధ్య భరత్ కమ్మ దర్శకత్వంలో తీసిన అద్భుత సినిమా "డియర్ కామ్రేడ్"ను ఒక అట్టర్‌ఫ్లాప్ చిత్రంగా రాసిన రివ్యూయర్ మేధావులున్న ఈ దేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళాక్రీడాకారులకు ఇంతకన్నా మేలు ఏం జరుగుతుంది? 

తెల్లారి లేస్తే గుడ్‌మాణింగ్‌లు, ఆ డేలు, ఈ డేలు అంటూ రొటీన్ పోస్టులు పెట్టుకునే మనకు ఈ రెజ్లర్ల ఆందోళన కనిపించదు.

రాజకీయాల గురించి, వారి వారి అభిమాన హీరోల గురించీ, వారి రికార్డుల గురించి, రాబోయే సినిమాల ఫస్ట్ గ్లింప్స్ గురించి... ఇంకా వేటివేటి గురించో స్టేటస్‌లు, పోస్టులు పెట్టుకొనే మన దేశపు సోషల్ మీడియా జీవులకు అసలీ సమస్య కనిపించదు. 

వీరి ఆందోళన వెనుక ఒక రాజకీయ పార్టీ హస్తం ఉంది అని నిస్సిగ్గుగా కొందరంటారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించే అమ్మాయిలు - ఏదో ఒక పార్టీ చెప్పిందని - ఇంత సున్నితమైన విషయాల మీద రోడ్డుమీదకెక్కుతారా? 

వాళ్లంతా దేశం కోసం పతకాలు సాధించి తెచ్చిన చాంపియన్స్! డబ్బుల కోసం, పవర్ కోసం సిగ్గులేకుండా అటూఇటూ దూకే పొలిటీషియన్స్ కాదు.  

కామన్ సెన్స్! 


మరోవైపు - దేశంలోని మిగిలిన క్రీడాకారులు, క్రికెటర్స్‌, సినీస్టార్స్ ఎవ్వరూ... ఈ మహిళా రెజ్లర్స్ ఆందోళన విషయంలో అసలు స్పందించకపోవడం అన్నది వారి సెలబ్రిటీ స్థాయినే ప్రశ్నార్థకం చేస్తోంది.   

ఇందాకనే ఒక న్యూస్ చదివాను. 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీం - కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, వెంగ్ సర్కార్, మొహిందర్ అమర్‌నాథ్... మొదలైనవాళ్లంతా ఆందోళన చేస్తున్న రెజ్లర్స్‌కు సంఘీభావం తెలుపడం గొప్ప విషయం. 

రియల్లీ హాట్సాఫ్! 

డియర్ కపిల్ & టీమ్... నిజంగా మీరే నిజమైన హీరోలు!   

కట్ చేస్తే -

ఒక తప్పును ఖండించడానికి కూడా పాలసీలు, ఇమేజ్‌లు, రకరకాల ఫిల్టర్స్, ఐడెంటిటీలు, విధేయతలు అడ్డొచ్చే మనుషులున్న దేశం ఇది. ఇంకా ఎందుకిక్కడ మీరంతా? 

డియర్ రెజ్లర్స్... క్రీడాకారులకు నిజమైన విలువిచ్చే ఇంకే దేశమైనా వెళ్ళిపోండి. మీకెంతో సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాయి ఆ దేశాలు...   

3 comments:

  1. you genuinely raised a valid concern for the plight of the wrestlers and there is no excuse to not back them irrespective of your political affiliation. point clank and well written piece.

    ReplyDelete
  2. రాజకీయం లేని రంగం మన దేశంలో ఏదీ లేదు.
    క్రీడా సంఘాలని క్రీడాకారులు నడిపించలేరా? అక్కడ కూడా రాజకీయ నాయకులు ఎందుకు?
    ఏ వైపు నుంచి ప్రోత్సాహం లేని పరిస్థితుల్లో పతకాలు సాధించిన వాళ్ళని ఇలా వేధించడం దారుణం. అందుకే మన దేశానికి కోటి మందికి ఒక్క పతకం కూడా రావడం లేదు.

    ReplyDelete