Sunday 2 January 2022

దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్ళి జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి ఎవరు?

కరీంనగర్‌లో పుట్టాడు, హైద్రాబాద్ నిజాం కాలేజీలో చదివాడు. 1929 లో ముంబై వెళ్ళాడు. 


11 మూకీ సినిమాలు, 156 టాకీ సినిమాల్లో నటించాడు. హిందీతో పాటు ఉర్దూ, మరాఠీ, గుజరాతీ సినిమాల్లో కూడా నటించాడు. 

శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

దేవికారాణి, మీనాకుమారి లాంటి టాప్ హీరోయిన్స్‌తో జంటగా నటించాడు. అప్పటి పాపులర్ హీరోయిన్ నర్గీస్‌ను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీశాడు. 

1980 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడు. ఇంక చాలా ఉంది... 

కట్ చేస్తే - 


అందులో - దక్షిణాదినుంచి వెళ్ళిన కొంతమంది ప్రస్తావన తెచ్చారు. పేర్లు ఉదాహరించారు. గురుదత్, రజినీకాంత్, కమలహాసన్, వైజయంతిమాల, హేమమాలిని, శ్రీదేవి వగైరా. 

ఏ రకంగా చూసినా, ముందు ఉదాహరించాల్సిన రెండు మూడు పేర్లలో అతని పేరు తప్పక ఉండితీరాలి.

మరి ఎందుకనో ఉండదు. 

ఇదొక్కటే కాదు. ఎన్నో ఆర్టికిల్స్‌లో, ఎన్నో పుస్తకాల్లో ఇతని ప్రస్తావన అసలు రాదు. ఇతను సాధించిన విజయాల గురించి రాయరు. 

తెలియక కొందరు. తెలిసీ రాయని కొందరు. 

మొత్తానికి అతని పేరు మాత్రం మిస్ అవుతుంది.

ఇప్పటివారికే తెలీదు. ఇంక తర్వాతి తరాలవారికేం తెలుస్తుంది? 

ఆ కాలంలోనే అతను సాధించిన ఎన్నో విజయాలను ప్రాంతం అనే ఒక చిన్న విషయం నిజంగా అలా కమ్మేస్తుందా? 

అలా కమ్మేసిన ఆ ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత పేరు... పైడి జైరాజ్.  
***

#PaidiJairaj #DadasahebPhalkeAwardWinner #HindiHero #HeroFromKareemNagar #KareemNagarHero #TelanganaHero #BollywoodHeroFromTelangana #BollywoodHero #BollywoodDirector #BollywoodProducer

No comments:

Post a Comment