Thursday 16 May 2024

ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్


ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. అసలు రాకపోవచ్చు కూడా. 

కట్ చేస్తే - 

ఫిలిం కెరీర్‌లో గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు. తాజాగా ఒక చిన్న హిట్ ఇచ్చినా, కొంచెం 'బజ్‌'లో ఉన్నా.... మళ్ళీ పరిస్థితి వెంటనే మారిపోతుంది. అది వేరే విషయం.

సో, ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి, పైన చెప్పిన క్లోజ్డ్ సర్కిల్‌కు బయట ఎవరైనా సినిమా చేయాలనుకుంటే - కొత్తగా ఎవరి ప్రొడ్యూసర్స్‌ను వాళ్లే  క్రియేట్ చేసుకోవాలి.

దీన్నే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' అనొచ్చు మనం. 

ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్. టీమ్‌లో అందరి లక్ష్యం, అందరి ఫోకస్ ఒక్కదానిమీదే ఉండాలి. అలా ఉండలేనప్పుడు అది టీమ్ కాదు. జస్ట్ కిచిడీ. అలాంటి కిచిడీతో గొప్ప ఫలితాలు రాబట్టడం అంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే. 

ఇది రియలైజ్ అయినవాళ్ళకు మాత్రమే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. సినిమాలో అయినా, ఇంకే ఫీల్డులో అయినా. 

Tuesday 14 May 2024

Make Movies That Make Money


ఈ టైటిల్‌తో ఇంగ్లిష్‌లో ఒక మంచి బుక్ కూడా ఉంది.ఫిలిప్ కేబుల్ రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవ్వొచ్చు...

కట్ చేస్తే -   

ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. అసలు రాకపోవచ్చు కూడా. 

ఫిలిం కెరీర్‌లో గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు. 

తాజాగా ఒక చిన్న హిట్ ఇచ్చినా, కొంచెం 'బజ్‌'లో ఉన్నా మళ్ళీ పరిస్థితి వెంటనే మారిపోతుంది. 

అది వేరే విషయం. 

సో, ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి, పైన చెప్పిన సర్కిల్‌కు బయట ఎవరైనా సినిమా చేయాలనుకుంటే - కొత్తగా ఎవరి ప్రొడ్యూసర్స్‌ను వాళ్లే  క్రియేట్ చేసుకోవాలి.  

దీన్నే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' అనొచ్చు మనం. 

కట్ చేస్తే -

మారిన కార్పొరేట్ ఫిలిం బిజినెస్ కండిషన్స్‌లో, బడ్జెట్ అనేది అసలు సమస్య కానే కాదు. చిన్న బడ్జెట్‌లో అయినా - మంచి కంటెంట్‌తో, బిజినెస్ అవగాహనతో సినిమా తీస్తే అసలు నష్టం ఉండదు. 

థియేటర్ బిజినెస్, ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి ఎన్నో ఆదాయ మార్గాల నుంచి భారీ ప్రాఫిట్స్ ఉంటాయి. 

ఓవర్‌నైట్‌లో కావల్సినంత ప్రమోషన్. సెలబ్రిటీలతో మీటింగ్స్, పార్టీలు... నిజంగా అది వేరే లోకం. 

మారిన బిజినెస్ కండిషన్స్‌లో, సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యడం కూడా మంచి ఇన్వెస్ట్‌మెంటే. సినీ ఫీల్డు మీద, సినిమాల్లో ఇన్వెస్ట్‌మెంట్ మీద నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవారు తప్ప ఎవరైనా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. భారీగా బిగ్ మనీ సంపాదించొచ్చు. 

ఒక ఫిలిం ఇన్వెస్టర్‌గా, ఇంకెన్నో ఇతర బిగ్ బిజినెస్ మాగ్నెట్స్ కాంటాక్ట్స్ సంపాదించుకోవచ్చు. 

సోషలైజింగ్, పార్టీలు, గ్లిట్టరాటి... ఇవన్నీ మామూలే. ఇంకా, మీ జీవితంలో ఊహించని వ్యక్తులను కలుస్తుంటారు. మీరెన్నడూ కలగనని వ్యక్తులతో పార్టీల్లో పాల్గొంటారు. 

ప్రపంచంలో ఏ బిజినెస్‌ను తీసుకున్నా సక్సెస్ రేట్ 10 శాతం మించదు. సినిమా కూడా అంతే. సినిమా ఫీల్డు పట్ల నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు ఇలాంటి స్టాటిస్టిక్స్ ఒప్పుకోడానికి ఈగో అడ్డొస్తుంది. అలాంటివారి గురించి మనకు సమస్య లేదు. ఎందుకంటే వాళ్లని అసలు మనం పట్టించుకోం. 

కొంతమంది సినిమాల్లో ఒకవైపు కోట్లు సంపాదిస్తూనే, కొత్తగా సినిమా తీయాలని వచ్చేవాళ్లను డిస్కరేజ్ చేస్తుంటారు. అదొక సైకలాజికల్ టెక్నిక్ అని వాళ్ళకి వాళ్లే ఫీలవుతుంటారు. అలాంటివాళ్ళను కూడా మనం పట్టించుకోం. 

హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా, ఒక మంచి అవగాహనతో సినిమా తీయగలిగితే చాలు. ఎలాంటి నష్టం ఉండదు.

జీరో రిస్క్!

ఇప్పుడు ఫిలిం బిజినెస్ అలాంటి కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. ఇది చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకోరు. అలాంటి మోరన్స్ గురించి కూడా మనకు అవసరం లేదు. 

కట్ చేస్తే - 

ఇంతకుముందులా నేను మరీ చిన్న బడ్జెట్ సినిమాలను చేయాలనుకోవటం లేదు. ఆ స్టేజీని ఎప్పుడో అధిగమించాను. ఒక్క సినిమా చేసినా, దాని మినిమం హిట్ రేంజ్ ఒక 200 కోట్లుండాలి. 

Interested? 

See you in my office... 

Sunday 12 May 2024

ప్రియతమ్, నేను, అమెరికా!


నేనొకసారి ఏదో షూటింగ్ పనిమీద అనుకుంటాను, ఓ నాలుగైదు రోజులు అవుట్‌స్టేషన్‌కు వెళొచ్చాను. అప్పుడు మేము న్యూ బోయిన్‌పల్లిలోని పద్మావతి కాటేజెస్‌లో ఉన్నాము. 

బయటనుంచి బెల్ కొట్టి ఇలా ఇంట్లోకి ఎంటర్ అయ్యానో లేదో... మా చిన్నబ్బాయి ప్రియతమ్ పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసుకున్నాడు. వెంటనే ఎత్తుకున్నాను. అంతే... నేను ఇంట్లో ఇంకెవ్వరితో మాట్లాడకుండా, వాళ్లవైపు చూడకుండా, నా ముఖాన్ని తన రెండుచేతులతో గట్టిగా పట్టుకొని, గ్యాప్ ఇవ్వకుండా నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు ప్రియతమ్. 

"ఒరే ఇంక చాల్లేరా... మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం అని మాకర్థమైందిలే... ఇంక చాలు" అని గట్టిగా అంటూ, వాన్ని నా నుంచి లాక్కునేదాకా నా ముఖం నిండా ముద్దులు పెట్టడం ఆపలేదు ప్రియతమ్. 

అప్పుడు ప్రియతమ్ వయస్సు బహుశా ఓ రెండు సంవత్సరాలుంటుంది. 

కట్ చేస్తే - 

ఇవ్వాళ ఉదయం ప్రియతమ్ కొత్త సొనాటా కారులో, వాడు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని, ప్రపంచపు అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలోని రోడ్ల మీద క్రూజింగ్ చేస్తూ, వాడు చెప్తున్న మాటలు వింటుంటే నాకే అంతా ఒక కలలా ఉంది. 

జస్ట్ కొన్ని గంటల క్రితం నేను మొట్టమొదటిసారిగా యు యస్ వచ్చాను... ఇప్పుడు అమెరికాలో సాయంత్రం నాలుగవుతోంది.

ఇంకొన్ని గంటల్లో ప్రియతమ్ పుట్టినరోజు... 12 మే. 

Wishing the happiest of birthdays to my dear younger son, Priyatham! 🎉 May this year be filled with boundless joy, good health, and the fulfillment of all your dreams. Keep shining bright! ✨ 

నిజంగా నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్!


"ఇక్కడ ఎవ్వడు ఎవ్వనికి నేర్పడు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని పని చెయ్యి. చేస్తూ నేర్చుకో. నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్, నిన్నెవ్వడు ఆపలేడు."

ఈ డైలాగ్ ఏ సినిమాలో?
ఎవరన్నారు?
కొంచెమైనా గుర్తుకొస్తోందా? 

సినిమాల్లోకి రావాలనుకొనే ఔత్సాహికులు, న్యూ టాలెంట్ కింద కామెంట్స్‌లో రాయండి.  

గుర్తుకు రావట్లేదంటే నువ్వు సినీఫీల్డుకు పనికిరావ్. ఇంకా చాలా స్టడీ చెయ్యాలి.
   
కట్ చేస్తే -

జీవితంలో మంచి అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడుగాని నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదంటే అంతే. 

మినిమమ్ ఒక పదేండ్లు బొక్క! అన్నేండ్లు నీకయ్యే లక్షల ఖర్చు ఇంకా పెద్ద బొక్క!!... లేదంటే, ఇంక ఇంతటితో నీ "సినిమా కెరీర్ ప్రయత్నాలకు ఇక్కడితో ఫుల్ స్టాప్" అని నీకు నువ్వే పెట్టుకుంటావ్. 

So, take right decision. 

Wednesday 8 May 2024

కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అనవసరం!


ఎదుటివారు షేర్ చేసుకొంటున్న పెయిన్‌ను కూడా లైట్ తీసుకొని, సులువుగా ఇంకో వెరీ పెయిన్‌ఫుల్ మాట అనగలిగే సత్తా అందరికీ ఉండదు.

అయితే అది నోటి దూల అవుతుంది. లేదంటే "నేను మాత్రమే కరెక్టు" అనే అహంకారం అవుతుంది. 

రెండూ ప్రమాదకరమే. 

కట్ చేస్తే -

ఇప్పుడు చేస్తున్న నా తాజా సినిమా బడ్జెట్‌ను ఇప్పుటిదాకా అనుకున్న బడ్జెట్‌కు 66.6% ఎక్కువకి పెంచాను. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వటం కోసం తప్పటం లేదు. ఈ విజువల్ ట్రీట్‌లో ప్రధాన భాగం... హీరోయిన్స్. 

ఇన్వెస్టర్స్, టీమ్ అంతా కూడా హాపీ.   

ఇంక కాంప్రమైజ్ ఏం లేదు. అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ ముందుకువెళ్ళడమే.

త్వరగా ఫ్రీ అయిపోవడం ఒక ట్రాక్. ఎక్కడా ఆగకుండా పనిచేసుకొంటూ ముందుకెళ్తుండటం ఇంకో ట్రాక్. రెండూ నాకు చాలా ముఖ్యం. 

19 రోజుల ఈ ఎబ్రాడ్ ట్రిప్ తర్వాత ఉంటుంది అసలు కథ. అప్పటికి ఎలక్షన్ కోడ్ చాలావరకు రిలాక్స్ అయిపోవచ్చు.  

Make films that make BIG MONEY. 

Tuesday 7 May 2024

ఫిలిం కెరీర్ అంటే డబ్బొక్కటే కాదు!


తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే.

ఎవడి పిచ్చి వాడికానందం.

రాజకీయాలు, సినిమాలు, క్రికెట్... ఈ మూడింటికీ మన దేశంలో ఉన్నంత ఇంట్రెస్టు బహుశా వేరే దేశంలో ఉండకపోవచ్చు. ఈ మూడూ మన దేశంలో కోట్లాదిమంది జీవితాల్ని డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో చాలా ప్రభావితం చేస్తున్నాయి.

కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 

కట్ టూ సినిమా -  

మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వదిలేశాక, నా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను. సుఖాల శిఖరాగ్రాలు, కష్టాల అగాధపు అంచులు. అన్నీ చూశాను.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, నా జీవితంలో ఎంతో విలువైన సమయం పరమ రొటీన్‌గా వృధా చేశాక, ఇప్పుడిప్పుడే నేను కోరుకుంటున్న స్వతంత్ర జీవనశైలివైపు అడుగులేస్తున్నాను.  

నిజానికి - అలా వృధా కాకపోతే, బహుశా ఇలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేది కాదేమో!

కమర్షియల్ సినిమానా, కేన్స్ కు వెళ్లే సినిమానా... ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది, నువ్వేం చేయగలుగుతున్నావు అన్నది మొదటి ప్రశ్న. ఈ ప్రొఫెషన్ ద్వారా నువ్వెంత సంపాదిస్తున్నావు అన్నది రెండో ప్రశ్న.   

అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.

ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.

కట్ చేస్తే -  

వివిధ రూపాల్లో క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారు... 

సినిమా బాగోలేదని రివ్యూయర్స్ రాస్తుంటారు. చెత్తగా ఉందని మనమంటే పడనివాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. "డైరెక్టర్‌కు చేతకాలేదు, అసలు ఇలా తీయాల్సింది సినిమా" అని ఫిలిం మేకింగ్‌కు సంబంధించి అ ఆ లు కూడా తెలియనివాళ్ళు చెప్తారు. "అసలు ఆఫీల్డే వెధవ ఫీల్డు, అందులోకెందుకెళ్ళావ్" అని ఇంకొందరు నిలదీస్తారు. "ఇన్నేళ్ళయింది కదా, ఏం సాధించావ్" అని ఇంకొందరు ఉపన్యాసాలిస్తారు. 

ఈ క్రిటిసిజమ్‌కు లెక్క లేదు. అంతు లేదు. 

అయితే - అరుదుగా, వీళ్లలో కొందరు మాత్రం మన మంచి కోరి చెప్తారు, మనం ఇబ్బందుల్లో పడిపోకూడదని చెప్తారు. మిగిలినవాళ్లంతా జస్ట్ ఉచితసలహాదారులే. గట్టు మీద కూర్చొని రాళ్లేసేవాళ్లే. 

దూకినవాడికే కదా తెలుస్తుంది లోతెంతో! 

సో, నీ ఇంట్యూషన్ చెప్పినట్టు నువ్వు చెయ్యి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. 

మిగిలిందంతా జస్ట్ నాన్సెన్స్. 

పని చూసుకో! Just Do Your Work...


మన నేపథ్యం, మనం పెరిగిన వాతావరణం, మన అనుభవాలు... మనకో మైండ్-సెట్‌ను ఫిక్స్ చేస్తాయి. మనలాంటి మైండ్-సెట్టే అవతలివాళ్లకు కూడా ఉండాలనుకోంటే ఎలా?

కట్ చేస్తే -

జీవితంలో ఒక దశ దాటాక కొందరికి "నేను అనుకున్నదే కరెక్టు" అన్న మానసిక స్థితి స్థిరపడిపోతుంది. అది వారి వ్యక్తిగత విషయాలవరకు అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాని, అలాంటి మానసిక స్థితిలో ఎదుటివారిని జడ్జ్ చెయ్యడం అనేది పెద్ద తప్పు. ఈ విషయంలో కొందరిపట్ల ప్రేమతో, వారు సాధించిన విజయాల పట్ల ఆరాధనాభావంతో, వీరికి మనం ఇచ్చే గౌరవం అలుసు కాకూకడు. కాని, అవుతుంది. చివరికి అదొక అలవాటుగా కూడా మారిపోతుంది. అది చాలా ప్రమాదం.         

కట్ చేస్తే -  

సినిమా మీద పూర్తి దృష్టి పెట్టి, దాన్ని ఒక తపస్సులా పనిచేస్తున్నవారికే విజయావకాశాలు 5% లోపు ఉంటున్నాయి. అంతకంటే ఇంకా తక్కువ ఫలితాలుంటున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో - "అసలు సినిమా ఒక్కటే ఇప్పుడు నా ప్రొఫెషన్" అని ఫిక్స్ అయిపోయాక, ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి? కొత్త తలనొప్పుల్లోకి వెళ్ళటం ఎంతవరకు కరెక్టు? అలా వెళ్ళి నానా విధాల మాటలు వినటం, పడటం అవసరమా? 

నువ్వు ఏ పనిచేసినా, ఎవరిని కలిసినా, ఎవరితో సమయం గడిపినా... అది నీ ప్రధాన లక్ష్యం సాధించడానికి తోడ్పడేది అయ్యుండాలి. నిన్ను బాధపెట్టేది, నీ ప్రధాన లక్ష్యం నుంచి నిన్ను వేరు చేసేది, పక్కదారి పట్టించేది కాకూడదు. నీ మనసుని వ్యధపెట్టి, నీ బాధ్యతల్ని విస్మరించేలా చేసేది కాకూడదు.  

గైడెడ్ మిసైల్ ఎప్పుడూ దారి తప్పదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరిగ్గా వెళ్ళి లక్ష్యాన్నే ఛేదిస్తుంది. సరిగ్గా సెట్ చేసిన సమయానికే ఛేదిస్తుంది.

ఒక్కసారి ఆలోచించు... నువ్వు ఎన్నిరోజులు, ఎంతకాలం బ్రతుకుతావో తెలీదు. 

Just do your work. Live life to the fullest. Everything else is just bullshit.   

Saturday 4 May 2024

Happy Birthday Sir!


ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా?

"అవును, చేయొచ్చు" అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు! స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే.

ఒకే రోజు 4 చోట్ల 4 సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. దర్శకుడు మాత్రం ఒక్కరే. దాసరి గారు! ఎక్కడికక్కడ షాట్స్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్‌కి చెబుతూ, 4 లొకేషన్లకు తిరుగుతూ, తీసిన షాట్స్ చూసుకొంటూ, అన్నీ మళ్లీ రివ్యూ చేసుకోవడం, అవసరమైతే కరెక్షన్స్ చేసుకోవడం. అద్భుతం ఏంటంటే, అలా తీసిన 4 సినిమాలూ హిట్ సినిమాలే కావడం!

ఇలా తన పనిలో ఎక్కువభాగం చూసుకొన్న అప్పటి తన అసోసియేట్ డైరెక్టర్స్‌కు గురువుగారు "కో-డైరెక్టర్" అన్న టైటిల్ కార్డ్ కొత్తగా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అదీ తన అసిస్టెంట్స్‌కు దాసరిగారిచ్చిన గౌరవం.

ఈ 'కో-డైరెక్టర్' కార్డ్ నేపథ్యం ఇప్పటి కోడైరెక్టర్లలో ఎంతమందికి తెలుసు?

ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారిగా "డైరెక్టర్" పొజిషన్‌కు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఘనత గురువుగారిదే. అప్పట్లో ఆయన చెన్నై నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్ వచ్చారంటే చాలు. ఇక్కడ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక 30 కార్లలో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అభిమానుల కాన్వాయ్ ఎప్పుడూ రెడీగా ఉండేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. దటీజ్ డైరెక్టర్ దాసరి! 

కట్ చేస్తే -

'లెజెండ్' దాసరి గారి దగ్గర ఒకే ఒక్క సినిమాకు నేను అబ్జర్వర్/అసిస్టెంట్ డైరెక్టర్‌గా  పనిచేయగలగడం నా అదృష్టం. ఆ 4 నెలల సమయంలో ఆయన నాపట్ల చూపిన ప్రేమ, అభిమానం నేను ఎన్నటికీ మర్చిపోలేను.

> ఆయన చెప్పిన జోకులు, తెలుగులో ఒక్క అక్షరం స్పెల్లింగ్ తప్పుగా రాసినా ఆయన పట్టుకొనే విధానం, తాజ్ బంజారాలో మరో కొత్త సినిమా కథా చర్చలు, మధ్యలో ఒక కథకు అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యారెక్టర్‌ కోసం అనుకొని, అప్పటికప్పుడు ఆయనకు కాల్ చేయడం, టైమ్ కాని టైముల్లో, ఆయన సొనాటా కారులో వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో కూర్చుని ఆయనతోపాటు నేను తిరిగిన ట్రిప్పులు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆయనిచ్చే గౌరవం, అవసరమయినప్పుడు చూపించే ఆ క్షణపు కోపం .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో .. గురువుగారికి సంబంధించి నేను మర్చిపోలేని అద్భుత  జ్ఞాపకాలు.

> జూబ్లీహిల్స్‌లోని మణిశర్మ 'మహతి' రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్‌తో ప్రారంభించిన నా తొలి చిత్రం "కల" కోసం నేను ఆహ్వానించగానే గురువుగారు ఎంతో సంతోషంగా వచ్చి, పూజదగ్గరే గంటసేపుకి పైగా నిల్చుని, తనే స్వయంగా అన్ని పూజా కార్యక్రమాలు దగ్గరుండి నా చేత చేయించటం, తర్వాత థియేటర్ లోపల రికార్డింగ్ ప్రారంభించడం, ట్యూన్‌లు, ట్రాక్‌లు అన్నీ చాలా ఓపిగ్గా వినడం .. నాకు బెస్ట్ విషెస్ చెప్పడం .. నేనెన్నటికీ మర్చిపోలేని మరో మధురసృతి.

థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్! ... మీరు లేరని నేననుకోవడంలేదు. అనుకోలేను. 

So, wherever you are... Happy Birthday Sir!
And... Happy Directors' Day to All the Lovely Directors Out There!! 

***

(గురువుగారి మీద నా పాత బ్లాగ్ పోస్టును కాస్త నిడివి తగ్గించి రీ-పోస్ట్ చేశాను.)