Sunday 31 December 2023

100 రోజులు, 100 బ్లాగ్ పోస్టులు


నా రైటింగ్ హాబీని లైవ్‌లో ఉంచుకోవడం కోసం ఇదొక చిన్న చిట్కా లాంటిది నాపై నేనే ప్రయోగించుకున్నాను.

రోజుకు కనీసం ఒక 10 లైన్లయినా రాస్తాను. 

మిస్ కాకుండా 100 రోజులు, ఏదో ఒకటి, ఏదో ఒక టైంలో రాయాలన్నది దీని ద్వారా నేను పాటిస్తున్న ఒక రిచువల్.  

ఒక్క రోజు కూడా మిస్ కావద్దు. అయితే తర్వాతి రోజుల్లో బ్యాలెన్స్ చెయ్యాలి. 

రోజుకి 3, 4 బ్లాగ్స్ కూడా రాయొచ్చు. మొత్తానికి 100 రోజుల్లోపల 100 బ్లాగ్ పోస్టులు రాయాలి. అదీ నా రిచువల్. అదీ నా ఫోకస్. 

దీని వెనుక ఇంకో వ్యక్తిగత కారణం కూడా ఉంది. ఈ 100 రోజుల్లో ఒక ముఖ్యమైన పని నేను పూర్తిచేయబోతున్నాను. సో, దీని గురించి కూడా ఎప్పటికప్పుడు నన్ను నేను అలర్ట్ చేసుకోడానికి ఇదొక రిమైండర్ నాకు.   

కట్ చేస్తే - 

ఏదో ఒకటి రాయడం కంటే... 

ఇప్పుడెలాగూ మళ్ళీ సినిమాల్లో పడ్డాను కాబట్టి, ఆ నేపథ్యమే తీసుకొని చిన్న చిన్న టిడ్‌బిట్సో, నా అనుభవాలో రాయాలనుకున్నాను. 

రాత్రే ఇంకో ఆలోచన వచ్చింది....

ఇదే సినీ నేపథ్యం తీసుకొని, నా అనుభవాలను, నాకు తెలిసిన విషయాలను చిన్న చిన్న మైక్రో కథల రూపంలో రాస్తేనో?!    

- మనోహర్ చిమ్మని 

1 comment:

  1. కొత్త సంవత్సరం తీర్మానం చాలా బాగుంది. తప్పక రాయండి. కొంతమంది ( మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా) అని బాధ పడుతుంటారు.
    హ్యాపీ బర్త్ డే సర్ 🙏

    ReplyDelete