Monday 27 July 2020

వర్కింగ్ ఫ్రమ్ హోమ్!

లాక్‌డౌన్ అందర్నీ ఒక చూపు చూసింది. నన్ను మరింత స్పెషల్ ప్రేమతో చూసిందనుకోండి... అది వేరే విషయం.

ఏదో రెండు వారాల్లో పోతుందిలే అనుకున్నాం. తర్వాత రెండు నెలలు అనుకున్నాం. ఇప్పుడది నాలుగు నెలలు కూడా దాటింది.

కరోనా వైరస్ ఇంత పని చేస్తుందనుకోలేదు.

అందరం అదే అన్‌సర్టేనిటీతో, అదే భయంతో బ్రతుకుతున్నాం ఇంకా.

"ఇంకో రెండు నెలలు" అని ఫ్రెష్‌గా ఈరోజు కూడా ఇంకోసారి వింటున్నాను. కొంచెం తెలివైనవాళ్ళు "డిసెంబర్ దాకా ఏ ఆశలు పెట్టుకోకు... 2020 మర్చిపో" అంటున్నారు!

ఈ నేపథ్యంలో -

లాక్‌డౌన్ తర్వాత ఓటీటీ/ఏటీటీలకు మాత్రమే కొన్ని సినిమాలు చేస్తున్నాను. అది వేరే విషయం. దానికింకా టైముంది. 

అయితే, దాంతో సంబంధం లేకుండా, 365/24/7 ఎలాంటి బ్రేక్ లేకుండా, నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసం ఒక మహా కార్యక్రమం ఈ మధ్యే ప్రారంభించాను.

అదే  నా  Work from Home!

అప్పటికప్పుడు, 48 గంటల్లో, నేను క్రియేట్ చేసుకొన్న నా  వెబ్‌సైట్  చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది.

> రైటింగ్
> ఫిలిం మేకింగ్
> కోచింగ్
> ప్రమోషన్

ఈ నాలుగు రంగాల్లో  Piece Work, Ghost Work, Freelance Work రూపంలో... నాకు చేతనైన ప్రతి పనీ చేసేస్తున్నాను.

24/7 పనిలో బిజీగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటం మరింత ముఖ్యం.   

సో, నా వెబ్‌సైట్ విజిట్ చేయండి...

It's a 'One Stop Shop' for content and services related to Writing, Filmmaking, Promotion, Coaching solutions, etc.

వాటిల్లో ఒక్కోదాని గురించి ఈరోజునుంచే ఇక్కడ బ్లాగ్‌లో పరిచయం చేస్తుంటాను... రాస్తుంటాను.

ఈ లాక్‌డౌన్లో మీలో ఎంతోమందితో కలిసి పనిచేసే అంశం ఏదో ఒకటి నాకు తప్పక ఉంటుంది.

దాదాపు... వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన క్రియేటివ్ సర్విసెస్ అన్ని విభాగాల్లోనూ నాకు అసిస్టెంట్స్, టీమ్ ఉన్నప్పటికీ... ప్రతి ఒక్క ఆర్డర్‌ను స్వయంగా నేనే డీల్ చేస్తాను. క్లయింట్స్ టైమ్ ఏమాత్రం వృధా కాకుండా నా వాట్సాప్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్‌లో ఇచ్చాను.

Welcome to My Website!

ManoharChimmani.In

And... Please feel free to reach out to me. I look forward to a beautiful journey together. 

2 comments:



  1. A writer , film director అని మాత్రమే పెట్టండి బ్లాగర్ అని పెట్టుకున్నారంటే మీ ఇమేజ్ కొంత దెబ్బ తినే అవకాశాలు మెండు . ఓన్లీ పని లేక బ్లాగాడుతుంటారని జనుల నమ్మకం :)



    జిలేబి

    ReplyDelete
  2. అనుకొనేవాళ్లను మనం ఆపలేము. బ్లాగర్‌కు పని ఉండదు అనుకొనేజనులతో నాకు అసలు పని ఉండదు. సో, ఇక సమస్యే లేదు.

    Thank you for your suggestion, Zilebi garu. Blogger నాకు అత్యంత ఇష్టమైన టైటిల్. :)

    ReplyDelete