Sunday 6 April 2014

(అ) శాస్త్రీయ సర్వేలా? ష్యూర్‌ఫైర్ బెట్టింగులా?

పాలిటిక్స్, పొలిటికల్ పవర్ పుణ్యమా అని శాస్త్రీయ సర్వేల్లోని ఈ "శాస్త్రీయ" అన్న పదాన్ని తొలగించాల్సి వస్తోంది.

ఒక్కో పార్టీ ఒక్కో సర్వే కంపెనీతో తనకు పాజిటివ్‌గా ఉండే విధంగా సర్వే రిజల్ట్స్ తయారుచేయించుకొని .. దాన్నే ప్రెస్‌లో, ప్రజల్లో టాంటాం చేసుకుంటోంది.

అయితే ఇప్పుడు జనాలు అందరికంటే తెలివైనవాళ్లయ్యారు. వాళ్ల అసాధారణ మేధస్సు ముందు ఈ స్టాటిస్టిక్స్ స్పెషలిస్టులు, పొలిటీషియన్స్ అంతా ఎందుకూ పనికిరారని చెప్పడానికి నేనేమాత్రం సందేహించడంలేదు.

ఈ నేపథ్యంలో.. మన రొటీన్ మైండ్‌సెట్‌లను కాసేపు పక్కనపెడితే చాలు. మనకు అత్యంత నమ్మకమైన, అవినీతిరహిత సర్వే కంపెనీ ఒకే ఒక్కటి కళ్లముందు కనిపిస్తుంది. అదే బెట్టింగ్!

పొలిటికల్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ లాంటిది కాదు. ఇక్కడ బెట్టర్స్ (జనం) ఏ పార్టీ మీద-లేదా-ఏ వ్యక్తి మీద ఎక్కువ డబ్బు కాస్తున్నారో అదే పార్టీ-లేదా-ఆ అభ్యర్థే గెలిచే చాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. గెలుస్తారు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా జరిగే చట్టవ్యతిరేక దందాలు.

ఈ దందాల్లో నమ్మకమే బాగా పని చేస్తుంది.

పొలిటికల్ బెట్టింగులు ప్రస్తుతం ఇలా ఉన్నాయి (ట)!:

> నగ్మా గెలుస్తుందా గెలవదా?
> రోజా ఈసారయినా విజయ పతాకం ఎగరేస్తుందా?
> షర్మీలా పాదయాత్ర ఫలించి ఎంపి అవుతుందా లేదా?
> కల్వకుంట్ల కవిత విన్నా.. రన్నా?
> ఫ్యాన్ గాలి నిజంగా వీస్తుందా?
> చెయ్యి ఉంటుందా ఊడుతుందా?
> చెప్పులు తెగిపోతాయా, అసలుంటాయా?
> కారు స్పీడెంత?
> తర్వాతి పీఎం మోడీనా, రాహుల్ గాంధీనా? ..

మరో చిన్న ఉదాహరణ ..

నేను విన్నదాని ప్రకారం.. ఇంటర్‌నెట్‌లో ఫ్లోట్ అవుతున్నదాని ప్రకారం.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ మీద బెట్ కడ్తే 100 కి 200 ఇస్తున్నారు. అదే మోడీ పేరు మీద అయితే 100 కి 120 బెట్టింగ్ ఉంది!

అంటే మోడీనే ప్రధాని అవుతున్నడనేగా దీనర్థం?

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

ఈ ఎలెక్షన్ సీజన్లోని ఒకే ఒక్క నెలలో - మన దేశంలోని బెట్టర్లతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భారతీయ బెట్టర్లు కూడా పాల్గొంటున్న ఈ పొలిటికల్ బెట్టింగ్‌లో జరుగుతున్న లావాదేవీల అంకె ఎంతో మీరు గెస్ చేయగలరా?

అక్షరాలా 5 లక్షల కోట్లు!

ఏం చెప్తాం? అంత డబ్బుతో ఎన్ని మంచి పనులను చేయవచ్చు? ఎన్ని పాజిటివ్ అద్భుతాల్ని సృష్టించవచ్చు?

అంత ఆలోచన మనకేదీ?

No comments:

Post a Comment