Tuesday 27 December 2022

బుక్ ఫెయిర్... పుస్తకాలు, మిత్రులు, కవి మిత్రులు, సినీ మిత్రులు!


నిన్న సాయంత్రం 5.30 నుంచి బుక్ ఫెయిర్లో గడిపాను. ఇవ్వాళ, మిగిలిన 5 రోజులూ సాయంత్రాలు ఇక అక్కడే. 

నిత్యజీవితంలోని నానా టెన్షన్లు, వత్తిళ్ళ మధ్య మంచి రిలీఫ్. పాత మిత్రుల కలయిక, కొత్త మిత్రుల పరిచయాలు... అదొక లోకం. 

చెప్పాలంటే అదే అసలైన లోకం. 

చాలా మిస్ అవుతున్నాం అనిపించింది. 

వీలైతే - మా ఓయూ ఎమ్మే మిత్రబృందంతో కూడా ఇక్కడే ఒక చిన్న గెట్-టుగెదర్ లాంటిది ప్లాన్ చేసుకుంటే బాగుండుననిపించింది. 

నా ఓయూ బ్యాచ్‌మేట్, మిత్రుడు, పాలపిట్ట ఎడిటర్ గుడిపాటిని "పాలపిట్ట స్టాల్" (270) దగ్గర కలిశాను. నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఈ స్టాల్లో వుంది. కాపీలు అయిపోవచ్చాయి, రేపు మరిన్ని కాపీలు పంపించమని చెప్పాడు. 

"మన ముఖ్యమంత్రి స్టాల్" (339, 340) లో అన్ని కాపీలు సోల్డ్ అవుట్! వాళ్ళూ కాపీలు అడిగారు. స్వర్ణసుధ పబ్లికేషన్స్ నుంచి మరిన్ని కాపీలు ఈరోజు వెళ్తున్నాయి. 

ఎమ్మేలో నా క్లాస్‌మేట్, మిత్రుడు, "కవి సంగమం" కవి యాకూబ్‌ను, కవయిత్రి శిలాలోలిత గారిని వారి స్టాల్ దగ్గర కలిశాను.  


ఓయూలో మా సీనియర్, మిత్రుడు, "తోపుడుబండి" సాదిక్ నాతో ఫోన్లో రెండు మాటలు చెప్పకపోతే నేనీ బుక్ ఫెయిర్ సంతోషాన్ని, సందడినంతా నిజంగా మిస్ అయ్యేవాణ్ణి. సాదిక్‌తో వచ్చిన పిల్లలు హిమాన్శి, రాజవంశీలతో ఇంకో లెవల్‌లో అసలు తెలియకుండానే టైమ్ అలా గడిచిపోయింది.   

థాంక్స్ టు సాదిక్ భాయ్. 

బుక్ ఫెయిర్‌లో ఫోటోలు, సెల్ఫీల కల్చర్‌ను పరిచయం చేసిన పయొనీర్ సాదిక్ భాయ్ "తోపుడుబండి" స్టాల్ ఇప్పుడు లేకపోయినా - అక్కడున్నంతసేపూ రెండు మూడు స్టాల్స్ పెట్టినంత సందడి చేశాడు. 

కట్ చేస్తే - 

ఇవాళ, మిగిలిన 5 రోజులూ సాయంత్రాలు బుక్ ఫెయిర్‌లో ఉంటాను. 

మిత్రులు, రైటర్-కవి మిత్రులు, సినీ మిత్రులు, నా కొత్త ప్రాజెక్టులో నాతో టీమప్ అవ్వాలనుకొనే యాస్పయిరింగ్ సినీ మిత్రులు... అందరం అక్కడే కలిసి ఒకసారి "హాయ్" చెప్పుకుందాం.  

No comments:

Post a Comment