Wednesday 5 July 2023

వన్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా... (Guest Post)


- Guest post by Lahari Jithender Reddy, Hyderabad. 


ప్రస్తుత జెనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ అనేది 
మనిషి కనీస అవసరాల్లోకి చేరిపోయింది .... 

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు 
స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారే ....
స్మార్ట్ ఫోన్‌కి మరొక పేరు సోషల్ ...
ఇప్పుడు ... 
సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి 
ఒక ప్రెస్టేజ్ అయిపోయింది .... 

సోషల్ మీడియా ...
మంచికి ఎంత మంచిదో, చెడుకి అంత చెడ్డది ...

ఏ పని పాట లేకుండా ఉండే వారు 
ఏదో ఒక విషయాన్ని ..
అది నిజామా, కాదా 
తప్పా, ఒప్పా 
జరిగిందా, లేదా.... 
ఈ విషయాలన్నీ ఏ మాత్రం పట్టింపు లేకుండా 
ఇష్టారీతిన పోస్ట్లు పెట్టేయడం ...

నిజానికంటే అబద్ధానికి ఆత్రం ఎక్కువ అందుకే ...
నెక్స్‌స్ట్ ఆ పోస్ట్ ట్రేండింగ్ లో ఉంటుంది ...
దాని మీద అందరు అభిప్రాయాలూ చెప్పడం ..
జడ్జ్ చేయడం ..
చర్చలు, డిబేట్లు ....

ఇవి చాలవన్నట్లు మధ్యలోకి పాలిటిక్స్,
మతాలు, కులాలు ....
ఇవన్నీ వచ్చి మధ్యలో దూరి, 
నానా  రచ్చ చేసి సమయాన్ని వృధా చేసుకోవడం ....

ఆయా విషయాలపై, వార్తలపై 
అవగాహన ఉన్నవారు ...
విశ్లేషకులు ...
విషయ పరిశీలకులు ...
ఏ ఒక్కరు కూడా 
దీనిని వివరించే ప్రయత్నం చేయక పోగా ..
మనకెందుకులే అని 
వాళ్ళ మెదడులో ఉన్న విషయపరిజ్ఞానాన్ని 
సుప్తావస్థలో ఉంచేసి ....
దానికి పరిధి అనే దుప్పటి కప్పేసి ...
జరిగే దానిని అలా చూస్తూ ...
ఎంత విడ్డూరం!

ఇంత ...
ఇంత రచ్చ క్రియేట్ చేస్తున్న 
ఈ సోషల్ కంటెంట్ అంతా 
ఏమైనా పనికివచ్చేదా అంటే -
కాదు కాదు పనికి మాలిన విషయాలలో 
మొదటి ప్లేస్‌లో ఉండేది!

ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉంది అంటే 
అబద్దాన్ని, నిజం అని అరిచి అరిచి నిజం చేసేంత ...

నిజం కళ్ళముందు కనిపిస్తున్నా  
సోషల్ మీడియా అనే కంటి పొర చేరిపోయి 
అంధులుగా మారేంత...  

నువ్వు చాలా ఆరోగ్యాంగా ఉంటావు ...
ఆనందంగా ఉంటావు ...
కానీ ఒక్కసారిగా నీ చావు న్యూస్ 
సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ..
అందరు కామెంట్స్ పెడుతున్నారు .
రిప్ అని 
ఓం శాంతి అని 
స్వర్గలోక ప్రాప్తిరస్తు అని ...

అంటే... 
నువ్వు బతికుండగానే చంపేసి ...
నీ న్యూస్ వైరల్ చేసేసి, 
ఇంకా లేట్ చేస్తే ..
పిండం కూడా పెట్టేస్తారు ...

ఎవడో పనికిమాలిన వాడు 
వాని ఎంజాయిమెంట్ కోసం నిన్ను చంపేసి 
దాన్ని న్యూస్ చేసేసి, స్ప్రెడ్ కూడా చేసేస్తే ...
నువ్వు మీడియా ముందుకు వచ్చి 
నేను బతికే ఉన్నాను అని నిరూపించుకునే దౌర్భాగ్యం!

భార్యాభర్తలను, ప్రేమికులను 
కుటుంబాల్ని, స్నేహితుల్నీ... 
ఒక్క దెబ్బతో విచ్చిన్నం చేస్తున్న ఘనత
ఈ సోషల్ మీడియాది,
ఈ స్మార్ట్ ఫోన్లది కాదా?  

ఇది సోషల్ మీడియా - 
ఇక్కడ ఏమైనా జరగొచ్చు ..
చెడు మంచిది అయితది ..
రౌడీ హీరో అవుతాడు ..
మిడి మిడి జ్ఞానం అసలు విజ్ఞానాన్ని కప్పేస్తుంది ...

కులాల కొట్లాటలు 
మతాల మారణ హోమాలు ..
నాస్తికుల ఘీంకారాలు,
టన్నులకొద్దీ నానా చెత్త కంటెంట్ 
ఇది అది అని లేదు ..
విశ్వంలో ఉన్న ప్రతి విషయం ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది ...

మొత్తం మీద తిమ్మిని బమ్మిని చేసి,  
బమ్మిని తిమ్మి చేసి 
సెలబ్రిటీ స్థాయి నుండి కామన్ మాన్ వరకు ..
పీఎం నుండి గల్లీ లీడర్ వరకు ..
ప్రతి ఒక్కరిని ఒక ఆట ఆడేసుకుంటూ ..
రోజు రోజుకు తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ ...
ఇప్పుడే పుట్టిన పిల్లలను కూడా తనకి బానిసను చేసుకుంటూ ...
ఏకఛత్రాధిపత్యం చేస్తున్న ఈ సోషల్ మీడియాని - 
ఎంతయినా మెచ్చుకోవచ్చు,
ఎలాగైనా పొగడొచ్చు...  

- లహరి జితెందర్ రెడ్డి, హైద్రాబాద్. 

No comments:

Post a Comment