Friday 21 August 2020

సీన్ మారిందా?

సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా.. ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం.. ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది.

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు!

అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి.

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా.. తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

గత 5 నెలలుగా ఈ కరోనా లాక్‌డౌన్ కారణంగా వేలాదిమంది సినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పడుతున్న కష్టాలు కూడా దీనికి మరో ప్రత్యక్ష ఉదాహరణ.

కట్ చేస్తే -

ఇప్పటిదాకా మీరు చదివిందంతా పాత కథ.

ఇప్పుడు సీన్ మారింది. ఇంకా చాలా మారబోతోంది.

రెండు కారణాలు:

1. డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ వల్ల తగ్గిన ఫిల్మ్ మేకింగ్ బడ్జెట్లు.

2. కరోనా లాక్‌డౌన్ వల్ల గత 5 నెలలుగా మూసుకున్న థియేటర్లు - తెరచుకొన్న OTT/ATT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ - చిన్న బడ్జెట్ సినిమాలకు, కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు పెరిగిన అవకాశాలు.

ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. 

సుమారు ఒక దశాబ్దం క్రితమే, పాశ్చాత్య దేశాల్లో ఆధునికంగా సినీరంగంలో వచ్చిన అభివృధ్ధి, అనేక మార్పులు... చాలా ఆలస్యంగా...  ఇప్పుడు ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని, మనదగ్గర చూడబోతున్నాము. 

"ఒక్క ఛాన్స్" అనేది ఇకనుంచీ... జస్ట్ ఒక మిత్ !

ఇంకొకరెవరో మీకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరంలేదు.

సినిమారంగం పట్ల బాగా ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ విషయం ఇప్పటికే అర్థమైపోయుంటుంది.

అలాంటి అవేర్‌నెస్ తెచ్చుకొనే అవకాశం లేనివాళ్లకోసం నేనో చిన్న పుస్తకం రాశాను.

పుస్తకం పేరు...

"గ్లామర్ -
సినీఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు?
ఎందుకు వెళ్ళితీరాలి? "

ఈ చిరుపుస్తకాన్ని ఒక e-book రూపంలో ఫ్రీగా ఇస్తున్నాను, వారం రోజుల్లో...

e-book కావాలనుకొనే ఔత్సాహికులు -

మీ పేరు:
వయస్సు:
చదువు:
సోషల్ మీడియా లింక్స్:
పూర్తి అడ్రస్:
మొబైల్ నంబర్:

తెలుపుతూ నాకు ఈమెయిల్ / వాట్సాప్  చెయ్యండి.

27 వ తేదీలోపు నేనే స్వయంగా మీకు e-book మెయిల్ / లేదా వాట్సాప్ చేస్తాను.

ఆల్ ద బెస్ట్.

My email: mchimmani10x@gmail.com
WhatsApp: +91 9989578125 

No comments:

Post a Comment