Tuesday 5 March 2024

ఇంత దానికి... చచ్చేదాకా అన్నన్ని కష్టాలు పడాలా?!


మా అతి దగ్గరి బంధువు ఒకరు, మొన్న రాత్రే ఆకస్మికంగా చనిపోయారు.

ఇది నేనసలు ఊహించని సంఘటన. 

నిన్న సాయంత్రం దహనసంస్కారాలు జరిగాయి. 

ఆయనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నన్ను విపరీతంగా ఇంకా బాధిస్తున్నాయి. గత ముప్పై ఏళ్ళుగా, ఆయన నన్నెప్పుడూ గౌరవంగా ప్రేమగా పలకరించేవారు. రెండు వారాల క్రితమే - ఆయన, వాళ్ళ కుటుంబమంతా మా ఇంటికొచ్చారు. రాత్రి అందరం కలిసి భోజనం చేశాం.

ఆరోజు కూడా నాతో ఎంతో బాగా మాట్లాడారాయన. 

జస్ట్ న్యూమోనియా కంప్లైంట్‌తో హాస్పిటల్‌కు తీసుకెళ్ళిన పదిహేను నిమిషాల్లోనే చనిపోయారాయన. 

లైఫ్ అలా ఉంటుంది...

కట్ చేస్తే -   

మొన్నటిదాకా మన మధ్యే ఉన్న ఒక మనిషి చనిపోయి కొన్ని గంటలే అయింది. 

24 గంటలూ అతన్ని తల్చుకొంటూ అందరూ ఏడుస్తూనే కూర్చోవాలని కాదు. కాని, అతి దగ్గరివారిలోనైనా, అంత పెద్ద విషాదం క్షణాల్లో ఎలా ఆవిరైపోగలిగింది? 

దాదాపు అందరూ నార్మల్‌గా ఉన్నారు. స్మశానంలో కూడా, ఒకవైపు ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది... మరోవైపు, గుంపులు గుంపులుగా ఉన్న కొందరు నవ్వుకొంటూ ఏదేదో మాట్లాడుకొంటున్నారు! 

స్మశాన వైరాగ్యాన్ని కూడా అనుభవించనీయరా వీళ్ళు?

చచ్చిపోయిన తర్వాత ఎవరి పరిస్థితైనా ఇంతే కదా? 

ఇంత దానికి చచ్చేదాకా, అన్నన్ని కష్టాలు పడాలా?! 

ఎంత నాన్సెన్స్...  

No comments:

Post a Comment