Saturday 11 November 2023

గులాబి ఉప్పెన దెబ్బ!

"ఏందన్న... మల్ల ఫోనే లేదు?"

"ఫోనెందుకు, నేనే వచ్చిన గద తమ్మి"

"నిన్న మొన్న మొత్తానికే గయాబ్ అయినట్టున్నవ్?"

"అవ్ తమ్మి, పని మీద గా బొంబై దాకా పొయ్యొచ్చిన."

"పొయిన పని అయిందానె?!" 

"అయింది తమ్మి... కని... నిజంగ చెప్తున్న... గంత దూరం పొయినా నా మనసంత గీన్నే ఉన్నది. ఎక్కడెక్కడ మన పెద్ద సార్ సభలైతున్నై... ఎక్కడ ఏం మాట్లాడుతున్నడు సారు... నువ్వు నమ్ముతవో నమ్మవో గని, నా మైండ్ అంత గిదే ముచ్చట."

"ఏ... నువ్వు గమ్మత్ జేత్తవ్ అన్న... ఎందుకు నమ్మనే? కేసీఆర్ ఆత్మ తెలంగాణ అయితె, నీ ఆత్మ కేసీఆర్! నాకు తెల్వదానే."

"ఎలక్షన్స్ అయిపోయి, సార్ హ్యాట్రిక్ కొట్టి, మూడోసారి ప్రమాణ స్వీకారం చేసింది చూసెదాక... ఇంగ నేను ఎక్కడికి పోను తమ్మి. డిసైడ్ అయిన." 

"నిన్న చూసినవా తమ్మి... మన కేటీఆర్‌కు ఎంత డేంజర్ తప్పింది. జెర్రంతల ప్రమాదం తప్పింది. దేవుడున్నడు తమ్మి."

"ఏ... ఉన్నడన్న. మన కేటీఆర్ ఎట్ల పనిజేస్తడు తెల్సు గద. క్లాసుల క్లాస్, మాస్‌ల మాస్. వెయ్యిల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు! డేశంల ఏ రాష్ట్రంల నన్న గింత గనం పనిచేసే మంత్రి ఏది ఒక్కలన్న ఉన్నరా? గసొంటి మనిషికి దేవుడు గింత దెబ్బ తగలనియ్యడు." 


"కొడంగల్‌ల గులాబి సముద్రం చూసినవా తమ్మి, ఎట్లున్నది ఎట్లున్నది... అదిరిపోలె?"

"కేటీఆర్ స్పీచ్ మరి? ఏం మాట్లాడిండన్న! గా బస్సు మీద గంత డేంజర్ కథయినా గుడ, గింతన్న రెస్టు తీస్కోకుండ కొడంగల్ పోయిండు. దుమ్ము దులిపిండు!"

"నిన్న కొడంగల్‌ల గిదంత చూసినంక... గా రేటెంత రెడ్డి ఫీలింగ్స్ ఎట్లుండెనో తమ్మి...?!"

"ఫీలింగ్సా తొక్కా?... కొడంగల్‌ల, కామారెడ్డిల గులాబి ఉప్పెన దెబ్బకి రేటెంత రెడ్డి ఎక్కడిదాక కొట్టుకపోతడంటె అన్నా... మల్ల మనకు కనిపించనంత దూరం కొట్టుకపోతడు!"     

2 comments:

  1. ఏమన్నా రాసిర్రు సార్...
    లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా... చివరిలో మీర్రాసిన పంచ్ "ఫీలింగ్సా తొక్కా?... కొడంగల్‌ల, కామారెడ్డిల గులాబి ఉప్పెన దెబ్బకి రేటెంత రెడ్డి ఎక్కడిదాక కొట్టుకపోతడంటె అన్నా... మల్ల మనకు కనిపించనంత దూరం కొట్టుకపోతడు!" తో కిక్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు...

    ReplyDelete