Wednesday 23 April 2014

ఈ రాజకీయాలు మనకెందుకు?

ప్రత్యక్ష రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు, మన లాంటి వాళ్ళు చాలా సులువుగా ఉపయోగించే మాటలు ఇవి. విచిత్రం ఏంటంటే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ అలోచన దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

రాజకీయ నాయకులు, వాళ్ళ సన్నిహితులు, సహచరులు మాత్రం అదే లోకం అన్నట్టు ఉంటారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకోసం ఏమైనా చెయ్యటానికి వెనకాడరు. రాష్త్ర విభజన లాంటి పెద్ద విషయం లో కూడా నాయకులు వారి రాజకీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వటం మనం చుస్తూనే ఉన్నాం.    

ఈ రెండు వైరుధ్యమైన అలోచనల మధ్య కొంచెం సామాజిక స్పృహ ఉన్నవాడు మానసికంగా నలిగిపొతూ ఉంటాడు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి మనం రాజకీయాల్ని అసహ్యించుకుంటున్నాం గాని, ప్రజాస్వామ్యం లో రాజకీయాలు చాలా పవిత్రమైనవి. ఎన్నికల ద్వారా అభ్యర్థుల్ని వడపోసి, మంచి పాలకుల్ని ఎన్నుకొనే అవకాశాన్నిస్తాయి రాజకీయాలు. దీన్ని మనం మర్చిపోతున్నాం. 

నిరాశ నిస్పృహలతో  రాజకీయాలకి దూరంగా ఉండి మనం సాధించేది ఏం లేదు, రాజకీయాల్లో.. ఇంకా విశ్రుంఖలత్వం పెంచిన వాళ్ళం అవ్వటం తప్ప.

మనం గట్టిగా కళ్ళు మూసుకుంటే మనల్ని అంటుకోకుండా మాయమైపోవు రాజకీయాలు.

ఎందుకంటే.. పొద్దున్నే తాగే పాల దగ్గర నుంచి, రాత్రి పడుకునే పరుపు దాక.. మన జీవితాల్లో అన్నీ రకరకాల రాజకీయాలకి ముడి పడే ఉంటాయి. కళ్ళు తెరిచి మార్చే ప్రయత్నం చెయ్యటం తప్ప మనకి వేరే దారి కూడ లేదు. అన్నీ ఫ్రీగా పంచేస్తాం అనే వాళ్ళని కాకుండా.. కాస్త అవగాహన, చిత్తశుద్ది ఉన్న వాళ్ళని అధికారం లోకి పంపించటం మన బాధ్యత.

మన దేశంలో రాజకీయ ప్రక్రియ ద్వార ఏర్పడిన ప్రభుత్వాలు చిత్తశుద్ధి తో చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి - కుటుంబ నియంత్రణ, పోలియో నివారణ, హరిత విప్లవం, శ్వేత విప్లవం, విడీఐఎస్ - ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. తల్చుకుంటే చెయ్యగల సత్తా ఉంది మన ప్రభుత్వాలకి.

ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులు పెర్ప్ఫార్మెన్స్ లో పోటీ పడటం, బాగా పని చేసిన వాళ్ళని జనాలు మళ్ళీ గెలిపించటం ఒక మంచి పరిణామం.  

అయితే తక్కువలో తక్కువగా మనం ఏం చెయ్యొచ్చు?

కనీస రాజకీయ అవగహన పెంపొందించుకోవచ్చు. ఉన్నంతలో మంచి నాయకుడిని ఎన్నుకోటానికి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వెయ్యొచ్చు. ఓటు వెయ్యమని మనకి తెలిసిన వాళ్ళని ప్రోత్సహించొచ్చు. మనకి తెలిసిన విషయాల్ని పది మంది తో పంచుకోవచ్చు. పిల్లలకి రాజకీయాల్ని ఒక భూతంలా కాకుండా సమాజాన్ని మార్చే  ఒక ఆయుధంలా పరిచయం చెయ్యొచ్చు.

దేశ భవిషత్తునీ, మన భవిషత్తునీ శాసించే  సత్తా ఉన్న రాజకీయాల మీద ద్వేషం నింపుకోకుండ ఓపిక పట్టొచ్చు. మనం ప్రత్యేకంగా సమాజానికి ఏమి చెయ్యలేకపొయినా కనీసం నష్టం చెయ్యకుండా బ్రతకొచ్చు.

మన జీవితాల్ని అణువణువునా ప్రభావితం చేసే ఈ రాజకీయాలు మనకి కాక మరెవ్వరికి? మనం, మన ఊరు, మన దేశం, మన రాజకీయం. 2014 ఎన్నికల్లో ఓటుతో మొదలు పెడదాం ..

-- భరత్ బెల్లంకొండ  

1 comment:

 1. 2014 ఎన్నికల్లో ఓటుతో మొదలు పెడదాం ..

  It implies that who ever written this article, is voting first time in 2014

  Because it is first time you may feel that some thing may happen if we vote"KOTHA PITCHODU PODDERAGADU" ani saametha

  but the people who voted since last 5 elections might feel that who ever was given chance if indira, vajpayee, sonia, manmohan etc., our lives are effected in same way - no change

  what happened to aaap. vesam... ekkaaru.... digaaru.... no change.

  if we feel that some body is doing good like YSR ..... now it seems he has done extreme bad

  so మనం, మన ఊరు, మన దేశం, మన రాజకీయం..............

  above all ...family. If every body maintain good family, all good families .... good village.... good district... good state.... good country..... but never good politics. all ways bad politics... and bad family politics. gandhi family,, nandamuri family, naaraa family, kalvakuntla family, konidela family, ... any new family seems good at begining but ends with worst politics.

  Hence, KUKKA TOKA VANKARE.......

  ReplyDelete