COACHING & CONSULTING

మనీ కావాలా? మంచి లైఫ్ కావాలా?... రెండూ సాధ్యమే!

కెరీర్, మనీ & రిలేషన్‌షిప్స్ పర్సనల్ కోచింగ్  


Build Business Around Passion.
Live Life to the Fullest.

మనీ, 
రిలేషన్‌షిప్స్… 

ఈ రెండూ బాగున్నప్పుడే జీవితంలో అన్నీ బాగుంటాయి.

సరిపోయినంత ఆదాయం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. రిలేషన్‌షిప్స్ బాగున్నప్పుడు కెరీర్-లేదా-ప్రొఫెషన్ బాగుంటుంది. మరింత బాగా మనీ సంపాదిస్తారు.

కొందరి విషయంలో ఇది రివర్స్‌లో ఉండవచ్చు. 

నిజానికి ఇదంతా మన మైండ్‌సెట్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

ఒక ప్యాషన్ కోచ్‌గా –
మనీ, రిలేషన్‌షిప్స్…
ఈ రెండు విషయాల్లోనూ
నేను మీకు సహాయపడగలను.

మనీ:
మీ ప్యాషన్ చుట్టూరా ఒక మంచి బిజినెస్ ప్రారంభించి, మీరు డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అన్న విషయంలో మీకు ప్రాక్టికల్‌గా, అప్పటికప్పుడు అమల్లో పెట్టి ముందుకెళ్లగలిగే సలహా ఇచ్చి గైడ్ చేయగలను. 

మీ దగ్గర కూడా ఎన్నో మంచి ఆలోచనలుండీ, మీ కెరీర్ విషయంలో కన్‌ఫ్యూజన్‌తో మీరు ఏదీ నిర్ధారించుకోలేకపోతున్నా సరే… నేను మీకు సహాయపడగలను.

రిలేషన్‌షిప్స్:
మీ వ్యక్తిగతం కావచ్చు, మీ వివాహబంధంలో కావచ్చు, మీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, బయట ఉద్యోగపరమైన-వృత్తిపరమైన సంబంధాల విషయంలో కూడా కావచ్చు… మీరు ఎదుర్కొంటున్న చాలెంజెస్‌ను పరిష్కరించుకోవడంలో నేను మీకు సహాయపడగలను.

మీ వయస్సు ఎంతైనా కావచ్చు. “ఇంక ఇంతే… ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది” అని మీరు అనుకోవడానికి వీల్లేదు.

మంచి ఆరోగ్యం కోసం మనం డాక్టర్‌ను ఎలాగయితే సంప్రదిస్తామో… మంచి సంపాదన, మంచి జీవితం కోసం మీకు పర్సనల్‌గా ఒక కోచ్ కూడా అంతే అవసరం.
 
వరంగల్‌లో ఒక అతిచిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చాను. మెషినిస్ట్‌గా వర్క్‌షాపుల్లో పనిచేసుకొంటూ – మళ్ళీ చదువుకొన్నాను. యూనివర్సిటీలో రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాను. రచయితనయ్యాను. రచయితగా నంది అవార్డు సాధించాను. తర్వాత ఫిలిం డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాను. చిన్న గ్యాప్ తర్వాత, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 3 సినిమాలు ప్రారంభించాను, డైరెక్ట్ చేస్తున్నాను. 2 వెబ్ సీరీస్‌లు, 2 అంతర్జాతీయ స్థాయి మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తున్నాను. 

ఇంకెన్నో చేశాను, చేస్తున్నాను, చేయబోతున్నాను…

ఎక్కడో దూరం నుంచి ఒంటరిగా సిటీకి వచ్చి, ఎవ్వరి సహాయం లేకుండా, నేనే ఈ స్థాయికి రాగలిగినప్పుడు… ఈ డిజిటల్ యుగంలో మీరు మరింత ఈజీగా ఏదైనా సాధించగలుగుతారు.

నేను జీవితంలో ఎన్నో సాధించినవాన్ని, ఎన్నో కష్టనష్టాలు చూసినవాన్ని, అనుభవించిన వాన్ని. మీరు మళ్ళీ కొత్తగా అవన్నీ అనుభవించి కనుక్కోవల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మీ జీవితంలో ఎలాంటి డబ్బుపరమైన, వ్యక్తిగతమైన ఇబ్బందులు రాకుండా ఒక ప్యాషన్ కోచ్‌గా నేను మీకు సహాయపడగలను.

ఇది నా ప్యాషన్. 

మనీ కావాలా? 
మంచి లైఫ్ కావాలా?

రెండూ సాధ్యమే. 

10X స్పీడ్‌లో - ఊహించనంత వేగంగా - ఈ రెండిటినీ మీరు సాధిస్తారు.

జీవితం ఒక్కటే.
ఒంటరి పోరాటం చేస్తూ,
మీలో మీరే బాధపడుతూ
మరింత సమయం
వృధా చేసుకోకండి.

నా ప్యాషన్ కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు నాతో చర్చించే ప్రతి విషయం గోప్యంగా నా మనస్సులోనే ఉంటుంది. మీ సమస్యలు నా సమస్యలవుతాయి. మీరూ నేనూ కలిసి, పరిష్కారం కనుక్కొంటాము. అవసరాన్ని బట్టి, తప్పనిసరైతే మనం వ్యక్తిగతంగా కూడా కలుస్తాము. 

మీ కెరీర్ బాగుంటుంది. మీరు డబ్బు సంపాదిస్తారు. మీ రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. మొత్తంగా, ఇకనుంచీ మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు ఆనందంగా, అద్భుతంగా జీవిస్తారు. 

ఇదంతా, మీరూహించనంత వేగంగా 10X స్పీడ్‌లో సాధ్యం అవుతుంది!

Through collaborating with you, I leverage my multi-passionate diverse background and real-world experience. Your success becomes my fulfillment.

మీ పర్సనల్ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నట్టయితే మాత్రం ఇక ఆలస్యం చేయకండి. ఈరోజే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించండి.

మీరూ -
ప్రొఫెషనల్‌గా మీరనుకున్న స్థాయికి ఎదుగుతారు. 
బాగా డబ్బు సంపాదిస్తారు.
వ్యక్తిగతంగా మీరు కోరుకున్న మంచి జీవితాన్నీ ఎంజాయ్ చేస్తారు. 

మీ సక్సెస్, మీ సంపాదన, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం... అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి... Now the ball is in your court! 

Contact me via WhatsApp at 9989578125 to inquire about fee details and schedule an online session.


– Manohar Chimmani
Nandi Award Winning Writer, Blogger, Film Director
10X Passion Coach | The Diversified Solopreneur 

About Manohar Chimmani:
https://www.manoharchimmani.blog/p/about.html

No comments:

Post a Comment