Thursday 7 March 2024

విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్‌లోనే ఉంటారు


సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు... ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఇప్పుడు కొత్తవారికి ఉన్నాయి. 

తను ఎన్నుకున్న విభాగంలో ఏ కొంచెం స్పార్క్ ఉన్నా, సిన్సియర్‌గా... 'కొంచెం స్మార్ట్‌'గా... ప్రయత్నిస్తే - ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఆ 'ఒక్క చాన్స్' దొరుకుతుంది. 

ఆ తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు... ఆ మొదటి చాన్స్‌తో మరిన్ని అవకాశాలు ఎలా సంపాదించుకొంటారు, ఆ తర్వాత కూడా ఫీల్డులో ఎలా కొనసాగుతారు... ఇలాంటివంటివన్నీ ఒక్కొక్కరి పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 

కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఏది ఏమైనా సరే అనుకున్న లక్ష్యం నుంచి ఫోకస్ మరల్చకపోవడం... వంటి కొన్ని బేసిక్ లక్షణాలు అందరికీ ఒకలా ఉండవు. నిజానికి, 99 శాతం మందికి ఈ లక్షణాలు అసలుండవు. 

కాని, ఇవే ఏ ఫీల్డులో అయినా పైకిరావడానికి చాలా ముఖ్యం. సినీ ఫీల్డులో మరీ ముఖ్యం. 

ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత ఉండే ఆ ఒక్క శాతం మంది మాత్రమే విన్నర్స్ అవుతారు. వీరిలో కొంతమంది... కనీసం ఆ ట్రాక్‌లోనైనా ఉంటారు. 

ఇందాకే చెప్పినట్టు, ఒక్క సినిమా ఫీల్డు అనే కాదు... ఏ ఫీల్డులో అయినా సరే, విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్‌లోనే ఉంటారు. 

No comments:

Post a Comment