Saturday 5 March 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 5

రష్యన్ వార్తా సంస్థ 'స్పుత్నిక్' నుంచి ఈ ఉదయం బ్రేకింగ్ న్యూస్ ప్రకారం:

"రష్యా-యూక్రేన్ డెలిగేట్స్ మధ్య బెలరూస్‌లో జరుగుతున్న రెండవ రౌండ్ చర్చల తర్వాత రష్యా ఒక నిర్ణయం తీసుకొంది. యూక్రేన్ లోకల్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, యూక్రేన్‌లోని 2 ప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది." 

యూక్రేన్‌లోని మర్యుపోల్, వోల్నవాఖా ప్రాంతాల్లోని సుమారు 4,40,00 మందిని ఖాలీ చేయించడం కోసం మాత్రమే ఈ కాల్పుల విరమణ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

ఇప్పుడీ పోస్టు రాస్తున్న సమయానికి ఈ రెండు ప్రాంతాల్లో పౌరుల తరలింపు యుధ్ధప్రాతిపదికన జరుగుతోంది. 

యూక్రేన్ పైన రష్యా దాడి ప్రారంభమైన 9 రోజుల తర్వాత, కొంతవరకు, ఇదొక శుభవార్త అనుకోవచ్చు. 

కాని, పౌరులు ఖాళీ చేసిన తర్వాత, ఈ రెండు ప్రాంతాలు కూడా ధ్వంసమవుతాయి. యూక్రేన్ సైన్యం ఈ రెండు ప్రాంతాల్ని కూడా కోల్పోవచ్చు. 

దీంతో, యూక్రేన్‌లోని సగానికి పైగా భూభాగాన్ని రష్యా ఆక్రమించుకొన్నట్టవుతుంది.  

కట్ చేస్తే -

రష్యా చెప్తున్నదాని ప్రకారం యూక్రేన్ ప్రెసిడెంట్ వొలదొమిర్ జెలెన్స్‌స్కీ ప్రస్తుతం యూక్రేన్‌లో లేడు. పొరుగున ఉన్న పోలండ్‌లో తలదాచుకొని, అక్కడినుంచే అన్నీ చూసుకొంటూ, యూక్రేన్ యుధ్ధశ్రేణులకు ఆదేశాలిస్తున్నాడు. 

అయితే దీన్ని అబధ్ధం అని ఖండిస్తూ, తాను ఇంకా యూక్రేన్‌లోనే ఉన్నట్టు జెలెన్‌స్కీ ఇంకో సెల్ఫీ వీడియో పెట్టాడు. 

కాని, ఇప్పుడున్న అత్యంతాధునిక టెక్నాలజీతో ఈమాత్రం బ్యాక్‌గ్రౌండ్ మార్చటం అనేది చాలా చిన్న పని. అది ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుస్తోంది.     

4 comments:

 1. Russain news is banned by west and US.
  Two port cities seized another being attacked thus cutting of supplies to ukraine through sea.
  out of five nuke power plants including chernobil, three are seized and the first to be chernobil.
  Seems invitable, history repeats and final out come may be, to split the country as east and west ukraine.

  ReplyDelete
  Replies
  1. 👍 I do feel the same.

   Split almost done and Putin will go further with his ultimate goal, ie, to capture Kiev and change the the head of the Govt.

   Delete
  2. మహాత్ముడు పుతిన్ మహాశయుడు కేవలం‌ ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించి బుధ్ధి చెప్పటంతో ఆగుతాడని అనుకోలేమండీ. ఉక్రెయిన్ లాగే ఇంకా కొన్ని బుధ్ధితక్కువ దేశాలున్నాయి, వైభవోపేతమైన సోవియట్ యూనియన్ నుండి విడిపోయి తప్పుచేసినవి. వాటి నన్నింటినీ వరుసగా దారిలోనికి తెచ్చి మహాసామ్రాజ్యపునఃప్రతిష్టాపనాచార్య బిరుదం వహించేదాకా విశ్రమించడు. ఊరికే రంకెలు వేయటమూ, కొన్ని చిల్లర ఆంక్షలను (తాత్కాలికంగా?) విధించి భంగపడటమూ మినహాయించి నాటోవారూ వారి తందానా గణమూ‌ పెద్దగా చేయగలిగింది యేమీ‌లేదని పుతిన్ మహాశయులకు బాగా తెలుసు. (ఎలాగూ విశ్వవిజేత కాబోయే రష్యాతో తగువులెందుకని కాబోలు భారతదేశం తటస్థంగా ఉండిపోతోంది!)

   Delete
  3. భారతదేశం తటస్థంగానే ఉంటుంది. ఉండాలి. రష్యాతో మన దేశం స్నేహం ఇప్పటిది కాదు. నమ్మదగిన స్నేహ హస్తం మనకు అదొక్కటే.

   ఇక పుతిన్ విషయానికొస్తే - నా ఉద్దేశ్యంలో యూక్రేన్‌ను స్వాధీనంలోకి తప్పక తెచ్చుకుంటాడు. అక్కడ రష్యాకు అనుకూలంగా ఉండే నాయకున్ని నియమిస్తాడు. అది రష్యా భద్రతకు చాలా అవసరం. వ్యాపార, ఆర్థికపరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయనుకోండి... అది వేరే విషయం.

   Thanks for your comment.

   Delete