Monday 17 September 2012

'అది' అంత ఈజీ కాదు!


హీరోయిన్స్ గురించి, సినిమాల్లో నటించే ఇతర లేడీ ఆర్టిస్టుల గురించి బయట అంతా ఒక చెత్త టాక్ ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్ లో 'కాస్టింగ్ కోచ్' సిండ్రోం అని ఇంకొంచెం అందంగా కూడా చెబుతారునిజానికి 'అదిఅంత ఈజీ కాదు. అంత కామన్ కూడా కాదు. ముఖ్యంగా - ఇప్పటి లేటెస్ట్ కండిషన్స్ లో.

తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లలో దాదాపు 90 శాతం మంది హీరోయిన్లు ముంబై నుంచే వస్తారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. (అది మరొక బ్లాగ్ పోస్ట్ అవుతుంది రాయాలంటే!) వీరంతా బాగా చదువుకున్నవారు, మంచి రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినవారు కూడా అయ్యుంటారు. వీళ్ల పేరెంట్స్ లో మిలిటరీ వాళ్లు, డాక్టర్లు, బిజినెస్ మెన్లు, ప్రొఫెసర్లు కూడా ఉంటారు. కొంతమంది హీరోయిన్లు ఏకంగా ఫారిన్ నుంచే దిగుతారు!   

ఇంక వీళ్ల లైఫ్ స్టయిల్ గురించి చెప్పాలంటే - మన సినిమా వాళ్లు ఇక్కడ చాలా వెనకబడి ఉన్నారని చెప్పక తప్పదు. వాళ్లళ్లో కొందరు మెయింటెన్ చేసే కార్లు ఇక్కడ మన ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి కూడా ఉండవు. రేంజ్ వాళ్లని అంత ఈజీలీ అప్రోచబుల్ అనుకోవటం ఫూలిష్ నెస్ తప్ప మరొకటి కాదు

సినిమాల్లో నటించాలని వీరికి 'ప్యాషన్' ఉంటుందే తప్ప - సినిమాలో  చాన్స్ రావటం కోసం దేనికయినా రెడీ అనుకోరుయస్ - యెవరో కొంతమంది అక్కడక్కడా, అరుదుగా ఉండొచ్చు. ఉన్నారు. ఉంటారు కూడా. అంత మాత్రాన, సినిమా హీరోయిన్స్ అంతా అలాంటివారే అనుకోవటం తప్పు.  

ఇంకొక విషయం ఏంటంటే - ఇలాంటి 'ఈజీలీ అప్రోచబుల్' హీరోయిన్స్ సాధారణంగా అందం విషయంలోనూ, నటన విషయంలోనూ కొంచెం 'లో క్వాలిటీ' లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. కామన్ సెన్స్ ఉన్నవాడు యెవడయినా 'దీని' కోసం  కోట్ల రూపాయలు పోగొట్టుకోవాలనుకోడు.

మిగిలిన సపోర్టింగ్ లేడీ ఆర్టిస్టుల విషయంలో కూడా ఇంతే. అరుదుగా కొంత మంది అలా ఈజీలీ అప్రోచబుల్ అయి ఉండొచ్చు. అలాంటి  ఇంటరెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అదీ మ్యూచువల్లీ అగ్రీ అయినప్పుడు! బై ఫోర్స్ అనేది మాత్రం ఎప్పుడూ ఎక్కడా ఉండదు. అలాంటిది ఏదయినా జరిగితే - ఇప్పుడున్న లేటెస్ట్  టెక్నాలజీ ఎవరిని రకంగానయినా పట్టించే అవకాశముంది. బ్రేకింగ్ న్యూస్ ఇవ్వటం కోసం టీవీ చానళ్లు కూడా కాచుకుని ఉంటాయి. అంత రిస్క్ అవసరమా?

అవకాశమిచ్చి ఆడవాళ్లను ఉపయోగించుకొనే సిండ్రోం ఒక్క సినీ ఫీల్డులో మాత్రమే ఉందంటే మాత్రం అంతకంటే పెద్ద అబద్ధం   ఇంకొకటి ఉండదు. నిజానికి ఇది ప్రతి ఫీల్డు లోనూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే - సినీ ఫీల్డులో కంటే, ఇతర ఫీల్డుల్లోనే ఇది ఎక్కువగా ఉంది. కానీ, వేరే ఎక్కడా ఇవి ఎక్స్ పోజ్ కావు. టీవీ చానెల్స్ వాళ్లు కూడా ఇతర రంగాల్లోనూ జరిగే ఇలాంటి విషయాల్ని అసలు పట్టించుకోరు. సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం - ఇక్కడ జరిగే ప్రతి చిన్న అంశం కూడా ఒక బ్రేకింగ్ న్యూసే! ఈ బ్రేకింగ్ న్యూస్ ల తోనే టీవీ లకు రేటింగ్ లు వస్తాయి. ఎందుకు?

ఇది గ్లామర్ ఫీల్డు. ఫీల్డులో యెవడు దగ్గినా తుమ్మినా న్యూసేదటీజ్ సినిమా!!

No comments:

Post a Comment