Thursday 9 July 2020

సీన్ మారిన సినిమా

థాంక్స్ టూ కరోనా... సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా పరిష్కారం లేకుండా, పరిష్కారం కాకుండా తొక్కిపెట్టిన ఒక సమస్య సంపూర్ణంగా పరిష్కరించబడింది.

అదే చిన్న బడ్జెట్ సినిమాల మీద చిన్న చూపు, ప్లస్ వాటి రిలీజ్ సమస్య.

కరోనా లాక్‌డౌన్ అనంతరం ప్రజల మానసికస్థితిని బట్టి, ఈ లాక్‌డౌన్ అనుభవం వారి ఆలోచనల్లో తెచ్చిన మార్పును బట్టి వారి జీవనశైలిలో ఊహించలేనంత మార్పు ఉండబోతోంది. సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుల్లో ఈ మార్పు ఏ స్థాయిలో ఉంటుందన్నదాన్ని బట్టి రేపు థియేటర్స్ నిండుతాయి. కరోనాకు ముందులా హౌస్ ఫుల్స్ ఎలా ఉండబోతాయన్నది తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.

అసలు థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అది వేరే విషయం.

అయితే, ఇకమీదట ఇదంతా భారీ బడ్జెట్ సినిమాల సమస్య మాత్రమే కాబోతోంది.

కట్ చేస్తే -

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT లకు తర్వాతి అడ్వాన్స్‌మెంట్‌గా ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ATT ఒకటి వచ్చింది.

ATT అంటే Any Time Theater.

ఇదొక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.

ఒక మల్టిప్లెక్స్‌లో లాగా దీన్లో చాలా ఆన్‌లైన్ థియేటర్స్ ఉంటాయి. వాటిల్లో ప్రతివారం, ప్రతిరోజూ, ఎప్పుడంటే అప్పుడు సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. Pay Per View పధ్ధతిలో టికెట్‌కు రేట్ ఫిక్స్ చేసుకొని ప్రమోషన్ చేసుకోవచ్చు.

ప్రేక్షకులు ఆన్‌లైన్లో ఒకే ఒక్క టికెట్ కొనుక్కొని, 2 రోజులపాటు దాన్ని హోమ్ థియేటర్‌లో ఇంటిల్లిపాదీ కలిసి చూడొచ్చు. విడివిడిగా చూడొచ్చు. పక్కింటివాళ్లను, ఫ్రెండ్స్‌ను తెచ్చుకొని కూడా చూడొచ్చు.

ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు.

హోమ్ థియేటర్ లేనివాళ్లు డెస్క్‌టాపుల్లో, లాప్‌టాపుల్లో, టాబ్లెట్స్‌లో, చివరికి... స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా చూడొచ్చు.

థియేటర్లో ఫ్యాన్స్ చేసే అల్లరి, పేపర్స్ విసిరేయటం తప్ప మిగిలిందంతా ఓకే.

హోం థియేటర్ ఉన్నవాళ్లకు దాదాపు సినిమా థియేటర్ ఎఫెక్టే ఉంటుంది. థియేటర్‌కు వెళ్లే ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు, పార్కింగ్ సమస్య, ఇంటర్‌వెల్లో వందలకి వందలు పెట్టి కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ వగైరా కొనే పనుండదు. జస్ట్ ఒక్క 100 రూపాయల్లో ఇంట్లోనే  కూర్చునో, పడుకొనో హాయిగా సినిమా చూడొచ్చు.

సినిమాను బట్టి ఈ టికెట్ రేట్‌లో హెచ్చుతగ్గులుండొచ్చు. అయితే, ఒక్క టికెట్ కొంటే దాన్ని మించిన క్యాష్‌బ్యాక్ కూపన్స్, ఇతర ఆఫర్స్ కూడా త్వరలో బోలెడన్ని ఉండబోతున్నాయి.   

ShreyasET పేరుతో శ్రేయాస్ మీడియా పరిచయం చేసిన ఈ ఏటీటీలో రిలీజైన మొదటి సినిమా ఆర్జీవీ CLIMAX.

ఈ సినిమా కొన్ని గంటల్లోనే కోటి డెభ్భై లక్షలు కలెక్ట్ చేసింది.

ఇప్పుడు ఇలాంటి ఏటీటీలు ఇంకో అరడజన్ రాబోతున్నాయి. చిన్న బడ్జెట్ నిర్మాతలకు, దర్శకులకు ఇందులో ఉన్నన్ని లాభాలకు లెక్కే లేదు.

అన్నిటికంటే ముఖ్యమైన లాభం ఏంటంటే - ఏటీటీలో తన సినిమా రిలీజ్ కోసం నిర్మాత దీన్లో రెంట్ కట్టే పనిలేదు. కంటెంట్‌లో ఏమాత్రం సత్తా ఉన్నా... పెట్టుబడి, దానికి కనీసం రెట్టింపయిన లాభం 100% పక్కా!

ఇంకేం కావాలి?