Tuesday 19 July 2016

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!

"సబ్ కా సున్‌నా అప్నా కర్‌నా" అని ఒక సామెత.

తెలిసీ, అనుభవం ఉండీ, ఈ సామెతను ఆమధ్య అసలు పట్టించుకోలేదు. అప్పుడు అందరు చెప్పిందే విన్నాను కానీ, నా మనసు చెప్పింది మాత్రం పక్కన పెట్టాను.

ఇప్పుడు జ్ఞానోదయమైంది, పూర్తిగా.

కట్ టూ క్రియేటివిటీ - 

క్రియేటివిటీకి హద్దులు లేవు. ఉండకూడదు. ఇది నేను వంద శాతం నమ్ముతాను. పాటిస్తాను.

నా టీమ్‌ను ఒక మూడు భాగాలుగా చేస్తే - అందులో ఒక భాగం తెలంగాణవాళ్లుంటారు. మరొక భాగం ఆంధ్రప్రదేశ్‌వాళ్లుంటారు. ఇంకో భాగం మొత్తం మన దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందినవాళ్లుంటారు.

కొన్నిసార్లు ఈ రేషియో మారొచ్చు కూడా.

రఫ్‌గా దీన్నే ఇంకో కామన్ రేషియోలో కూడా చెప్పగలను. టీమ్‌లో సగం మంది తెలంగాణవాళ్లుంటే, మిగిలిన సగం మంది మన దేశంలో ఒక్కో ప్రాంతం నుంచి ఉంటారు.

అయితే - ఇదంతా నేనేదో ప్లాన్ ప్రకారం చేస్తున్నది కాదు. అలా ఎవ్వరూ చెయ్యలేరు. కాని, ఇప్పటికే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన చాలామందిలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఉంది. వాళ్ళు చేయొచ్చు. బట్, ఆ "చాలా మంది" గురించి నాకు అవసరం లేదు. అది వేరే విషయం.

'లైక్‌మైండెడ్ స్వభావం' ఒక్కటే నా టీమ్‌లో నేను చూసేదీ, నాకు కావల్సిందీ.

కట్ టూ రాజకీయాలు -

మా తెలంగాణ రాష్ట్ర ఐ టీ మిస్టర్ కె టి రామారావు (KTR) ఫేస్‌బుక్ పేజ్ మీద ఒక సూపర్ కొటేషన్ ఉంది:  "When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!" అని.

సవాలక్ష పనికిరాని కొటేషన్లలో ఇదొకటి కాదు. తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. బాగా ఆలోచించాల్సిన కొటేషన్.

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింతగా అలోచించాల్సిన కొటేషన్ ఇది. ఎందుకంటే, స్టాటిస్టిక్స్ ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క పనికిమాలిన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది.

సో, కె టి ఆర్ గారికి థాంక్స్!

తెలిసిన కొటేషనే అయినా .. నాలాంటి ఎందరో నిజంగా తెలుసుకొనేట్టు చేసినందుకు. ఇప్పుడు నేనీ బ్లాగ్ రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. :)

కట్ బ్యాక్ టూ ఓపెనింగ్ - 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన వ్యక్తి కె సి ఆర్. గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించి చూపిన ఒక ఉద్యమ శక్తి కె సి ఆర్.

ఈ నేపథ్యంలో, ఆయనమీద అభిమానంతో, ఆయనే కేంద్రబిందువుగా నేను రాసిన ఒక పుస్తకం రెండేళ్ల క్రితమే ప్రచురిద్దామనుకొన్నాను. "సినీఫీల్డులో వున్నావు. ఎందుకు అనవసరంగా.. వద్దు!" అని చెప్పిన కొందరి 'ఉచిత సలహా' విని, ఆ పని అప్పుడు వాయిదా వేసుకున్నాను.

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు.

ఇంకా చెప్పాలంటే - మొన్నటిదాకా శత్రువులుగా పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నవాళ్లే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కలిసిపోయారు. పార్టీలు మారుతున్నారు. పార్టీలకెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు.

ఇందులో తప్పేం లేదు. తప్పదు.

రాజకీయ చదరంగం.

జీవనవైరుధ్యం.

త్వరలో నేను ప్రారంభించబోయే నా కొత్త సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగానో, లేదంటే, ఆ సినిమా రిలీజ్ సమయంలోనో ఇప్పుడు నేనా పుస్తకం ప్రచురించడానికి నిర్ణయించుకున్నాను.

కె టి ఆర్ కొటేషన్ కాకుండా - ఈ నా నిర్ణయానికి పరోక్షంగా కేటలిస్టులుగా పనిచేసినవాళ్లు మరో ఇద్దరున్నారు.  ఒకరు నా ఫేవరేట్ స్టూడెంట్. మరొకరు నా టీమ్‌లో చీఫ్ టెక్నీషియన్.

విచిత్రమేంటంటే - వీళ్లిద్దరిదీ గుంటూరు! :)

2 comments:

  1. You are the competent to write a book on KCR.wish you success in your mega task. Sender. S V Lakshmi Reddy Retd FRO All India Radio Kurnool

    ReplyDelete
    Replies
    1. Really it's a very surprising feel to see this comment my dear sir, S V Lakshmi Reddy garu! I'm honoured. I will publish it anyways sir. Thanks for your best wishes and blessings. I still remember our golden moments of discussions on various things when we both were working there in AIR, Kurnool. I will get ur number and call u soon. Regards ..

      Delete