Friday 14 January 2022

పాలిటిక్స్‌ను ఎందుకు పట్టించుకోవాలి?

టీవీ చానెల్స్‌లో రాజకీయాలు గాని, ఇతర బ్రేకింగ్ న్యూస్‌ను కాని ఎప్పుడైనా బోర్ కొడితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూడాలి తప్ప, వాటిని సీరియస్‌గా తీసుకొని సమయం వృధా చేసుకోవద్దు. 

చానెల్స్ గోల్స్ వేరే. వాళ్ళ టీఆర్పీ లెక్కలు వేరే. 

90% బ్రేకింగ్ న్యూస్‌లు జస్ట్ యాడ్స్ మధ్య ఫిల్లర్స్ లాంటివి. అంతకంటే ఏం లేదు. 

"సమంతకు దగ్గు", "అనుష్కకు ఎలర్జీ" స్థాయికి బ్రేకింగ్ న్యూస్‌ను తీసుకెళ్ళిన చానెల్స్‌కు జయహో! 

ఇదంతా ఎలా వున్నా, "మన నిత్యజీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలిటిక్స్ ప్రభావితం చేస్తున్నప్పుడు, ఆ పాలిటిక్స్‌ను పట్టించుకోవడం తప్పనిసరి" అని వందల ఏళ్ల క్రితం నుంచి ఎంతోమంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. చదువుకున్న విద్యావంతుల్లో 90% మంది అసలు రాజకీయాల్ని పట్టించుకోరు. వీరి నిరాసక్తతే ఈ దేశంలో పాలిటిక్స్ ఇంకా ఇలా సాగుతుండటానికి ప్రధాన కారణం అంటే, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 

నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం - ఇంక 100 ఏళ్లయినా ఈ దేశంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కులం, మతం ఎట్సెట్రా ఇలాగే శాసిస్తుంటాయి.

గతంలో వున్న రాచరికానికి ప్రజాస్వామ్యం అనే ఒక ముసుగే ఇప్పటి రాజకీయాలు తప్ప పెద్దగా మార్పులేం లేవు. ఉండవు.  

మన దేశ రాజకీయాల్లో ఒక లేయర్ లేయరే కొట్టుకుపోవాలి. అదెప్పటికైనా, ఏదో ఒక మిరాకిల్ లాగా సాధ్యమే అని ఒక చిన్న ఆశ. అంతే. 

అలా జరగనంత కాలం ఈ దేశంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయి. అలాగని నిరాశపడిపోయి వీటిని మరీ పట్టించుకోకుండా ఉండటం కూడా తప్పే అవుతుంది. 

ప్రత్యక్ష రాజకీయాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు. కాని...  కళ్లముందు కనిపిస్తున్న అంకెలు, అభివృధ్ధి, పెర్ఫార్మెన్స్‌ను బట్టి... ఉన్నవాటిలోనే ది బెస్ట్‌ను సపోర్ట్ చేయడం మన బాధ్యత. ఇది కూడా చెయ్యలేకపోతే అంతిమంగా ఎఫెక్టయ్యేది కూడా మనమే. 

No comments:

Post a Comment