Wednesday 2 April 2014

100,000 హిట్స్ సాధించడం ఎలా?

సుమారు 6 నెలల క్రితం అనుకుంటాను. నా "నగ్నచిత్రం" బ్లాగ్‌కి హిట్స్ మీటర్ తగిలించాను. అప్పుడే అనుకొన్నాను - డిసెంబర్ 31 నాటికి ఓ లక్ష హిట్స్‌ని రీచ్ అవ్వాలని.

నిజానికి, వెరీ యాక్సిడెంటల్‌గా ఈ బ్లాగ్‌ని నేను ప్రారంభించింది 2012 లోనే (ఆగస్ట్ 21). అయినా, దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ రాస్తూపోయాను. అలాగే కొంతకాలం ముందుకు కదిలిందీ బ్లాగ్.

మధ్యలో.. అసలు బ్లాగ్‌కి ఈ "నగ్నచిత్రం" పేరేంటి అన్న చర్చకూడా నా మిత్రుల్లో/రీడర్స్‌లో వచ్చింది. చివరికి అందరూ దీనికే వోటేయటంవల్ల చివరికి ఇదే పేరు బ్లాగ్‌కి స్థిరపడింది. ఈ పేరుతోనే బ్లాగ్ ఎంతోకొంత పాప్యులర్ అయింది.

తర్వాత తర్వాత.. నా వ్యక్తిగత సృజనాత్మక నేపథ్యం, ఇతర కారణాల దృష్ట్యా - ఫేస్‌బుక్, ఈ బ్లాగ్‌లే నాకు అత్యంత దగ్గరి ఆత్మీయ మిత్రులయ్యాయి.

రెంటినీ కొంచెం సీరియస్‌గా తీసుకోవడం మొదలెట్టాను. రెంటికీ కలిపి, సగటున, రోజుకు ఓ 30-40 నిమిషాలు విధిగా కెటాయించడం మొదలెట్టాను.

థాంక్స్ టూ మై ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజ్, ట్విట్టర్, బ్లాగ్.. నేను కోరుకొన్న మానసిక ప్రశాంతత, ఏకాంతం, క్రియేటివ్ ఫ్రీడమ్ నాకు దొరికాయి.

నానా రకాల ఉద్యోగవ్యాపార ప్రయత్నాల్లో, పనుల్లో, వత్తిడిలో.. ఇవన్నీ అంతకు ముందు నేను పోగొట్టుకున్నాను కాబట్టి, వీటి విలువేంటో నాకు ఇప్పుడు బాగా తెలుసు.

కట్ టూ హిట్స్ మీటర్ - 

ఓ ఆరు నెలల క్రితం ఎందుకో ఉన్నట్టుండి బ్లాగ్‌కి హిట్స్ మీటర్ పెట్టాలనిపించి పెట్టాను. అది పెడుతూ, మొన్నటి డిసెంబర్ 31 లోపు లక్ష హిట్స్ సాధిస్తానని ఓ బ్లాగ్ పోస్ట్ కూడా రాసినట్టు గుర్తు. 

అయితే.. నేననుకున్నట్టుగా, మొన్నటి డిసెంబర్ 31 నాటికి 100,000 హిట్స్ సాధించలేకపోయాను. కారణం మళ్లీ నా నిర్లక్ష్యమే. ఎలాగయితేనేం.. ఓ మూడు నెలలు ఆలస్యంగానయినా, సరిగ్గా మొన్నటి మార్చ్ 31 నాటికి అది సాధ్యమైంది.

అదీ .. శ్రీ జయ ఉగాది రోజు!

ఈ సందర్భంగా నా బ్లాగ్ పాఠకమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ "థాంక్స్" చెప్పడం నా విధి. థాంక్ యూ వన్ అండ్ ఆల్..

కట్ టూ నా "లెర్నింగ్ బై బ్లాగింగ్!" -

బై ది వే, బ్లాగింగ్ ద్వారా చాలా నేర్చుకున్నాను. ఎలాంటి పోస్ట్స్ రాస్తే "హిట్స్" ఎక్కువ వస్తాయి, ఎలాంటి పోస్ట్స్ రాస్తే "తిట్స్" ఎక్కువ వస్తాయన్నది నాకిప్పుడు బాగా తెలుసు. 

ఇప్పుడంతా ఎక్కువగా ఏదేదో టిట్‌బిట్స్ తరహాలో ప్రతి చెత్తా రాస్తున్నాను. కాని, కొన్ని నెలల తర్వాత మాత్రం ఇదే బ్లాగ్‌లో.. స్పిరిచువాలిటీ-ఉరఫ్-స్పిరిట్ సైన్స్ గురించే నేను ఎక్కువగా రాయాలనుకుంటున్నాను. 

స్పిరిచువాలిటీ అనగానే ఓ భయపడిపోనక్కర్లేదు. నేను ఏది రాసినా, ఇంతే సులభమైన రీడబిలిటీ ఉంటుంది. ఇదే లైటర్‌వీన్ శైలి ఉంటుంది.  మళ్లీ వచ్చే ఉగాది నాటికి ఇదే హిట్స్ మీటర్ 1,000,000 అంకెను కూడా తాకవచ్చు. అదేమంత గొప్పవిషయం కాదు.

కట్ టూ నా సృజనాత్మక ప్రపంచమ్ -

నిజానికి.. ఇప్పుడయినా, అప్పుడయినా, ఎప్పుడయినా.. నా టార్గెట్ "హిట్స్" కాదు.  నా సృజనాత్మక ప్రపంచం.

నా సృజనాత్మక ప్రపంచమే నా జీవితం. ఆ జీవితమే నాకు ముఖ్యం. ఆ జీవితం కోసమే ఈ జీవితం.

పైవన్నీ ఎలా ఉన్నా.. ఒక గొప్ప విషయం మాత్రం అనుభవపూర్వకంగా తెల్సుకున్నాను. ఒక్క బ్లాగ్ ఉంటే చాలు. ఏదయినా సాధించవచ్చు.

అది నేను కోరుకొనే సృజనాత్మక ఏకాంతం కావొచ్చు. ఆ సమయంలో నాకు వచ్చే ఆలోచనలు కావొచ్చు. డబ్బూ కావొచ్చు. మరేదయినా జీవితాకర్షణ కావొచ్చు. ఇవన్నీ కాకుండా.. నేనెన్నడూ ఊహించనివిధంగా, టోటల్ స్పిరిచువాలిటీ వైపు నన్ను నేను ట్రాన్‌సిషన్ చేసుకోవడం కావొచ్చు. 

ఇదంతా నా "బ్లాగింగ్" అనే ఒకే ఒక్క అలవాటువల్లనే సాధ్యమైంది. 

1 comment: