Thursday 10 March 2022

ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాల్లో పనిచేయొచ్చు!


"ఊరంతా ఓ దిక్కు అయితే, ఉలిపిరికట్టెది ఓ దిక్కు అన్నట్టు... మనమందరం ఇటు సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సైడుంటే, వీడొక్కడు మాత్రం అటెటో ఆ మూలకు పోయిండు!" 

ఓ పదేళ్ళ క్రితం అనుకుంటాను... మా "బిగ్ ఫైవ్" మిత్రుల సిట్టింగ్‌లో ఒక మిత్రుడు నన్ను ఉద్దేశించి ఈ మాటన్నాడు. 

అప్పటి అవసరం, సౌకర్యం ఆ సమయంలో నన్నక్కడ దిగిపోయేట్టు చేసింది. ఒకసారి ఒక చోటు అలవాటైపోయాక, సౌకర్యంగా ఉన్నాక, ఇంక అక్కడ్నుంచి కదలాలనిపించదు. 

ఎక్కడెక్కడినుంచో హైద్రాబాద్ వచ్చి స్థిరపడే వాళ్లందరి విషయంలో జరిగేది ఇదే. 

కట్ చేస్తే -   

సినిమా టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్ అని చెప్తూ ఆ మధ్య నేనొక బ్లాగ్ పోస్టు రాశాను. 

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... ఇండిపెండెంట్ సినిమాలకు, మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు అంటే అతిశయోక్తి కాదు. 

ఒకప్పట్లా నాలుగ్గోడల మధ్యనే కూర్చొని పనిచేసే రోజులు పోయాయి. క్రియేటివిటీకి రొటీన్ అంటే అస్సలు నచ్చదు. 

అదలా పక్కనపెడితే - సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనంతా ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనే జరగాలన్న రూల్ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. అలాగే, సినిమావాళ్లంతా కూడా జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరం కూడా నిజానికి లేదు. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌లో ఎక్కువభాగం మంది ఇప్పుడు మణికొండ వైపు ఉండటానికి ప్రిఫర్ చేస్తున్నట్టు నా మిత్రుడు, డైరెక్టర్ బాబ్జీ ఒకసారి నాతో చెప్పారు. 

ఎవరు ఎటువెళ్ళినా, ఎక్కడ ఉంటున్నా... ముందు అవసరం, తర్వాత సౌకర్యం అనే ఈ రెండు అంశాలు మాత్రమే ఈ విషయంలో ఎవరి నిర్ణయానికైనా కారణమవుతాయి. 

హాలీవుడ్ సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా హాలీవుడ్‌లోనే ఉండరు. బాలీవుడ్‌లో పనిచేసేవారంతా ఒక్క ముంబైలోనే ఉండరు. అలాగే, మన తెలుగు సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా కూడా ఒక్క హైద్రాబాద్‌లోనే ఉండరు. ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనో, మణికొండలోనో ఉండరు.   

ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేసుకోగలిగితే చాలు, ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాలు తీయొచ్చు. సినిమాల్లో పనిచేయొచ్చు. 

ఈ విషయంలో... తన తొలి సినిమానుంచి మొన్నటి లవ్‌స్టోరీ వరకు, తాను మొదటినుంచీ నివాసముంటున్న సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌నే అడ్డాగా చేసుకొని విజయవంతంగా సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ములను మించిన ఉదాహరణ అవసరమని నేననుకోను. 

ఫిలిం నెగెటివ్ నుంచి డిజిటల్‌కు మారిపోయాక, ఫిలిమేకింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇప్పుడు ల్యాబ్స్ కూడా అవసరం లేదు. మంచి ల్యాప్‌టాప్స్ రెండు చాలు. 

ఇక... ఫిలిం చాంబర్లో, ఎఫ్‌డిసిలో, యూనియన్ ఆఫీసుల్లో ఉండే కొద్దిపాటి పేపర్ వర్క్ కోసం - ఒక సినిమా మొత్తానికి పట్టే సమయం కేవలం కొన్ని నిమిషాలే! ఆ కొన్ని నిమిషాల కోసం, ఆ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరమైతే అస్సలు లేదు. 

ఆ మధ్య నేను కూడా శ్రీనగర్ కాలనీకి మారిపోవాలనుకున్నాను. కాని, ఇప్పుడా ఆలోచన పూర్తిగా మానుకున్నాను. 

జూబ్లీ హిల్స్‌కి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో నేనెక్కడైతే ఉన్నానో, నాకిక్కడ చాలా సౌకర్యంగానే ఉంది. నా ఇతర క్రియేటివ్ యాక్టివిటీస్‌కి కూడా ఇదే నాకు బెస్ట్ ప్లేస్. 

కలవాలనుకున్నప్పుడు - ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరినైనా, ఎలాగైనా కలుసుకోవచ్చు. వాస్తవానికి అదసలు సమస్యే కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అనుభవం కూడా. 

కట్ చేస్తే - 

మొన్నొక రోజు నా ఆత్మీయ మిత్రుడు పరమేశ్వర్‌రెడ్డి గారి ఆహ్వానం మీద వారి రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వెళ్ళాను. 

Green Leaves Infratech Limited.   

అద్భుతం!

అదొక గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్‌లాండ్ వెంచర్. 

చిన్న ఫార్మ్ హౌజ్ వేసుకొని, మనకిష్టమైన గ్రీనరీ పెంచుకొంటూ వీకెండ్స్ అక్కడ గడపగలిగితే చాలు. లైఫ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. 

ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ అయితే దీన్నొక వీకెండ్ డెస్టినేషన్ చేసుకోవచ్చు. 

ఎన్నారైలకు, బిజినెస్ పీపుల్‌కు; డాక్టర్స్, లాయర్స్ వంటి ప్రొఫెషనల్స్‌కు కూడా వారాంతంలో స్ట్రెస-ఫ్రీగా హాయిగా గడపడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ హౌజెస్ ఒక మంచి పర్సనల్ హాలిడే స్పాట్ అవుతుంది. 

ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ది బెస్ట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. Connect me on 9989578125 and make the best decision of 2022. 

ఈ ఫార్మ్‌లాండ్ వెంచర్‌కు ఉన్న మరొక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే - రివర్ వ్యూ! మంజీరా నది ఈ వెంచరా్‌ను ఆనుకునే ప్రవహిస్తోంది!! 

ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి...  

సిటీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో, ముంబై హైవేకు దగ్గరలో ఉన్న ఈ ఫార్మ్‌లాండ్ వెంచర్ గురించి రేపు ప్రత్యేకంగా ఒక పోస్ట్ రాస్తున్నాను. 

A deep look into nature
unlocks imagination and
inspires creativity!         
   

2 comments:

  1. Excellent sir.waiting for your further post ✨

    ReplyDelete
    Replies
    1. Thank you!

      Just posted the next one. Please check, Sir.

      Delete