Sunday 27 August 2023

సొంత పైత్యం వేరు, సినిమా వేరు! - 2


అంతా కలిపి వీళ్ళొక 50 మంది ఉంటారు. సినిమాల గురించి వీళ్ళు రాసే రాతలు చదివి ఆహా ఓహో అనేవాళ్ళు ఇంకో 100 మంది ఉంటారు. ఈ 150-200 మంది కొనే టికెట్స్‌తో సినిమాలు హిట్లు కావు. వీరి అభిరుచి, వీరి ఆలోచనా విధానం ఒక సినిమా విజయానికి కొలమానాలు కాలేవు.

కట్ చేస్తే - 

పింక్ సినిమాను తెలుగులో పింక్‌లా తీయలేదు అంటాడొక రివ్యూయర్. హిందీ పింక్ కాన్సెప్టును తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ఎలా తీస్తే విజయం సాధిస్తుందో ఆ రైట్స్ కొనుక్కున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్స్‌కు ఒక స్పష్టమైన ఐడియా ఉంటుంది. అది వాళ్ళ విజన్, వాళ్ళ ఇష్టం. అంతే కాని - పింక్‌ను పింక్‌లా తీయడానికి కోట్లు పెట్టి తెలుగు రైట్స్ కొనుక్కొవడం ఎందుకు... 2 లక్షలు పెట్టి డబ్బింగ్ చేస్తే సరిపోతుంది. 

బేబీ సినిమాకు వంద కోట్లు ఎలా వచ్చాయి అంటాడొకాయన. ఇంకొకాయన నేను మొదటి ఇరవై నిమిషాలకే నిద్రపోయాను అంటూ రాసుకొస్తాడు. మీ రాతల్లోనే ఉంది కదా... మీ ఆలోచనలకు, రివ్యూలనబడే మీ సోకాల్డ్ రాతలకు - సినిమా విజయాలకు అసలు సంబంధమే లేదని!

సినిమా బేసిగ్గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. పాఠాలు చెప్పే టీచర్ కాదు. నీతి బోధనలు చేసే గురువు కాదు. ఈ స్పృహతో రివ్యూలు రాసేవాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి రివ్యూల వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. మిగిలినవాళ్ళు రాసే రివ్యూలు అసలు రివ్యూలు కాదు. జస్ట్ బుల్‌షిట్. 

ఫిలిం మేకర్స్ అయినా, రైటర్స్ అయినా, రివ్యూయర్స్ అయినా... ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. యాండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ మాత్రం వాడతాం కాని, అంతే అడ్వాన్స్‌డ్‌గా మేం ఆలోచించం అంటే అంతకంటే చెత్త హిపోక్రసీ ఇంకోటి ఉండదు.   

2 comments:

  1. ఈ మధ్య సమీక్షకులు ఎక్కువగా వ్రాస్తున్న వాక్యం - ఇంకొంచెం క్రిస్పీ గా కట్ చేయవలసింది. కత్తెరకు పని చెప్పాల్సింది.

    Some stories need to be told in slow pace. Every movie can't be cut like cartoon network show or video game. Each Movie needs its own tone, tenor and pace.
    Occasionally we come across good reviews too.

    ReplyDelete