Tuesday 7 April 2020

17 March 2020, at 3:42 PM | Facebook

"నలభైయేళ్లు దాటిన దర్శకుడి తో పని చేయనండి... కాబట్టి మీ కథ కూడా వినను... సారీ..."
- ఒక  హీరో

"కథ బావుంది, కానీ డైలాగ్ వెర్షన్ వినకుండా డెసిషన్ చెప్పను. ఇంకో మూడు నెలలాగి స్క్రిప్ట్ పూర్తిగా అయ్యాక చూద్దాం..."
-ఇంకో  హీరో

"హీరోయిన్ నచ్చలేదు, ఆమెని చూస్తే ప్రేమించాలనిపించట్లేదు. సో, సినిమా వదిలేసుకుంటాను..."
-మరో  హీరో

"రెమ్యునరేషన్ ముప్ఫై ఐదు లక్షలు ఇస్తే గానీ చేయను..."
-వేరే హీరో

"రెమ్యునరేషన్ పదిహేను లక్షలు, కారవాన్ కంపల్సరీ, మేనేజర్ కి కమీషన్, హీరోయిన్ గా పెద్ద పేరున్న హిందీ అమ్మాయి ఉంటే , కథ కూడా వినను..."
- ఓ హీరో

"ఫలానా హీరో అయితే నేను చేయను..."
- ఓ హీరోయిన్

"స్టార్ హీరో కాకపోతే నేను చేయను..."
- ఇంకో  హీరోయిన్

"ఇంత యంగ్ స్టోరీని ఇంత సీనియర్ డైరెక్టర్ హ్యాండిల్ చేయలేరు.సో,నేను చేయను..."
- వేరే  హీరోయిన్

"మనసంతా నువ్వే రోజులు కావండి... ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో సినిమా ఎందుకు..."
- నిర్మాత కి  ఒక  సినీ  ప్రముఖుడి సలహా

"అసలు  మీతో  సినిమా తీయడానికి ఇప్పుడు నిర్మాతలు, ఆర్టిస్టులు ఎందుకొస్తారు. హ్యాపీగా కథలు వింటూ శాలరీ తీస్కోండి... డైరెక్షన్ గురించి ఆలోచించకండి..."
- నాకింకో  సినీ ప్రముఖుడి క్లాసు.

అన్నీ అయ్యాయి...

" సమాధానం " కూడా ఇప్పుడు రెడీ అయ్యింది...
--------
" వాళ్ళిద్దరి మధ్య..."
#LOMA

ధైర్యంగా నిలబడిన కొత్త నిర్మాత అర్జున్ దాస్యన్ గారికి, నమ్మి చేసిన హీరో విరాజ్ అశ్విన్ కి,
కొత్త హీరోయిన్ నేహా కృష్ణ కి,
వెన్నుదన్నుగా నిలచిన ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ గారికి, రాజ్ మాదిరాజు గారికి,
స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారికి, మాటల రచయిత వెంకట్.డి.పతికి, సంగీత దర్శకురాలు మధుస్రవంతి గారికి, మొదట మొహమాటపడినా, రాను రాను అద్భుతంగా పాత్ర పోషించిన వెంకట్ సిద్ధారెడ్డి గారికి, అగ్రజులు సాయి శ్రీనివాస్ వడ్లమాని గారికి, మిత్రులు శ్రీకాంత్ అయ్యంగార్ కి, పనిచేసిన అందరు నటీనటులకి, సాంకేతిక నిపుణులకి... అందరికీ పేరుపేరునా శత సహస్ర వందనాలు... 🙏❤🙏

కట్ చేస్తే - 

పైన మీరు చదివిందంతా మొన్న మార్చి 17 నాడు, వి.ఎన్. ఆదిత్య తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద పెట్టిన పోస్టు.

ఎలాంటి ఎడిట్స్ లేకుండా, జస్ట్ కాపీ పేస్ట్ చేశానిక్కడ.

వి.ఎన్. ఆదిత్య మంచి సత్తా ఉన్న దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా.

సౌమ్యుడు, స్నేహశీలి. ఎప్పుడు కలిసినా ఎలాంటి 'ఈగో'లేని చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆయన ట్రేడ్‌మార్కు.

దర్శకుడిగా తన మొదటి సినిమా "మనసంతా నువ్వే" ఒక సూపర్ హిట్. స్టార్ హీరో నాగార్జునతో కూడా "నేనున్నాను", "బాస్" వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు.

ఇప్పటివరకు సుమారు ఓ పది సినిమాలు తీశారు.

ఈమధ్యే అమెరికా వెళ్లి, అక్కడ "Forced Orphans" అనే ఇంగ్లిష్ సినిమా కూడా ఒకటి తీశారు. ఆ సినిమాకు అంతర్జాతీయ పురస్కారాలు కూడా వచ్చాయి.

ఈమధ్య హిట్స్ లేవు. కొంత గ్యాప్ వచ్చింది.

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ దర్శకునికయినా ఇది మామూలు విషయమే.

కట్ చేస్తే -

ఇండస్ట్రీలో వి.ఎన్. ఆదిత్య ఎదుర్కొన్న అనుభవాలు ఎలా ఉన్నాయో పైన తన పోస్టులో చదివారుగా...

అలాగని డిజప్పాయింటయ్యారా?

నో...

రెట్టించిన ఉత్సాహంతో తాజాగా ఈతరం లవ్‌స్టోరీ "వాళ్ళిద్దరి మధ్య" ఈమధ్యే పూర్తిచేశారు.

ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం వారికుంది. అవ్వాలని నేను మన్స్పూర్తిగా కోరుకొంటున్నాను. అయితే, జయాపజయాలతో సంబంధంలేకుండా... దర్శకునిగా వి.ఎన్. ఆదిత్య ఇంకెన్నో సినిమాలు చేస్తారు. చేస్తూనే ఉంటారు...
^^^^^

(Written and posted on 31 March 2020, on my new blog. Re-posted here.)