Saturday 1 July 2023

సినిమా... ఇప్పుడు భారీ లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా! (Guest Post)


- Guest Post by Y. Padmaja Reddy, from Canada.

ప్రపంచంలో ఏ ఇద్దరు భారతీయులు కలిసినా కామన్‌గా చర్చించే విషయం ఏంటో తెలుసా?

ఇండియాలో ఆటోలో అయినా, కెనడాలో క్యాబ్‌లో అయినా... జెనరల్‌గా  మాట్లాడుకునే టాపిక్ కూడా అదే.

అదేనండి... సినిమా. 

సినిమా అనేది అందరి జీవితాలలో ఒక విడదీయలేని అంశంగా మారిపోయి చాలా దశాబ్దాలు దాటింది. కాని, సినిమాల్లో పనిచేసే వాళ్లని, సినిమా ఇండస్ట్రీని ఇదే మనుషులు ఒక ప్రత్యేక తెగగా చూస్తారు. "మీ సినిమా వాళ్ళు" అంటారు. చీటర్స్‌గా భావిస్తారు. 

కాని, సొసైటీలో ఉన్న ఎన్నో ప్రొఫెషన్స్ లాగే సినిమా ఫీల్డు కూడా ఒక మంచి ప్రొఫెషనే అన్న వాస్తవాన్ని ఇంకా  చాలా మంది గుర్తించరు.

కరోనాకి ముందు వరకు అంటే - చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో కొంత భయం ఉండేది. రిలీజ్ కష్టం అని, జనం రారని. కాని, ఓటీటీ ల్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది.  

సినిమా అంటే ఇప్పుడు వుట్టి ఎంటర్‌టేన్మెంట్ మాత్రమే కాదు. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని నా అభిప్రాయం.   

ప్రపంచ సినిమా ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. మనం కోటి పెట్టి సినిమా తీసినా, వంద కోట్ల విలువైన కంటెంట్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు.  

ఈ నేపథ్యంలో - మంచి కంటెంట్ ఉన్న తక్కువ బడ్జెట్ సినిమాలో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్లో మంచి స్వింగ్‌లో ఉన్న కంపెనీ స్టాక్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ లాంటిదని నా ఉద్దేశ్యం. 

ప్రతి దానిలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అసలు రిస్క్ లేకుండా ఏదీ లేదు.  

జనాలు ఇంకా సినిమాలు అంటే 1950 ల్లో లాగా ఆలోచించడం చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. 

మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు రావాలి అంటే సినిమాని, సినిమావాళ్లని పాజిటివ్ దృక్పథంతో చూడడం అవసరం. 

సినిమా ఇండస్ట్రీలో అందరూ పిచ్చివాళ్ళే అంటారు కొందరు. కాని, సినిమా రంగంలో రాణించాలి, సినిమా హిట్ కొట్టాలి అంటే...  సినిమా అంటే ఒక రేంజిలో పిచ్చి ఉండటమే మొట్టమొదటి క్వాలిఫికేషన్.  

ఒకప్పుడు సినిమా అనేది అందరికీ అందని ద్రాక్ష పండు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రౌడ్ ఫండిగ్ విధానం వల్ల, ఇప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి మార్గం సుగమమైంది. 

ఫైనల్‌గా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే - ఇప్పుడు సినిమా అనేది జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా ఊహించని లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా.  

- వై పద్మజా రెడ్డి , కెనెడా. 

5 comments:

  1. సినిమా... ఇప్పుడు భారీ లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా! అలాగే అది భారీనష్టాల్ని తెచ్చే ప్రమాదమార్గం కూడాను.
    (Just an opinion, you need not publish this comment)

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ మీద నేను ప్రత్యేకంగా ఒక పోస్ట్ రాస్తున్నాను. Thanks for the comment!

      Delete
  2. మీరు ఒక్కరే సినిమా రిస్క్ లేని పెట్టుబడి అని చెప్పేది.
    అటువైపు ఆ గ్రేట్ ఆంధ్ర , తుపాకీ లాంటి వెబ్సైట్ చిన్న సినిమా ఎత్తిపోయింది అని , ఆహా తప్ప ఎవరు దేకడం లేదని .
    పెట్టిన పైసలు అన్ని మూసి నది పాలైనట్టే అని చెప్తున్నాయి .
    వారానికి చిన్న సినిమాలు 10 వస్తున్నాయి , ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడ్డం లేదు సోమవారానికి .
    మీరు చెప్పేదానికి, వాస్తవంగా బయట కనిపించేది చాలా తేడా కనిపిస్తుంది .

    ReplyDelete
    Replies
    1. Unknown garu,
      మీ కామెంట్ మీద నేను ప్రత్యేకంగా ఒక పోస్ట్ రాస్తున్నాను. Thanks for the comment!

      Delete
  3. thank you. waiting for your Post.

    ReplyDelete