Sunday, 22 January 2023

ఒక అవగాహన, గట్స్ ఉన్నవారికి ఇప్పుడు ఏదైనా సాధ్యమే!


ఇంతకు ముందైనా, ఇప్పుడైనా... నేను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను. 

దాదాపు ఎవరి విషయంలోనైనా ఇదే నిజం. కాకపోతే, వెర్షన్స్ వేరేగా ఉంటాయి షుగర్ కోటింగ్‌తో. అది వేరే విషయం.    

ఇంతకు ముందు నాకు కొన్ని పరిమితులుండేవి. ఏవేవో పనులు, బాధ్యతలుండేవి. సో, సినిమాను పెద్దగా పట్టించుకోలేదు నేను. అదెప్పుడూ ఒక సెకండరీ ఆప్షన్‌గానే ఉండేది నాకు. 

ఇప్పుడు నేను పూర్తిగా ఫ్రీ అయ్యాను.

ఇండస్ట్రీ కూడా బాగా టెంప్ట్ చేస్తోంది. కోట్లల్లో ఆదాయం. కోట్లల్లో రెమ్యూనరేషన్స్... 

బులెట్ షాట్‌లో చెప్పాలంటే - ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్... బిగ్ బిజినెస్... ఆదాయమార్గాలు భారీ లెవెల్లో  పెరిగాయి. 

ఇంతకు ముందు థియేటర్ ఎగ్జిబిషన్ మార్కెట్ ఒక్కటే ఉండేది. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ కూడా తోడయ్యాయి. కరోనా తర్వాత - వీటికి తోడు ఇప్పుడు ఓటీటీ రైట్స్, రకరకాల డిజిటల్ రైట్స్, కొత్తగా మళ్ళీ ఆడియో రైట్స్, ఇన్-ఫిలిం బ్రాండింగ్, స్పాన్సర్స్... ఇలా ఒక అరడజన్ ఇన్‌కమ్ అవెన్యూస్ పెరిగాయి. ఓటీటీలొచ్చాక, డబ్బింగ్ రైట్స్-రీమేక్ రైట్స్ వంటివి కొత్తగా ఒక ప్యాకేజీ ఇన్‌కమ్ పద్ధతికి మారాయి. 

Content is the king.
Big money is the ultimate goal.   

ఒక అవగాహన, గట్స్ ఉన్నవారికి ఇప్పుడు ఏదైనా సాధ్యమే. 

అపశకున పక్షులకు, నెగెటివ్ థింకర్స్‌కు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఏదీ సాధ్యం కాదు. అది వేరే విషయం.

కట్ చేస్తే -

ఒక చిన్న గ్యాప్ తర్వాత - ఇప్పుడు - నేనొక 2 ఫీచర్ ఫిల్మ్స్ ప్రారంభించాను. 

రెండూ పక్కా ట్రెండీ కమర్షియల్ సినిమాలు. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌లో ఎక్కువ భాగం న్యూ టాలెంటే ఉంటుంది.  

ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. క్రియేటివిటీపరంగా - ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా - ఈ రెండు సినిమాలు చేయబోతున్నాను. అంతా నా ఇష్టం. 

ఏ రిజల్ట్ అయితే నాకు అవసరమో - ఆ ఒక్కటే లక్ష్యంగా, ప్రతి చిన్న-పెద్ద అంశానికి నేనే రెస్పాన్సిబిలిటీగా, టెన్షన్-ఫ్రీగా, కూల్‌గా, ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలు చేయబోతున్నాను.

ఇంతకుముందులా సినిమా అనేది బ్యాటిల్ గ్రౌండ్ కాదు.

"బిగ్ బిజినెస్" ప్లాట్‌ఫామ్... ఓవర్‌నైట్‌లో "సెలెబ్రిటీ స్టేటస్‌"ను ఇచ్చే ప్యాషనేట్ ప్లేస్. 

ఏ బడ్జెట్‌లో సినిమా తీస్తున్నామన్నది కాదు ఇప్పుడు పాయింట్... ఏ రేంజ్‌లో డబ్బు సంపాదించబోతున్నామన్నదే అసలు పాయింట్! 

"If you want to get in the film business, get in the film business." - Daniel Craig

2 comments:

  1. Wish you the best of luck.
    You are a proven good writer.
    You would be a proven good film maker.

    ReplyDelete