Saturday 4 January 2020

క్రౌడ్ ఫండింగ్ - CF2

సినిమాలమీద, సినిమా బిజినెస్ మీద, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం మీద ఆసక్తి ఉన్నవారికి ఒక మంచి మార్గం, ఒక మంచి అవకాశం "క్రౌడ్ ఫండింగ్" సిస్టమ్.

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి భారీ సైట్స్‌తో అంతర్జాతీయంగా ఈమధ్యే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సిస్టమ్ ఇంకా మన దగ్గర చాలా మందికి తెలియదు.

ఇండియాలో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ సైట్స్ కొన్ని వచ్చినా, వాటిలో ఒకటి రెండు మాత్రమే కొంతవరకు ప్రాచుర్యం పొందాయి. ఇంకా అవి పాపులర్ కావల్సివుంది.

నాకు తెలిసినంతవరకు, మన దేశంలో ఈ పధ్ధతిని అనుసరించి ఇప్పటికి మొత్తం కలిపి ఒక పది సినిమాలు తయారై వుంటే గొప్పే.

లూసియా, తిథి, రామ రామ రే, ఆపరేషన్ అలమేలమ్మ, స్టూడెంట్స్... నాకు తెలిసి కన్నడలో వచ్చిన క్రౌడ్ ఫండెడ్ సినిమాలు.

హిందీలో కూడా కొన్ని వచ్చాయి. కానీ, కన్నడలో ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నంతగా మరే ఇతర భారతీయ భాషల ఇండస్ట్రీల్లో వినియోగించుకోలేకపోయారు.

తెలుగులో చాలా ప్రయత్నాలు జరిగాయి కాని, అవేవీ ముగింపుదాకా వెళ్లలేకపోయాయి. ఇదే పధ్ధతిలో తీసామని కొందరు చెప్పే కొన్ని తెలుగు సినిమాలను వివిధ కారణాలవల్ల పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ సినిమాలు అనలేం.

2020లో, తెలుగులో, నేను మాత్రం కనీసం ఒక్కటైనా క్రౌడ్ ఫండెడ్ సినిమా తప్పక తీస్తాను. ఇప్పుడు పూర్తిగా నా ప్రధాన వ్యాపకంగా సినిమాలనే పెట్టుకొన్నాను కాబట్టి, దీని మీద చాలా అధ్యయనం కూడా చాలా చేసి ఉన్నాను కూడా కాబట్టి, దీని గురించి ఇంత కాన్‌ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. 

కట్ టూ మన టాపిక్ -

ఒక ప్రాజెక్ట్ కోసం ఒక్కరే మొత్తం పెట్టుబడి పెట్టకుండా - తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఎక్కువమంది షేర్‌హోల్డర్స్ కావొచ్చు.

ఉదాహరణకి -

అంతా కొత్తవారితో ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం తీసి, రిలీజ్ చేయడానికి ఒక కోటి బడ్జెట్ కావాలనుకొంటే .. ఆ మొత్తం ఒక్కరే పెట్టాల్సిన పనిలేదు.

40 మంది ఒక లక్ష చొప్పునగాని; 25 మంది 2 లక్షల చొప్పునగాని; లేదా ఓ 10 మంది 10 లక్షల చొప్పునగాని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధ్ధతిలో ఎవ్వరికీ పెద్ద రిస్క్ ఉండదు.

త్వరలో నేను ప్రారంభించబోతున్న నా కొత్త సినిమాలకు, ఈ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిధ్ధంగా ఉన్నవారికి ఇదే నా ఆహ్వానం.

నిజంగా మీలో అంత ఆసక్తి ఉండా?
చిన్నస్థాయిలో వెంటనే పెట్టుబడి పెట్టగలరా?

అయితే .. పూర్తి వివరాలకోసం వెంటనే మీ మొబైల్ నంబర్‌తో నా ఫేస్‌బుక్‌కు గానీ, ట్విట్టర్‌కు గానీ మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ చేస్తాను.
^^^

పి ఎస్: మీకు తెలిసి ఈ వైపు ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరయినా ఉంటే, వారికి ఈ ఇన్‌ఫర్మేషన్ లింక్ పంపించండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్! దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com