దేశంలోనే ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.
అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు వంద కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు. మొన్నీమధ్యకూడా "ఇస్మార్ట్ శంకర్" కు ముందు, పూరీ దగ్గర యాభై వేలుకూడా లేని పరిస్థితి గురించి ఆమధ్య ఆయన పుట్టినరోజునాడు ఒక కార్యక్రమంలో ఛార్మి ఎంతో ఎమోషనల్‌గా చెప్పింది. ఇప్పుడు "లైగర్" ఎఫెక్టు కూడా చిన్నదేం కాదు. బట్, హి విల్ కమ్ బ్యాక్.
భాయ్‌జాన్ బజ్రంగ్, బాహుబలి వంటి భారీ హిట్స్‌తో చరిత్ర సృష్టించిన రచయిత విజయేంద్రప్రసాద్, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు రాజమౌళి చదువుని ఇంటర్మీడియట్తోనే ఆపేశారని ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను.
టాలీవుడ్‌కి ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మూడక్షరాల మేవరిక్ డైరెక్టర్, ఆయన టీమ్... తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో... ఒకరోజు లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారని ఆయన దగ్గర కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన మిత్రుడు ఒకసారి నాతో చెప్పాడు.
ఇలాంటి ఉదాహరణలు ఎవరిని కదిలించినా వందల్లో ఉంటాయి.
సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్.
మనం తీసుకొనే నిర్ణయాలు మాత్రమే మనల్ని ఎక్కడో ఇరికిస్తాయి. బాధపెడతాయి.
కట్ చేస్తే -
సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!
సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు.
దటీజ్ సినిమా.
ఇక్కడ ఎంట్రీకైనా, ఎగ్జిట్కైనా ఒక సరైన గైడ్ లేదా మెంటర్ తప్పనిసరి...
పైనరాసిన మొత్తానికి ఒక పాజిటివ్ ఎపిలోగ్ ఏంటంటే...
సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, ఖచ్చితమైన నియమాలు పాటిస్తే మాత్రం ఏ కష్టాలూ ఉండవు. ఫేమ్, ఆనందాలకు అంతుండదు.
స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్డ్ అటాచ్మెంట్' అన్నమాట!
Are you ready?
బాగా చెప్పారు.
ReplyDeleteThank you.
Deleteనోట్: పబ్లిష్ చేయనవసరం లేదు మీ గమనిక కోసం మాత్రమే.
ReplyDeleteమీటపాల్లో చాలా ఉన్నాయి ఇలా. అన్నీ ఓపెన్ థింకింగ్ ధోరణిలో ఉన్నాయి.
ఐనా ఉపయుక్త విషయాలేను.
Thank you.
Delete