Thursday 5 January 2023

ఒక లీ క్వాన్ యూ, ఒక కేసీఆర్!


గత 8 సంవత్సరాల్లో టీఎస్‌ఐపాస్‌, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. 

కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలోనే ఇది సాధ్యమైనప్పుడు - అదే 8 ఏళ్ళ సమయంలో - దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన అన్ని దేశాలు చుట్టివచ్చిన ప్రధాని మోదీజీ నేతృత్వంలో కనీసం ఇంకో వంద రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఈ దేశానికి వచ్చి తీరాలి. 

కాని, వాస్తవం మరోలా వుంది. 

ఉన్న విదేశీ కంపెనీలు పోతున్నాయి. లక్షల మంది భారతీయులు విదేశాలకు వలసపోతున్నారు.  

కట్ చేస్తే - 

రెండే రెండేళ్ళలో మేం దేశమంతా కరెంటు ఇస్తాం, నీళ్ళూ అందిస్తాం అని తిరుగులేని సవాల్ విసురుతున్నారు కేసీఆర్. 

తెలంగాణలో సాధ్యమైన రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటివి యావత్ దేశంలోనూ ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నకు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వం నడిపిస్తున్నవారివద్ద జవాబు లేదు. వారి ఫాలోయర్స్, అభిమానుల దగ్గర కూడా - మతిస్థిమితం తప్పిన ఒకానొక మందమెంటాలిటీ ఉపయోగించే వాట్సాప్ ఆయుధం తప్ప వాస్తవాన్ని చెప్పే అధికారిక గణాంకాలు లేవు.  

ఎంతసేపూ రాజకీయాలే కాదు. ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువకాకుండా అన్నిరకాల వనరులుండి కూడా, సిగ్గుచేటైన విధంగా 75 ఏళ్ళుగా ఇంకా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం"గానే ఉన్న మన దేశాన్ని ఒక సింగపూర్ లాంటి ధనికదేశంగానో... అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల సరసననో చేర్చగల విజన్, సత్తా ఉన్న నాయకుడు ఇప్పుడు మన దేశానికి కావాలి. 

ఇది డిజిటల్-సోషల్ యుగం. మనిషి జీవితంలోని అన్ని కోణాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పు మన దేశంలోని రాజకీయాల్లో కూడా రావాల్సిన సమయం వచ్చేసింది. 

అలాంటి ఒక గుణాత్మక మార్పు కోసం - మరోసారి మరొక మహోజ్వల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు మన కేసీఆర్ కావడం మనం గర్వించాల్సిన విషయం.  

కేసీఆర్‌కు అవసరమైన స్థాయిలో మెదళ్లను ఉపయోగించి, ఈ మహాయుద్ధం విషయంలో ఆయనకు అవసరమైన తోడ్పాటుని అందించగల విద్యావంతులు, రచయితలు, మేధావులు ఆయన పిలుపు కోసం యుద్ధక్షేత్రంలో సైనికుల్లా సర్వదా సిధ్ధంగా ఉన్నారు.    

దేశ రైతాంగంలోనూ, ఇతర అన్ని రంగాల్లోనూ తెలంగాణ మాడల్ అభివృద్ధి...,  ఈ దూకుడు, ఈ మార్గదర్శకత్వం... జాతీయస్థాయిలో రావటం కోసమే ఇప్పుడు కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞం... బీఆర్‌యస్ అని ఇప్పుడు దేశమంతా స్పష్టమైంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఢిల్లీలో కేసీఆర్ పెట్టబోయే ఒక్క ప్రెస్ మీట్‌తో మరింత విస్పష్టమౌతుంది.     

బీఆర్‌యస్ విస్తరణ ఏపీ నుంచే ఆరంభం కావడం విశేషం. 

బీఆర్‌యస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తోట చంద్రశేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. 

6 comments:

 1. >>"మతిస్థిమితం తప్పిన ఒకానొక మందమెంటాలిటీ ఉపయోగించే వాట్సాప్ ఆయుధం తప్ప "

  I appreciate you

  ReplyDelete
 2. ఆర్యా,
  "తెలంగాణలో సాధ్యమైన రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటివి యావత్ దేశంలోనూ ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నకు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వం నడిపిస్తున్నవారివద్ద జవాబు లేదు." అంటున్న మీకు "దేశ రైతాంగంలోనూ, ఇతర అన్ని రంగాల్లోనూ తెలంగాణ మాడల్ అభివృద్ధి..., ఈ దూకుడు, ఈ మార్గదర్శకత్వం... జాతీయస్థాయిలో రావటం కోసమే ఇప్పుడు కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞం... బీఆర్‌యస్ అని ఇప్పుడు దేశమంతా స్పష్టమైంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఢిల్లీలో కేసీఆర్ పెట్టబోయే ఒక్క ప్రెస్ మీట్‌తో" స్పష్టత వచ్చేస్తుందని ఏలా అంటున్నారు?

  మన దేశం అనుసరిస్తున్న ఋణ ఆధారిత ఆర్ధికచట్రం యొక్క విశిష్టత ప్రకారం "మన దేశాన్ని ఒక సింగపూర్ లాంటి ధనికదేశంగానో... అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల సరసననో చేర్చగల విజన్, సత్తా ఉన్న నాయకుడు" చేసేది కూడా IMF నుంచి మనం తెచ్చుకుంటున్న అప్పుని ఇంకా పెనచహ్టమే అని మీకు తెలియడం లేదు కాబట్టే మోదీ కన్న కేఅసీయారు గొప్ప ప్రధాని అవుతాడని మీరు భ్రమపడుతున్నారు.

  1).1926 నాడు Dr. B R Ambedkar మహాశయుడి సలహాలూ సూచనలూ నిర్దేశకాలను అనుసరించి 1934 నాటికి ₹50 million మొత్తాన్ని authorized capital కింద జమచేసి బ్రిటిష్ సామ్రాజ్య వాదులు ప్రైవేట్ బ్యాంకు వలె ఏర్పాటు చేసిన Reserve Bank of India అనే ఒక బ్యాంకుని 1949 నాడు భారత్ ప్రభుత్వానికి స్వాధీనం అయిన తర్వాత చాలా కాలానికి,అంటే నేటి 2022 మార్చి 31 నాటికి Rs. 17,080 Crore మాత్రమే Paid-Up Capital ఉన్నప్పుడు 2022-23 సంవత్సరపు బడ్జెట్ దేశప్రజల కోసం ఖర్చు చెయ్యాలని చెప్పిన Rs 39,44,909 Crore విలువకి సమానమైన పేపర్ కరెన్సీని బాండ్ల రూపంలో ప్రభుత్వాలకి ఇస్తున్న చెక్కులు వినియోగదారులు ప్రైవేట్ బ్యాంకులకి ఫ్రాడ్ చెక్కులకు సమానం అవుతాయి కదా?
  2).ఒక ప్రైవేటు బ్యాంకు తన సేవలను పొందుతున్న వినియోగదారులకు ఫ్రాడ్ చెక్కులు ఇవ్వటం న్యాయమే గానీ సేవలను అందుకుంటున్న వినియోగదారులు ప్రైవేట్ బ్యాంకులకి ఫ్రాడ్ చెక్కు ఇస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుంది - ఎంత దుర్మార్గం ఇది?అది కూడా న్యాయమే అని భావించినది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే!
  3).ఇవి ఆర్ధికశాస్త్రం యొక్క లోతైన సూత్రీకరణలు కాబట్టి ఇప్పటికీ మీకు మనం ఉన్న వ్యవస్థలోని దుర్మార్గం ఏమిటో అర్ధం కాకపోవడం సహజమే!అందుకోసం నేనొక ఉదాహరణ చూపిస్తాను.రిజర్వ బ్యాంక్ ఒకటే కాదు,ఇప్పటికి మీరొక ప్రైవేటు బ్యాంకు దగ్గిర 1000 రూపాయలు లోను కోసం వెళితే వాళ్ళు మీకు ఇస్తున్న 1000 రూపాయల నోట్లకి సరిపడిన మూలధనం ఆ బ్యాంకు యజమాని అధీనంలో లేకపోయినా ఆ 1000 రూపాయలు అతను మీకు అప్పు ఇవ్వగలడు కాబట్టి మీరు గతంలో ఒక బ్యాంకు లోను తీసుకుని దాన్ని తీర్చిన కధని గుర్తు చేసుకోండి.

  01-01-2022 నాడు మీరు ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు.అదే మీకు తెలిసిన వ్యక్తి నుంచి తీసుకుంటే ఒక నోటు మీద సంతకం చాలు.కానీ,బ్యాంకు వారికి మాత్రం మీ స్థానికత నుంచి ఆదాయ వనరుల వరకు గల సమస్త వివరాల్నీ గవర్నమెంటు రికార్డుల నుంచి తెచ్చి ఇస్తారు.కానీ, అతని వైపు నుంచి అతను ఇస్తున్న 1000 రూపాయలూ అతనికి గతంలో అతను కష్టపడి సంపాదించిన న్యాయార్జితం నుంచే ఇస్తున్నాడు అన్న హామీపత్రం మాత్రం ఇవ్వడు,ఎందుకని?

  అవసరం మీది కాబట్టి మీరు అడగరు,కానీ ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇచ్చింది?ప్రభుత్వం ఆ అనుమతి ఇవ్వడం వల్ల ఇక్కడ జరుగుతున్నది ఏమిటి?ఆ xyz bank యొక్క మూలధనం 01-01-2022 నాటికి కేవలం 100 రూపాయలు మాత్రమే ఉన్నప్పటికీ మీకు 1000 రూపాయలకి సరిపడిన కరెన్సీ నోట్లనీ ఇచ్చేసింది.సరే,మీరు ఆ బ్యాంకు దగ్గిర 01-01-2022 నాడు తీసుకున్న లోనుని 01-04-2022 నాడు వడ్డీతో కలిపి 1500 రూపాయల అప్పుని తీర్చేశారు.ఇంతకీ మొత్తం కధలోని ట్విస్ట్ ఏంటంటే, జనవరిలో కేవలం 100 మాత్రమే తన దగ్గిరున్న ఆ బ్యాంకర్ మీకు అప్పిచ్చిన 1000 రూపాయలూ ఏప్రిల్ నాటికి 1500 రూపాయల బ్యాంకు అప్పు తీర్చి కొంత మిగుల్చుకున్న మీ కష్టార్జితమైన 2000 రూపాయల లోనివే!

  కేసీయార్ ప్రధాని అయితే రిజర్వ్ బ్యాంక్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి ఫ్రాడ్ చెక్కులు ఇవ్వటాన్ని ఆపగలడని మీరు అనుకుంటున్నారా?"ఒక ప్రైవేటు బ్యాంకు తన సేవలను పొందుతున్న వినియోగదారులకు ఫ్రాడ్ చెక్కులు ఇవ్వటం" అనే దుర్మార్గాన్ని నియంత్రించగలడా కేసీయార్!

  కేసీయార్ ఏదో ఆకాశం నుంచి దిగివచ్చిన లోకరక్షకుడు అంటున్నారే,తెలంగాణని ఈ మోసకారి పధ్ధతిలో గాక న్యాయమైన పాలనతో ఉధ్ధరించగలిగాడా?ఈ మోసకారి పధ్ధతినే ఫాలో అవ్వాలంటే మోదీ ఫాలో అవుతూనే ఉన్నాడు కదా!ఇది కాకవేరే మొఏడల్ కేసీయార్ దగ్గిర కూడా లేదు.ఉంటే రాష్ట్ర స్థాయిలో అలాగేపరిపాలించి అద్భుతాలు చూపించేవాడు.మరి రాష్ట్ర స్థాయిలో మిడకలేనివాడు దేశ స్థాయిలో ఏమి ఉధ్ధరిస్తాడు?

  ఆర్ధికం గురించీ అభివృధ్ధి గురించీ చెప్పేవాళ్ళు వ్యక్తులకి భజన చెయ్యకూడదు.శాస్త్రాన్ని చెప్పాలి.

  జై శ్రీ రాం!

  ReplyDelete
  Replies
  1. "కేసీయార్ ఏదో ఆకాశం నుంచి దిగివచ్చిన లోకరక్షకుడు అంటున్నారే.."

   ఆర్యా!

   సబ్జెక్ట్ మాత్రమే రాయండి. నేను అనని మాటల్ని పై విధంగా నాకు ఆపాదించకండి.

   థాంక్యూ ఫర్ యువర్ కామెంట్.

   ఇంత పెద్దగా మీరు రాసిన శాస్త్రానికి నేను 2 వాక్యాల్లో సమాధానమిస్తాను. మీరు చెప్తున్న శాస్త్రమంతా నేనిక్కడ కామెంట్స్‌లో రాయలేను. మన్నించాలి.

   1. మీ శాస్త్రాన్ని పక్కనపెడదాం కాసేపు. గత ఎనిమిదిన్నర ఏళ్ళలో తెలంగాణ దేశంలోనే ఒక మాడల్ స్టేట్‌గా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. ఆ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వంలోని అధికారిక సంస్థలు, మంత్రిత్వ శాఖలే చెప్తున్నాయి. నేను కాదు. 67 ఏళ్ళుగా ఎవ్వరూ చెయ్యనివి ఎన్నెన్నో కేసీఆర్ చేసి చూపించాడు. అదే ఎనిమిదిన్నర ఏళ్లలో - అంతే ప్రపోర్షనేట్‌గా జాతీయస్థాయిలో అభివృద్ధి ఏం జరిగిందో మీకే తెలియాలి. సూచికలు పైకెళ్ళాయా కిందకి దిగాయా మీకే బాగా తెలుసు.

   2. అమెరికా దేశానికున్న అప్పులు ఇంకో వెయ్యేళ్ళయినా తీరవు అని ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త చెప్పారు. అ అప్పు ట్రిలియన్స్‌లో ఉంది. 75 ఏళ్ళు అయినా మనం మాత్రం ఇంకా ఒక "అభివృద్ధి చెందుతున్న దేశం" గానే ఉన్నాం! అన్ని వనరులు ఉండి! అప్పులు కూడా చేస్తూ!! అసమర్థత ఎవరిది? .. దాదాపు ఇదే సమయంలో 2 వ ప్రపంచ యుద్ధంలో బూడిదైపోయిన జపాన్ ఏ స్థాయికి ఎదిగింది? ఎలా ఎదగగలిగింది? మనవాళ్లకెందుకు చేతకాలేదు?

   ఇంక చాలా చెప్పగలను. ఇక్కడితో ముగిస్తున్నాను.

   Delete
  2. >> అమెరికా దేశానికున్న అప్పులు ఇంకో వెయ్యేళ్ళయినా తీరవు అని ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త చెప్పారు. అ అప్పు ట్రిలియన్స్‌లో ఉంది.
   అవునా అండీ? ఐతే నేను భవిష్యదర్శిని వ్యాసంలో చెప్పినట్లు ప్రపంచ రాష్ట్ర సమితి ఏర్పరచవలసిందే కేసీఆర్ గారు సమయం చూసుకొని. అక్కడా ఆయనకు గొప్పగా ఉన్నారు అభిమానులు. ఏమో ఆయన అమెరికా ప్రెసిడెంట్ ఐతే కాని అమెరికా అభివృధ్ధి చెందదేమో, ఆ అప్పులు తీరవేమో!

   Delete
  3. ఆర్యా....
   మీ సుధీర్గమైన రాతను చూసిన తర్వాత మీరు చెప్పిన ఆర్ధిక లెక్కల విధానాన్ని చూస్తే బాగా నవ్వొస్తున్నది... వేలాది కోట్ల రూపాయలను తిని బ్యాంకులను ముంచి పోయిన దొంగలను పట్టుకో చాత కావట్లేదు, మోడీ గారిని చూస్తే నవ్వొస్తున్నది... నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడికి అకౌంట్ లలో 15 లక్షలు వేస్తామని చెప్పి, ఓట్లు వేయించుకొని, అదొక ఎన్నికలు గెలవడానికి చెప్పిన పెద్ద అబద్దమని చెప్పిన అమిత్ షా మాటలను చూస్తే నవ్వొస్తున్నది.. ఎన్నికలు ఎ రాష్ట్రంలో నైనా గెలవడం చాతకాక ప్రభుత్వాలను కూల్చడం లేదా విపక్ష నాయకులమీద ED, CBI, IT, NIAలతో దాడులు చేయించి లొంగదీసుకోవడం చూస్తే నవ్వొస్తున్నది... ఇంకా చెపుతూ పోతే... జమ్మూ కాశ్మీర్ లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదం తగ్గిపోయింది అని చెప్పుకున్న బిజెపి నాయకులు, తర్వాత అక్కడ జరుగుతున్న పండిట్ల హత్యల మీద నోరు మెదపకపోవడం, పైనుంచి కాశ్మీర్ ఫైల్స్ పేరుతో సినిమాలు తీయించి మిగితా రాష్ట్రాలలో ప్రజల మధ్య విద్వేషాన్ని రగల్చాలని చూడడం బిజెపి నాయకత్వం నీచత్వానికి పరాకాష్ట...
   కేవలం ఇక్కడ కేసిఆర్ మీద ప్రజలలో విద్వేషం సృష్టించడం కోసం - కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు కోసం టిఅరేస్ పార్లమెంట్ సాక్షిగా మద్దత్తు ఇస్తే, ఆర్టికల్ 370 రద్దుకు సహకరించలేదని పచ్చి పచ్చి అబద్దం మాట్లాడటం అమిత్ షా మూర్ఖత్వం, నీచత్వానికి నిదర్శనం.. ఒక ఇద్దరు చదువు సక్కగా లేని మూర్ఖులు మతోన్మాదాన్ని ప్రజలలో నింపి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పొచ్చు... అటువంటి మూర్ఖులు మహోన్నత శిఖరమైన కేసిఆర్ ముందు అల్పజీవులు అని చెప్పగలను....bye... జై శ్రీరామ్...

   Delete
 3. @శ్యామలీయం

  ప్రపంచాన్నేకాదు, విశ్వాన్నికూడా తన అపార మేతస్సుతో ముందుకు తీసుకెల్లగలిగిన చంద్రబాబుకు ఆ సలహా ఇవ్వండి.

  ReplyDelete