Wednesday 31 August 2022

ఎందుకని ఈ ఒక్క సినిమాకే ఇంత శాడిస్టిక్ మాస్ హిస్టీరియా?


తొంభై శాతం సినిమాలు ఫ్లాపవుతాయి. పత్తాలేకుండా పోతాయి. 

సినిమా పుట్టినప్పట్నుంచీ ఇది అతి మామూలుగా జరుగుతున్న విషయమే. అందరికీ తెలిసిన విషయమే.

ఎన్నెన్నో చారిత్రాత్మక సూపర్ డూపర్ హిట్లిచ్చిన దర్శకరత్న దాసరి సినిమాల్లో సూపర్ ఫ్లాపులు లేవా? 

దళపతి, రోజా వంటి అద్భుత సినిమాల రూపశిల్పి మణిరత్నం అతి దారుణమైన అట్టర్ ఫ్లాపులివ్వలేదా? 

అలాగే, పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపుల్లో ఇదొకటి అనుకుందాం. 

లైగర్. 

సో వాట్? 

కట్ చేస్తే -

ఏ డైరెక్టర్ కూడా పనికట్టుకొని పొగరుతోనో, ఈగోతోనో, అసలేం ఆలోచించకుండానో ఒక ఫ్లాప్ సినిమా తీయాలనుకోడు. 

అప్పుడప్పుడు అంచనాలు తప్పవుతాయి, అనుకున్న ఫలితం రాదు. 

అంతమాత్రాన ఆ ఫిలింమేకర్ ప్రేక్షకులను తక్కువ అంచనా వేశాడని అనుకోడానికి వీళ్లేదు. వందల కోట్ల తన డబ్బు చూస్తూ చూస్తూ అలా వృధా చేసుకుంటాడనుకోడానికీ వీళ్లేదు. 

అదలా జరుగుతుందంతే. 

లైగర్ విషయంలోనూ జరిగిందదే. 

అంతకు ముందు ఎన్ని వందల సినిమాలు ఫ్లాప్ కాలేదు? 

లైగర్ కంటే దారుణంగా అర్థం పర్థం లేకుండా ఎన్ని సినిమాలు రాలేదు? 

కాని, ఈ ఒక్క సినిమాకే ఎందుకింత శివమెత్తిపోయారు? రిలీజ్ కంటే ముందే 'ఫ్లాప్ ఫ్లాప్' అని ఎందుకంత సంబరం? 

ఇంతకుముందెప్పుడైనా ఒక ఫ్లాపైన సినిమాకు 3000 లకు పైగా రివ్యూలు మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని వచ్చాయా? 

అసలిన్ని రివ్యూలు ఒక సూపర్ హిట్ అయిన సినిమాకైనా రాస్తారా? 

ఎందుకని ఈ ఒక్క సినిమాకే ఇంత పూనకం? 

ఎందుకని ఇంత శాడిస్టిక్ మాస్ హిస్టీరియా?  

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త హీరో - చూస్తుండగానే - ఒక టాప్ రేంజ్ హీరోగా దూసుకెళ్తున్నాడని లోపల్లోపలి భయమా?

డైరెక్టర్ పూరి లాగే, పెద్ద హీరోలని పెద్దగా పట్టించుకోకుండా, హిట్లో ఫట్లో వరుసగా తన సినిమాలు తను చేసేసుకొంటూ, తన దారిలో తను వెళ్తున్నాడని జెలసీ నిండిన వేదనా? 

కట్ చేస్తే - 

లైగర్... అదేం చెత్త సినిమా కాదు. ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమా. అత్యుత్తమమ స్థాయి సాంకేతిక విలువలతో తీసిన సినిమా.

లోపాలున్నాయి. 

ఆ లోపాల కారణంగా అది సూపర్ డూపర్ హిట్ కాకపోవచ్చు. కాని, మామూలు పరిస్థితుల్లో అయితే సవాల్ లేకుండా ఒక మాదిరిగా నడిచే సత్తా ఉన్న సినిమా. 

ఒక పక్కా ప్లానో, మాస్ హిస్టీరియానో తెలీదు... రిలీజ్‌కు ముందునుంచే దాడిచేసిన వేలకొద్ది సోకాల్డ్ రివ్యూల పుణ్యమా అని, సినిమా నచ్చినవాళ్ళు కూడా నోరెత్తలేకపోయారు. 

చూడాలనుకున్నవాళ్ళు కూడా నాన్ స్టాప్‌గా వస్తున్న ఈ ఫ్లాప్ రివ్యూల మాస్ హిస్టీరియా ప్రభావంతో అసలా వైపే వెళ్లలేకపోయారు. 

ప్రేక్షకులకు, రివ్యూయర్స్‌కు చాన్స్ ఉంది, ఆప్షన్ ఉంది. చూడొద్దు అనుకుంటే ఆ సినిమా చూడకుండా ఉండొచ్చు. 

నా సినిమా చూడు అని ఎవ్వడూ పీక పట్టుకొని పిసికి చంపడు.  

ఆఫ్టర్ ఆల్... సినిమా అంటే జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సాధనం మాత్రమే. 

అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే మరోటి. ఎన్నెన్నో ఆప్షన్స్ ఉన్నాయి.           

అంతే తప్ప - సినిమా చూసి, సినిమా ఎలా తీయాలో పూరికి పాఠాలు చెప్తూ, సినిమా ఫలితాల మీద దారుణమైన ప్రభావం పడేలా వేల కొద్ది రివ్యూలు రాయాల్సిన పనిలేదు. 

ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్ళపాటు ఎంతో శ్రమించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న విజయ్ దేవరకొండను ఎగతాళి చేయనవసరం లేదు.    

ఒక భారీ బడ్జెట్ సినిమా ఫ్లాపైతే, సినిమా పరిశ్రమ మీదే ఆధారపడిన కనీసం ఒక రెండువేల కుటుంబాలు రోడ్డునపడతాయి. 

లైగర్ మీద పనికట్టుకొని రాసిన ఈ మూడువేల రివ్యూల పుణ్యమా అని ఇప్పుడదే జరిగింది.   

అంత శాడిజం అవసరమా? 

రివ్యూకో వంద రూపాయాలు జీయస్టీ కట్టాలి అని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెడితే వీరిలో ఎంతమంది రివ్యూలు రాసేవాళ్ళు? 

This is it.

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు.
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే!
- శ్రీశ్రీ 

My Love and Hugs to Puri Jagannadh, Charmme, Vijay Devarakonda, Ananya Panday and the entire Team!

6 comments:

 1. ఏమోనండీ. నా అనుమానం ఆరివ్యూలవరదలో సింహభాగం ఏవోశక్తులు డబ్ఫిచ్చి వ్రాయించినవే అని. ఆశక్తులు కొన్ని సినీపవర్ హౌసులు కావచ్చు - తమ కుటుంబ హీరోలు తప్ప వేరే హీరోల సినీమాలను విషప్రచారంతో దెబ్బతీయటం వారి ప్లాన్ కావచ్చును.

  ReplyDelete
  Replies
  1. 3000+ రివ్యూలంటేనే అర్థమవుతోంది. ఏదైనా సాధ్యమే సర్.

   Thank you for your comments.

   Delete
  2. తెలుగు సినిమా కుటుంబ హీరోలకి డబ్బులిచ్చి పక్కవాళ్ళ సినిమాల్ని ఫ్లాప్ చేయించే అంత గొప్ప సీన్ లేదు.లాల్ సింగ్ ఛద్దా,లైగర్ వెనక ఉన్నది హిందూ మతం మీద విషం కక్కుతున్న వాళ్ళు ఉన్నారని గమనించిన వాళ్ళు హిందూమతద్వేషుల ఆర్ధిక మూలాల్ని దెబ్బకొట్టే లక్ష్యంతో బాయ్కాట్ రెక్వెస్ట్ చేస్తే హిందువులు ఇస్తున్న రెస్పాన్స్ అది.ఆ రిక్వెస్ట్ చేస్తున్నవాళ్ళు రహస్యంగా ఏమీ చెయ్యడం లేదు.ఎందుకు ఆ సినిమాల్ని బాయ్కాట్ చెయ్యమంటున్నారో పబ్లిక్ డయాస్ మీదనే చెప్తున్నారు.బాయ్కాట్ చేస్తున్నవాళ్ళు కూడా నిజానిజాలు తెలుసుకుని స్వచ్చందంగానే ఆ సినిమాల్ని ఫ్లాప్ చేస్తున్నారు.అదీ గాక ఆ సినిమాల్లో హిట్ సినిమాలకి ఉండాల్సిన క్వాలిటీ ఎంటర్టెయిన్మెంట్ కూడా లేదు.బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా బాయ్కాట్ రిక్వెస్ట్ పడింది.

   లైగర్ విషయనికి వస్తే హీరోయే నా సినిమాని బాయ్కాట్ చెయ్యందని అడిగాడు.వాళ్ళు అడిగిందే చేశారు కదా!

   Delete
 2. రివ్యూల మీద కూడా నమ్మకం పోయిందండి.
  పబ్లిక్ టాక్ కొంత ప్రభావం చూపుతోంది.

  ReplyDelete
 3. నిజంగా ఒక మంచి హిట్ మూవీ ని , రివ్యూ లు ప్లాప్ చేసేస్తాయా ? కార్తికేయ 2 హిందీ లో ఎలా పిక్ అప్ అయింది , 50 థియేటర్స్ , ఒక్కడు కూడా నార్త్ ఇండియన్స్ కి తెలియదు , ఇప్పుడు 500 థియేటర్స్ పైనే ఉంది . లైగర్ కి బీబత్సమైన ప్రమోషన్స్ చేశారు . ప్రొడ్యూసర్స్ కి ఆల్రెడీ తెలుసు , ఇది ఆటో ఇటో అవుతుంది అని . అందుకే దేవరకొండ తో ఇంకో మూవీ సెట్స్ మీద ఉంది ఫీలర్లు వదిలారు , ఇవన్నీ ఓల్డ్ టేక్నిక్ లు . దేవరకొండ ఇచ్చిన బిల్డ్ అప్ కి జనం చాలా ఎక్కువ expect చేశారు , చుస్తే ఒక సాదా సీదా సినిమా లా ఉండేసరికి చిరాకు వేసింది .
  తెలుగు లోనే కాదు, హిట్ మూవీ అయితే ఎదో ఒక ఇండస్ట్రీ లో ఆడాలి కదా ? ఇంత సోషల్ మీడియా ఉంది , ఒక సినిమా ని ప్లాప్ చేసేస్తారా ? అంటే జనం అంత ఎర్రి పుష్పాల్లా కనిపిస్తున్నారా ? మేము తీసిందే చూడాలి అని చెప్పడానికి . ఇండస్ట్రీ లో బిజినెస్ తప్ప, ఇంకొకటి ఉండదు . గత 3/4 సంవత్సరాలలో పూరి ఏ సినిమా హిట్ ఉంది , ఇస్మార్ట్ శంకర్ కాకుండా . ఆచార్య ఎందుకు రెండో రోజే ఎత్తిపోయింది . అది కూడా కుట్రేనా ? యూట్యూబ్ లో భీభత్సమైన ట్రోల్ల్స్ .
  దేవరకొండ ఇచ్చిన స్టేట్మెంట్స్ కొందమందికి నచ్చలేదు . 200 కోట్లు నుండి కౌంట్ స్టార్ట్ అవుతుంది , ఎప్పుడు end అవుతుందో తెలియదు , ఎవడు ఆపుతాడో చూస్తాను , ఎకానమీ పాడైపోతుంది సినిమా ప్లాప్ అయితే , etc . పూరి ఏకంగా 1000 కోట్లు expect చేస్తున్నాను అని చెప్పడం , ఇలాంటి స్టేట్మెంట్స్ హిట్ అయితే ఓకే . ప్లాప్ అయితే , జనాలు ట్రోల్ చేయడానికి రెడీ గా ఉంటారు .

  ఒక సింపుల్ రూల్ , సినిమా హిట్ అయితే ఎవ్వడు ఆపలేదు . ఆనంద్ సినిమా , శంకర్దాదా MBBS తో వచ్చింది ఏమైంది , హిట్ అవ్వలేదా ? కార్తికేయ 2 , etc

  ReplyDelete
 4. Vastavam cheppinaa a.geekarimcharu ...Vaalla karma amte

  ReplyDelete