Friday 1 March 2024

ఉచిత సలహాదారులకు వందనమ్!


నా శ్రేయోభిలాషి ఒకరితో ఇవాళ ఒక సుదీర్ఘ సంభాషణ జరిగింది. సుమారు 45 నిమిషాల ఆ సంభాషణ తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. 

అయితే - ఇదే సంభాషణ పుణ్యమా అని, తన ద్వారా ఒక ఆణిముత్యం లాంటి పాఠం కూడా నేర్చుకున్నాను... "లాభం లేని పని చెయ్యొద్దు" అని! 

కట్ చేస్తే - 

నా యూనివర్సిటీ స్నేహితులు కొందరంటారు... "ఈసారి నువ్వు సినిమా చేస్తే, నీ స్క్రిప్టు నాకివ్వు. నేను ఫైన్ ట్యూన్ చేసి, పంచెస్ గించెస్ యాడ్ చేసి ఇస్తాను. నీ సినిమా బంపర్ హిట్ అవుతుంది" అని. 

యూ యస్ నుంచి ఒక మిత్రుడు కాల్ చేసి అంటాడు: "నన్ను అడిగితే నేను మంచి కాన్‌సెప్ట్స్ ఇచ్చేవాన్ని కదా" అని. 

"నీకు 3 కోట్ల బడ్జెట్ నేను ఇస్తా, రా" అని ప్రామిస్ చేసి, ప్రామిస్‌ను తుంగలో తొక్కిన ఇంకో మిత్రుడు, ఒక సంవత్సరన్నర టైమ్ వేస్ట్ చేసిన తర్వాత, ఇలా అంటాడు: "నీకంటే రాజమౌళే సినిమా ఫాస్ట్‌గా చేసేటట్టున్నాడు... నువ్వు ఇట్లుంటే లాభం లేదు" అని, నేనెలా ఉండాలో చెప్తాడు.  

ఇన్ని విషయాలు బాగా తెలిసిన వీళ్ళంతా ఎందుకని సినిమాలు తీయరో నాకర్థం కాదు! తీస్తే వీళ్లకు ఈజీగా వందల కోట్లు వచ్చేవిగా?! 

నేను ఈ మాటంటే వీళ్లకి కోపం. 

కట్ చేస్తే - 

ఇవాళ్టి నా శ్రేయోభిలాషి చెప్పింది వేరే. అదంతా ఇక్కడ రాయాలంటే ఒక చిన్న నవల అవుతుంది. 

ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి మనిషికీ ఒక నేపథ్యం ఉంటుంది. అవి అందరికీ తెలియవు. తెలిసే అవకాశం ఉండదు.  

సినిమా అయినా, వ్యక్తిగతమైనా... నేపథ్యం తెలీకుండా ఉచిత సలహాలివ్వడం అంత లాభం లేని పని ఇంకోటి ఉండదు. 

నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ నిజం తెలుసుకొంటే బాగుండు...

వారి సమయం వృధా కాదు, నా మైండ్ డిస్టర్బ్ కాదు.  

- మనోహర్ చిమ్మని 

1 comment:

  1. సినిమాచూసే ప్రతివాడూ రైటరూ, డైరెక్టరూ.

    ReplyDelete