Tuesday 4 March 2014

హిపోక్రసీ వర్ధిల్లాలి!

హిపోక్రసీ #1

సెన్సార్ రూల్స్ ప్రకారం సినిమా ప్రారంభంలో ఒక టైటిల్ కార్డ్ తప్పనిసరిగా వేయాలి. "పొగ త్రాగటం, ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం" అని.

ఆ తర్వాత ఇంక మీ ఇష్టం..

హీరో, హీరోయిన్, విలన్, వాడి గ్యాంగూ వగైరా ఎన్ని సిగరెట్లయినా త్రాగొచ్చు. ఎంచక్కా హుక్కా తాగొచ్చు. అలాగే ఎంతయినా డ్రింక్ త్రాగొచ్చు. తాగీ తాగీ కక్కుకోవచ్చు.

కట్ టూ హిపోక్రసీ #2 -  

"పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం" అని ప్రతి సిగరెట్ ప్యాకెట్‌పైనా, ప్రతి పొగాకు ఉత్పత్తిపైనా విధిగా ముద్రించాలని ప్రభుత్వం రూల్ పెడ్తుంది. వాటిని మాత్రం వాడొచ్చు! ప్రభుత్వానిక్కావల్సిందల్లా .. ఏటేటా వాటి అమ్మకాలమీద భారీగా పెరుగుతూవచ్చే టాక్సెస్..

"ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం" అని కూడా గవర్నమెంటు, రాజకీయనాయకులు, వాళ్లూ వీళ్లూ చెప్తూనే ఉంటారు. వాటి అమ్మకాల గ్రాఫ్ ఏటేటా పైపైకి ఎగిసిపోతూ ప్రభుత్వాలకి బోల్డంత ఆదాయం తెచ్చిపెడుతూనే ఉంటుంది.    

పై రెంటి ద్వారా అనఫీషియల్‌గా ఆయా మంత్రిత్వశాఖల్లోని రాజకీయనాయకులకూ, సంబంధిత అధికారులకూ భారీగానే ముడుతుందని అందరికీ తెలుసు.

అయితే, ఈ రెండూ మనిషి జీవితానికి, ఆరోగ్యానికీ హానికరమైనవి అని తెలిసీ అసలు వీటిని ఉత్పత్తి చేయటం దేనికి? తర్వాత ఉత్తుత్తి వార్నింగులు ఇవ్వటం దేనికి?  

పాయిజన్ తింటే చచ్చిపోతాం. అలాగని పాయిజన్‌ని ఉత్పత్తి చేస్తూ ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నామా? నెవర్! అలా ఎన్నటికీ జరగదు.

మరోవైపు.. స్లో పాయిజన్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే ఈ పొగాకు ఉత్పత్తులు, లిక్కర్ ఉత్పత్తులు ఎవర్‌గ్రీన్‌గా ఉంటున్నాయి. ఉంటాయి కూడా.

ఇప్పుడు నాకు డౌటొస్తోంది. దీన్ని హిపోక్రసీ అనాలా .. శాడిజం అనాలా?  

No comments:

Post a Comment