Saturday 4 November 2023

ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ జీవనశైలి

ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్‌కు ఉండే సమయంలో 80 శాతం సమయం క్రియేటివిటీతో, సినిమాలతో, సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేనివారితో జస్ట్ అలా వృధా అయిపోతుంటుంది.  

అలా వృధా చేసుకోడానికి ముందుకెళ్ళకపోతే, మనక్కావల్సిన వ్యక్తులు కనెక్ట్ కారు, పనులు కావు. 

మొత్తం మీద క్రియేటివిటీ కోసం మనకు మిగిలే సమయం 20 శాతమే. 

ఇలాంటి కండిషన్స్‌ను దాటి, తన ఇష్టప్రకారం సినిమా చేయగలిగిన పరిస్థితులను క్రియేట్ చేసుకోగలిగినప్పుడే ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినా హిట్ కొట్టగలుగుతాడు. 

అది ఇక్కడ నేను బ్లాగ్ రాసినంత ఈజీ కాదు. 

పైన చెప్పిన 80ని 20 చేసుకోగలగాలి. 20ని 80కి పెంచుకోగలగాలి. 

కట్ చేస్తే -  

ఇదంతా తెలియని మిత్రుల సలహాలు బయటినుంచి మనకు రోజుకి కనీసం ఒక డజన్ అందుతుంటాయి. 

సినిమా ఎలా తీయాలని. టీమ్‌లో ఎలాంటివాళ్లను పెట్టుకోవాలని. హిట్ ఎలా చెయ్యాలని. స్క్రిప్ట్ నేను వాళ్లకి పంపిస్తే కరెక్షన్స్ చేస్తామని. పంచ్‌లు యాడ్ చేస్తామని. అవసరమైతే ఒక బ్లాక్ బస్టర్ కథ మేమే ఇస్తామని. ఎట్సెట్రా ఎట్సెట్రా.   

ఇది మనం సినిమాల్లో ఉన్నంత కాలం మనతో పాటు, పైన చెప్పిన మన 80/20 తో పాటు సమాంతరంగా నడిచే మరొక స్పెషల్ ట్రాక్. 

దీన్ని ఎవాయిడ్ చెయ్యటం అంత ఈజీ కాదు. 

ఏమంటావ్, ప్రదీప్?     

2 comments:

  1. ఈమధ్యఓసినిమా VFx కోసం కొందరు నాదగ్గరికివచ్చారు. నారేట్ చెప్పగానే ఒకింత వెటకారంగా "ఇంకా ఏకాలంలోవున్నార్సార్! మాకు పోస్ట్‌ప్రొడక్షన్ మొత్తం 2 లక్షల్లో చేస్తానికి రెడీగావున్నారు." అన్నారు. ఆల్‌దబెస్ట్ చెప్పాను. కట్‌చేస్తే ఓ పెద్ద సినీప్రముఖుడితో టీజర్ లాంచ్ చేపించారు. టీజర్ చూశాక అతనన్నమాట(నిస్తేజంగా):"కొత్తోల్లు.. చూడండి". అంతకన్నా ఒక్కముక్కా మాట్లాడలేదు.

    మీరనే సోకాల్డ్ఇండిపెండెంట్ డిస్ట్రిబూటర్స్(మీరుకాదు)కి వుండే ఒక చెడులక్షణం "బడ్జెట్‌మీద అవగాహన లేకుండా.. ఎంతోకొంత చేతిలోపెట్టుకోని షూటింగ్‌కి వెళ్ళడం, ఫ్రీగా, కొండొకచో ఎదురుడబ్బులెవరైనా ఇస్తారని ఎదురుచూడడం, అలాంటివారెవరన్నాదొరికితే.. వాల్లటాలెంట్‌తో సంబంధంలేకుండా టీంలోకి తీసుకోవడం, స్క్రీన్‌ప్లేమీద అవగాహనలేకుండా క్లైమాక్స్ దగ్గరకెల్లేసరికి చేతిలోడబ్బులైపోవడం.. చివరికి ఓ చెత్తతీసి ఊర్లో కాలరెగరెయ్యడం(ప్రొడ్యూసర్కాదు)". అమ్ముడుపోని సినిమా చేతిలోపెట్టుకోని.. "పెద్ద పెద్ద బ్యానర్లంతా మమ్మల్ని, మా టాలెంట్‌ని చూసిభయపడతారు.."(ఇది నాతోనే అన్నారు.) అని డప్పాలుకొట్టుకుంటూ ఇంకో బకరా ప్రొడ్యూసర్స్ కోసం తిరగడం..

    Repeatu

    ReplyDelete
    Replies
    1. అవును, మీరన్నట్టు ఒక కనీస అవగాహన లేకుండా సినిమా తీసేవాళ్ళ శాతం ఎక్కువే.

      Delete