Thursday 17 April 2014

ఒక పొలిటికల్ ఎంట్రీ ..

యూనివర్సిటీరోజుల్లోని నా హాస్టల్‌మేట్/మిత్రుడు ఒకతను ఆ మధ్య ఉన్నట్టుండి పాలిటిక్స్‌లో చేరిపోయాడు.

ఇన్స్‌పిరేషన్ చిరంజీవి!

హాయిగా తను చేసుకుంటున్న మంచి ఉద్యోగం వదిలేసి మరీ ఆ కొత్త పార్టీలో, కొత్త ఉత్సాహంతో దిగాడు. మనస్పూర్తిగా, బాగా రెచ్చిపోయి మరీ పనిచేశాడు.  ఏ టీవీ ఛానెల్లో చూసినా అతనే! కొద్దిగా సంతోషించాను.

కట్ చేస్తే - 

ఆ పార్టీ అధినేత అనుకున్నది జరక్క, తర్వాత ఆ పార్టీ భారాన్ని మోయలేక, దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ గంగలో కలిపేశాడు.

ఆ రోజు ఆ పార్టీ ఆవరణలో నా మిత్రుడు పడిన బాధ, అరిచిన అరుపులు, చుట్టూ అతన్ని ఎందరో పట్టుకొని ఆపుతున్న సీను.. దాదాపు అన్ని టీవీ ఛానెళ్లలో చూశాను. కొంత కలతచెందాను.

కట్ చేస్తే - 

నా మిత్రుడు టీఆరెస్‌లో చేరిపోయాడు. ఇక్కడా అంతే. మనస్పూర్తిగా, చాలా చాలా కష్టపడి పనిచేశాడు. ఏ ఛానెళ్లో చూసినా పార్టీ తరపున గొంతెత్తి మాట్లాడింది అతనే.

కానీ, మళ్లీ పాత కథే రిపీటయ్యింది. ఈ పార్టీ అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు! ఇది నా మిత్రుడు అస్సలు ఊహించని విషయం..

అయితే అంతకు ముందు రోజే పార్టీలో చేరినవాళ్లకు, అంతకు ముందు వేరే పార్టీలో ఉండి ఆ పార్టీని బాగా తిట్టిపోసినవాళ్లకు మాత్రం టిక్కెట్లొచ్చాయి. అది వేరే విషయం.

ఇంతకీ నా మిత్రునికి ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం - నా మిత్రుడి కులం వాళ్లు ఎక్కువమంది లేరట! బయటకు చెప్పిన ఈ కారణం నిజం కాదన్నది ఓ పెద్ద నిజం. చాలా సిగ్గుపడ్డాను.

తర్వాతేం జరిగే అవకాశం ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు. "కట్ చేస్తే" అంటూ బోర్ కొట్టనక్కర్లేదు.

నా మిత్రుడు కూడా తిరిగి తిరిగి.. చివరికి అందర్లాగే ఆ "రామ్ తేరీ గంగా మైలీ"లో కలిసిపోయాడు. అక్కడ కూడా నా మిత్రుడు అంతే మనస్పూర్తిగా, అంతే రెట్టించిన ఉత్సాహంతో, ఇంకెంతో కసితో పని చేస్తున్నాడని నా నమ్మకం. ఎంతయినా.. బాగా చదువుకొని పిహెచ్‌డి కూడా చేసినవాడుకదా పాపం!

అయితే చివరికి మళ్లీ అక్కడ కూడా ఏం జరుగుతుందో మనం చెప్పలేం. మనవాడు కూడా బహుశా తెలుసుకోవాలనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటికే మనవాడు ఆ వాతావరణానికీ, ఆ పవర్ ప్యాషన్‌కు, ఆ లావాదేవీలకు.. బాగా అలవాటుపడిపోయాడు.

దటీజ్ పాలిటిక్స్!  

1 comment:

  1. The person whom you are talking about with out mentioning name
    has changed party from prajarajyam to trs not because chiranjeevi merged with congress. Well before the merging, that person changed party because prajarajyam started slogan "SAMAIKYANDRA". So that person Doctor Sh Sh Sh........ changed to trs well before merging.

    ఆ రోజు ఆ పార్టీ ఆవరణలో నా మిత్రుడు పడిన బాధ, అరిచిన అరుపులు, చుట్టూ అతన్ని ఎందరో పట్టుకొని ఆపుతున్న సీను.. దాదాపు అన్ని టీవీ ఛానెళ్లలో చూశాను. కొంత కలతచెందాను.

    Yes it was not for merging but for changing status on telangana.

    one more important thing is that Doctor Sh.... contested with ticket from prajarajyam in Secunderabad.

    So "Story repeats..." is wrong I think.
    కానీ, మళ్లీ పాత కథే రిపీటయ్యింది

    though prajarajyam gave ticket to that doctor he did not accept the policy changes of party.I hope KCR understood this and might felt that he follows not party but follows his own wishes .... he might not given ticket(hahha ha...)

    ReplyDelete