Friday 26 August 2022

ఆరంభింపరు నీచ మానవులు... (1)


"మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు? అయినా సరే, ఆయన మీద పొద్దుగాల లేస్తే ఎంతమంది రాళ్లేస్తలేరే?" 

మొన్న సాయంత్రం ఆఫీసు నుంచి కార్లో ఇంటికి వెళ్తున్నప్పుడు ఫోన్లో ఒక మిత్రుడు అన్న మాట అది.

కట్ చేస్తే - 

నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"ను తెలంగాణ ఐటీ & ఇండస్ట్రీస్ మినిస్టర్, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న జూలై 5 నాడు ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. 

కేసీఆర్ కేంద్రబిందువుగా గత కొన్నేళ్ళుగా నేను రాసిన వందలాది బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, దినపత్రికల ఎడిట్ పేజీ ఆర్టికిల్స్ లోంచి - ఎన్నిక చేసిన ఒక 55 ఆర్టికిల్స్‌తో - ఒక అందమైన సంకలనంగా రూపొందించిన పుస్తకమిది. 

ప్రస్తుతం నేను ఎండీగా పనిచేస్తున్న స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ స్వర్ణసుధ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.  

ఈ పుస్తకం ధర తెలిపే (విటిపి) పేజీలో, ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదన్న విషయాన్ని తెలుపుతూ, ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్ని చారిటీస్‌కు వినియోగిస్తాం అని స్పష్టంగా చెప్పాం. 

కట్ చేస్తే - 

ఈ పుస్తకం ప్రచురణ కోసం భారీగా చందాలు వసూలు చేశారని, "క్విడ్ ప్రో కో" దృష్టితో ఈ పుస్తకం ప్రచురించారనీ, ఫోటోలు-రివ్యూల కోసం పదులకొద్దీ కాల్స్ చేస్తున్నారనీ ఒక బాధాతప్త హృదయుని జెలసీ ఫేస్‌బుక్ పోస్టు రూపంలో కనిపించింది.  

దాన్ని 3 రోజుల క్రితమే మిత్రులు నా దృష్టికి తెచ్చారు.

రాళ్లేయటం మామూలేగా అనుకున్నాను కాని, నేను స్పందించకపోతే అదే నిజం అని కొందరైనా అనుకునే ప్రమాదం ఉంది. కొందరు అతి దగ్గరి మిత్రులు కూడా "ఈగర్లీ వెయిటింగ్" అనటంతో ఇంక ఇది రాయక తప్పడం లేదు.       

పై ఆరోపణల్లో మొదటిదానికి జవాబు పై పేరాల్లో చాలా స్పష్టంగా ఉంది. పుస్తకంలోనే ప్రింట్ రూపంలో కూడా ఉంది. 

స్వర్ణసుధ పబ్లికేషన్స్ సంస్థవాళ్ళు ఈ పుస్తకాన్ని ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీతో చాలా ఖర్చుపెట్టి ప్రచురించారు. 

ఇక, క్విడ్ ప్రో కో విషయానికొద్దాం...

నేనింతకు ముందు జర్నలిజం పైన రాసిన పుస్తకం ఒక యూనివర్సిటీలో ఎమ్మే విద్యార్థులకు రిఫరెన్స్ బుక్స్ లిస్టులో ఉంది. ఆ యూనివర్సిటీ నుంచి ఏదైనా క్విడ్ ప్రో కో ఆశించి రాశానా నేనా పుస్తకం? 

సినీఫీల్డుకు సంబంధించి నేను రాసిన ఇంకో పుస్తకం "ది బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్" కేటగిరీ కింద నాకు నంది అవార్డు సాధించిపెట్టింది. నేను సినీఫీల్డు నుంచి సో కాల్డ్ క్విడ్ ప్రో కో ఏదైనా ఆశించి రాసినట్టా ఆ పుస్తకాన్ని?   

ఇప్పుడీ పుస్తకం కూడా "నేను ఎందుకు రాశాను" అన్నదాని మీద పుస్తకం ప్రారంభంలోనే "ప్రొలోగ్" పేరుతో ఒక 6 పేజీల అధ్యాయం రాశాను.    

ఇక "పదుల సంఖ్యలో కాల్స్" అనే ఆరోపణకు అసలు అర్థం లేదు. 

మామూలుగానే నేను చాలా రిజర్వ్‌డ్. ఈ విషయంలో నేనిప్పటివరకు కేవలం ఇద్దరే ఇద్దరు మిత్రులకు కాల్ చేశాను-లేదా-మెసేజ్ పెట్టాను. అది కూడా, రచయితలుగా వారిద్దరూ ఏంటో నాకు తెలుసు కాబట్టీ, నా పుస్తకం గురించి వారు రాసే ఆ రెండు వాక్యాలు నేను చదవాలన్న పర్సనల్ క్యూరియారిసిటీతోనే అడిగాను. అది పూర్తిగా నా వ్యక్తిగతం. 

ఇంతకు మించి - కేవలం (నన్ను బుక్ పంపమని అడిగిన) ఇద్దరికో ముగ్గురికో మెసేజ్ మాత్రం పెట్టాను చాలా క్యాజువల్‌గా... "బుక్ అందాక వీలైతే ఫోటో పంపండి, రివ్యూ రాయగలిగితే రాయండి" అని. 

ఆ మెసేజ్ కూడా ఎందుకు పెట్టానంటే - కేసీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్‌గా, పార్టీ కార్యకర్తలుగా వారి సేవల స్థాయి గురించి నాకు వ్యక్తిగతంగా కొంత తెలుసు కాబట్టి, బుక్ గురించి వారి ఫీలింగ్స్ తెల్సుకోవాలని. అంతే.  

ఏళ్ళుగా పరిచయం ఉన్న అతిదగ్గరి మిత్రులకే ఏడాదికోసారి కూడా ఫోన్స్ చేసుకొనే వీలులేని ఈ రోజుల్లో - ఎలాంటి పరిచయం లేని ఎవరెవరికో పదుల సంఖ్యలో కాల్స్ చేసే సమయం నాకైతే లేదు. 

ముందుమాటలు, రివ్యూలు ఒక పుస్తకం సేల్స్ పెంచవు అన్న విషయం తెలిసినవాణ్ణి. ఒక పుస్తకం ఎందుకు బెస్ట్ సెల్లర్ అవుతుందో కూడా తెలిసినవాణ్ణి. ఇలాంటి అర్థం లేనివాటికి స్పందించాల్సి రావడం పెద్ద విషాదం.  

ఓయూలో రెండు పీజీలు చదివాను. పీజీ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. సుమారు పదిహేనేళ్ళపాటు మూడు కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేశాను, రిజైన్ చేశాను. 

కేసీఆర్ గారి మీద అభిమానంతో - ఒక రచయితగా - నాకు చేతనైనంతలో నేను చేసిన ఈ చిరు ప్రయత్నం మీద ఇలాంటి నిమ్నస్థాయి ఆలోచనలు చేసేవారు కూడా ఉండటం అన్నది నిజంగా నేను ఊహించని విషయం. 

వారికి నా ప్రేమ, వారిపైన నా జాలి, వారి పట్ల నా విచారం, వారి మానసిక స్థాయికి నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. 

వారి కారణంగా ఇలాంటి పోస్టు ఒకటి రాయాల్సివచ్చినందుకు మాత్రం నిజంగా బాధపడుతున్నాను. 

కట్ చేస్తే - 

ఈ పోస్టు ప్రారంభంలో నా మిత్రుడు అన్న మాట ఒకటి కోట్ చేశాను. మొన్న ఫోన్లో ఆ మాట విన్నతర్వాత "నిజమే కదా" అనిపించింది. 

మనలోని నిరాశ నిస్పృహలు, అసమర్థత, జెలసీ, నెగెటివిటీలను ఇంకొకరు చేసే మంచి పనుల మీద బురదచల్లడానికి ఉపయోగించకూడదు. అంతకంటే శాడిజం ఇంకోటి ఉండదు. 

కేసీఆర్ గారి మీద, వారి ప్రభుత్వం మీద, వారి కుటుంబం మీద, తెలంగాణ మీద నాన్-స్టాప్‌గా ఇప్పుడు జరుగుతున్న రకరకాల దాడులకు నేపథ్యం కూడా అలాంటి శాడిజమే.  

వాళ్ళు చేయలేరు, ఇంకొకర్ని చేయనివ్వరు. 

No comments:

Post a Comment