Thursday 20 September 2012

యూజ్ అండ్ త్రో


అంటే - అవసరం ఉన్నంత వరకు వాడుకొని, వదిలేయటం అన్న మాట!  
'యూజ్ అండ్ త్రో' కల్చర్ అనేది సినీ ఫీల్డు లో ఉన్నంతగా మరెక్కడా ఉండక పోవచ్చుననేది నా వ్యక్తిగత అభిప్రాయం.

'ఇలా కూడా జరుగుతుందా?!!' అని మనకి మనం షాక్ అయిపోయి ప్రశ్నించుకునేంత స్థాయిలో ఉంటుంది కల్చర్. నిజంగా నమ్మలేం ..

మనతో అవసరం ఉన్నంత వరకు  'సార్ సార్’ అంటూ మనకు వంగి వంగి దండాలు పెడతారు. మనమే ఆశ్చర్యపోతాం - 'ఏంటి మరీ ఇంత అభిమానమా' అని!  దశాబ్దాలుగా పరిచయం ఉన్నంత రేంజ్ లో వారి అభిమానాన్ని ప్రదర్శిస్తారు.

'మీరు లేకుండ ఏదీ లేదు!' అని అనుక్షణం వారి ఫీలింగ్స్ ని తెలుపుకుంటుంటారు.

ఇక్కడ 'కట్' చేద్దాం ..

మనతోపని అయిపోయింది .. ఇంక అవసరం లేదు’ అని తెలుసుకున్న మరుక్షణం - మనం ఎవరమో మనకే సందేహం కలిగేట్టు చేస్తారు! ఎదురుగా కనిపించినా 'ఎవరో' అన్నట్టుగా - ఒక గోడను చూసినట్టు చూస్తారు తప్ప - కనీసం విష్ చేయరు. పోనీ, చూళ్లేదేమో అని - మనం విష్ చేసినా అసలు పట్టించుకోరు. 'ఎవర్నువ్వు' అన్నట్టుగా చూస్తారు!!

నేను
మరీ అతిశయోక్తిగా రాశాను అనుకుంటున్నారేమో .. కానీ, ఇదంతా నూటికి నూరు పాళ్లూ నిజం.

ఆరు నెలల తర్వాత మళ్లీ మనతో ఏదయినా అవసరం వచ్చిందనుకోండి .. క్షణంలో మళ్లీ మన కళ్లముందు అదే డ్రామా 'రీప్లే' అవుతుంది! పాత్రలూ అవే.. స్టేజీ అదే .. జస్ట్ రీప్లే!!

ఇలాంటివి ఎన్నో చూసి - అనుభవించిన నా మిత్రుడొకాయన సినీ ఫీల్డులోని సంస్కృతి కి కాస్త మొరటుగా రెండే రెండు ముక్కల్లో ఒక పేరు పెట్టాడు.

కండోం కల్చర్!

ఇంక దీని గురించి వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను..

No comments:

Post a Comment