Thursday 3 March 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 4

ఈ పోస్టు రాస్తున్న సమయానికి రెండు గంటల ముందు... రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పోక్స్ పర్సన్ ఐగర్ కొనషెంకోవ్ చెప్పినదాని  ప్రకారం...  ఇప్పటివరకు 17,000 మంది భారతీయ విద్యార్థులను ఖార్కీవ్ నుంచి సురక్షితంగా బయటికి పంపించారు.

వారిలో ముందుగా అమ్మాయిలను ఇండియాకు పంపించే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. దాదాపు అమ్మాయిలందరూ భారత్ చేరినట్టే. అబ్బాయిల రవాణా ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

ఇదంతా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సుమారు 46 యుధ్ధవిమానాల ట్రిప్స్ ద్వారా నిజంగా వార్‌ఫుట్‌లో జరుగుతోంది. 

ఆపరేషన్ గంగ! 

థాంక్స్ టు పుతిన్ అండ్ జెలెన్‌స్కీ. ఇద్దరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ విషయం ఇంత సులభంగా పరిష్కారం వైపు కదిలింది. లేదంటే - యుధ్ధవాతావరణంలో ఏదీ ఎవరూ పట్టించుకోరు. అసలు ఇలాంటి అభ్యర్థనలను వినే అవకాశం ఇవ్వరు. అలాంటి అవకాశం ఉండదు. 

మన ప్రధానమంత్రి మోదీ ఈ విషయంలో తీసుకున్న చొరవ, చేసిన కాల్స్, ఇరువైపులా చేయించిన కమ్యూనికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. మన విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, రెండు దేశాల్లో ఉన్న మన అంబాసిడర్లు, ఢిల్లీలో ఉన్న ఆ రెండు దేశాల రాయబారులూ... నిజంగా 24/7 ఎంతో కృషి చేస్తే గాని ఇదంతా సాధ్యం కాదు. 

అయితే... ఇదంతా వార్ స్టార్ట్ అవకముందే చెయ్యాలి అనేది ఒక వాదన.

చాలావరకు అది నిజం కూడా. 

పుతిన్ యూక్రేన్ మీద చేసింది మెరుపుదాడి ఏం కాదు... 

24 గంటల ముందే రష్యన్ పౌరులనుద్దేశించి ఒక భారీ స్పీచ్ ఇచ్చాడు పుతిన్. అదంతా రష్యన్ వార్తా సంస్థ 'టాస్' నుంచి, యూక్రేన్ వార్తా సంస్థ 'యూక్రిన్‌ఫామ్' మీదుగా, అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్‌టైమ్స్ మొదలైనవాటిల్లోనే కాదు, బి బి సి నుంచి... అసలేమాత్రం స్టాండర్డ్స్ తెలియని కొన్ని లోకల్ తెలుగు చానెల్స్ దాకా... అన్నిట్లో కవర్ చేశారు.

ప్రపంచవ్యప్తంగా దాదాపు అన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది.  సోషల్ మీడియాలో కూడా ప్రపంచమంతా షేర్ చేసుకుంది. 

రష్యా నుంచి నా ఫ్రెండ్ పంపిన లింక్ ద్వారా నేను కూడా ఒరిజినల్ స్టోరీ చదివాను. 

ఇలాంటి సందర్భాల్లో ఎన్నెన్నో జాగ్రత్తలు ముందుగా తీసుకోవాల్సినంత అధ్యయనం నిరంతరం జరపడానికే ఆయా మంత్రిత్వ శాఖలు, వాటిల్లో పనిచేసే వందలాది స్పెషలైజ్డ్ సిబ్బంది ఉన్నారు. 

మన ఐ ఎఫ్ ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్విస్) సిబ్బంది కూడా ఏ విషయంలో తక్కువ కాదు.    

మరి లోపం ఎక్కడ జరిగిందో అర్థం కాదు.  

లేదంటే - ఎప్పటికప్పుడు నివేదికలు అందినా, దీన్ని మించిన ఇంకేవైనా ముఖ్యమైన విషయాల వల్ల దీని మీద నిర్ణయాలు-చర్యలు వెంటనే తీసుకోలేకపోయారేమో తెలియదు.   

కొంతవరకైనా మన కంట్రోల్‌లో ఉండే కోవిడ్ విషయంలోనే, ప్రారంభంలో మనం తప్పటడుగులు వేశాం. అలాంటిది, ఇది యుధ్ధం... ఒకసారి ప్రారంభమైందంటే ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు, మనిషి కంట్రోల్‌లో ఉండదు. అది కూడా బయటెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుధ్ధం. మన పిల్లలు వేలల్లో ఉన్నారక్కడ.

ఎంత దూరం ఆలోచించాలి? ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?  ఎంత వేగంగా చర్యలు చేపట్టాలి? 

అందులోనూ... గల్ఫ్ వార్ జరిగినప్పుడు సుమారు లక్షన్నర మందిని అత్యంత సమర్థవంతంగా ఎయిర్‌లిఫ్ట్ చేసిన రికార్డ్ మనకుంది! 

కనీసం వార్ స్టార్ట్ అయిన మొదటి రెండు రోజుల్లోనే ఇదంతా జరిగిపోవాలి. యుధ్ధ సమయంలో ఏ కాస్త అటూఇటూ అయినా, ఎంత దారుణమైన నష్టం జరిగుండేదో ఊహించడం కూడా కష్టం.  

డ్యూ రెస్పెక్ట్స్ టు మన ప్రధాన మంత్రి, ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులు, సిబ్బంది... మన విద్యార్థులు అక్కడ ఎదుర్కొన్న ఎన్నెన్నో కష్టాల్లో కేవలం ఒకే ఒక్క  దారుణమైన విషయం ఇక్కడ ఉదాహరిస్తున్నాను: 

యూక్రేన్‌లో సుమారు 20,000 మంది దాకా ఉన్న మన విద్యార్థుల్లో కొంతమంది అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్స్‌నే బంకర్స్‌గా తలదాచుకొన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఇండియా 'యు ఎన్' లో వోటెయ్యలేదన్న కోపంతో, సహజంగా ఎంతో మంచివారైన యూక్రేన్ స్త్రీలు మన ఆడపిల్లలను టాయ్‌లెట్స్ వాడుకోనివ్వలేదు. ఎన్ని గంటలు అలా మన పిల్లలు బాధపడ్డారో మనకు తెలియదు. ఆ సమయంలో పీరియడ్స్ వచ్చి ఉన్న అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుంది? 

అలా అత్యంత దారుణంగా బాధపడ్ద మన విద్యార్థినుల పరిస్థితి చూసి, మళ్లీ వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిందీ చేసిందీ కూడా యూక్రేన్ మహిళలే కావడం గొప్ప విషయం.  

ఈ యుధ్ధం విషయంలో ఇండియా న్యూట్రల్‌గా ఉన్నా, యూక్రేన్ దృష్టిలో మనం పుతిన్ వైపు ఉన్నట్టే లెక్క. 

ఇదే కోపంతో... కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్న మన విద్యార్థులను చాలా చోట్ల, చాలా బార్డర్స్ దగ్గర యూక్రేన్ పౌరులు, సైనికులు చాలా రకాలుగా అవమానించారు. కొన్ని చోట్ల కొంతమందిని ఆపి కొట్టారు కూడా. 

ఇలాంటి ఎన్నెన్నో విషయాల్ని ఇండియాటుడేకు చెందిన నబీల జమాల్ లాంటి జర్నలిస్టులకు... యూక్రేన్ నుంచి పూజ ప్రహరాజ్, శ్రీకాంత్ మొదలైన స్టుడెంట్-కోఆర్డినేటర్స్, స్వయంగా విద్యార్థులు కూడా రకరకాల చోట్ల ఉన్న బంకర్స్ నుంచి చెప్తున్నది వింటుంటే దుఖం ఆగదు.   

ఇలాంటి సున్నితమైన నేపథ్యంలో, అమ్మాయిల విషయంలో ఏదైనా జరగరానిది జరిగే అవకాశం వందకి వంద శాతం ఉంటుంది. కాని, అలా జరుగలేదు, జరగదు. కారణం... పూర్వపు సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత్ యూక్రేన్‌కు కూడా మిత్ర దేశం కాబట్టి. ఆ స్నేహ భావం యూక్రేన్‌ పౌరుల్లో ఇంకా పోలేదు కాబట్టి. 

కట్ చేస్తే - 

ఈ నేపథ్యంలో... అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో, బెంగుళూరుకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప ఖార్కీవ్‌లో జరిగిన బాంబింగ్‌లో మరణించడం చాలా బాధాకరం. ఈ సమయంలోనే, ఇంకో విద్యార్థి ఆరోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో మరణించడం కూడా మరింత బాధాకరం. వారి మృతదేహాలు ఇంకా భారత్ చేరాల్సి ఉంది. వారి తల్లిదండ్రుల దుఖాన్ని ఎవరాపగలరు?  

ఒక్క యూక్రేన్‌లోనే సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారంటే... ఇంక రష్యాలో, ఇతర తూర్పు యూరోప్ దేశాల్లో ఇంకెన్ని వేలమంది చదువుతున్నారో సులభంగా అంచనా వేయొచ్చు.

ఎందుకలా అన్నది పూర్తిగా మరొక అతి పెద్ద అంశం కాబట్టి దాని గురించి నేనిక్కడ చర్చించడం లేదు. 

మన విద్యార్థులు చెప్పిన మరొక విషయం నన్ను పూర్తిగా షాక్‌కు గురి చేసిన నిజం.

అది విని, వెంటనే ఒక్క నిమిషంలో మ్యాప్ ఓపెన్ చేసి చూశాను. 

ఏంటంటే - యూక్రేన్‌కు పశ్చిమాన ఉన్న పోలండ్, హంగరీ వంటి దేశాల నుంచి మాత్రమే ఇప్పుడు ఎవరైనా యుధ్ధవాతావరణం నుంచి బయటపడాల్సింది. కాలినడకన కొంత దూరం, ట్రెయిన్స్, బస్సుల్లో కొంత దూరం ప్రయాణించి ఎలాగో చేరుకోవల్సిన బార్డర్స్ ఇవే.  

మన విద్యార్థులు ఎక్కువగా ఉన్నఖార్కీవ్ నగరానికి ఈ దేశాల బార్డర్ సుమారు 2000 కిలోమీటర్లు. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయొచ్చు. 

కాగా, ఖార్కీవ్ నుంచి రష్యా బార్డర్ కేవలం 40 నుంచి 100 కిల్లోమీటర్లే!

జస్ట్... గంట, గంటన్నరలో యూక్రేన్ బార్డర్ దాటొచ్చు!!... 

కాని, ఎలా సాధ్యం?    

ఇప్పుడు మన యుధ్ధవిమానాలు వీరిని ఏవైపు నుంచి లిఫ్ట్ చేసి తీసుకొస్తున్నాయన్నది మనకు తెలియదు.        

యుధ్ధం ప్రారంభమైన 8వ రోజున, యూక్రేన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తిరిగి ఇంటికి చేర్చే ప్రక్రియ మన ఎయిర్‌ఫోర్స్ యుధ్ధ విమానాల ద్వారా ఇంకా కొనసాగుతోంది. విద్యార్థులందరూ క్షేమంగా చేరుకుంటారనే ఆశిద్దాం. 

భారతీయ విద్యార్థుల్లో కొంతమందిని తమ దగ్గరే ఉంచుకొని... రష్యన్  సైన్యం దాడుల నుంచి అతికీలకమైన నష్టం ఎదుర్కోబోయే సమయంలో... మన విద్యార్థులను షీల్డుగా అడ్దం పెట్టుకొనే వ్యూహంతో యూక్రేన్ సేనలు మనవాళ్ళను ఉపయోగించుకోబోతున్నారని ఒక వార్త వినిపిస్తోంది. 

కేవలం ఇది మన చానెల్స్ బ్రేకింగ్ న్యూస్‌ల్లోనే వస్తున్నట్టయితే నేనిది అసలు నమ్మను. కాని కొన్ని విదేశీ చానెల్స్ న్యూస్‌లోను, స్వయంగా రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్‌పర్సన్ ద్వారా కూడా ఈ అనుమానం వ్యక్తమయింది.

అయినా సరే, ఇది కేవలం అనుమానమే అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. అలాంటి దారుణమైన ప్రమాదం జరగకూడదని ఆశిస్తున్నాను.

ఇక, చూస్తుంటే ఈ యుధ్ధం అంత త్వరగా ఆగిపోకపోవచ్చని అనిపిస్తోంది. 

ఎందుకంటే...  యుధ్ధం కొందరికి ఒక మంచి వ్యాపారం! 

దాని గురించి మరొక బ్లాగ్ పోస్టులో...  

2 comments:

 1. In war the first victim is TRUTH
  1.Western propaganada machinery and press,TV etc are woriking over time,spreading false news, more than Gobbels.
  2.No doubt Indian students are taken hostage mby refusing public transports like Railways and buses etc. Every where bribe is demanded, that is also in US dollars.
  3.Indian student was shot by Ukraine while in queue, he is only the person died in the queue, if it is a shelling other people also should die or get wounded and nothing like that happened.
  4.Ukraine is the criminal.
  5.Latest, Ukraine burnt and set fire to a biggest nukepower plant and propagating that is due to the shelling by Russians.

  ReplyDelete
  Replies
  1. Truth must be agreed.

   Thanks for the comments.

   Delete