Monday 29 May 2023

ది మైండ్‌సెట్!


రెండు మూడు నెలల క్రితం పెట్టిన పోస్టు ఇది. కొంచెం ఎడిట్స్‌తో రీపోస్ట్ చేస్తున్నా. మైండ్‌సెట్ కోణంలో తప్ప ఈ పోస్టును మరోవిధంగా నెగెటివ్‌గా భావించవద్దని మిత్రులకు మనవి.

కట్ చేస్తే -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో - మొదటి నుంచీ - ఒక ప్రాంతం వాళ్లే ఎక్కువగా ఉండటానికి, ఎక్కువగా సక్సెస్ అవడానికి, బాగా నిలదొక్కుకోడానికి కారణం... వాళ్లకు ఆ ప్రాంతం వాళ్ళిచ్చే సపోర్ట్!  

ఒక్క డబ్బు పరంగా అనే కాదు. సోషల్‌గా కూడా సినిమా ఫీల్డుకు వాళ్ళిచ్చే రెస్పెక్ట్ వేరే. 

"మావాడు రామానాయుడు స్టూడియోలో బాయ్‌గా పనిచేస్తున్నాడు" అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటారు అక్కడ. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్! అసలు తప్పు లేదు. 

"మావాడు డైరెక్టర్" అని చెప్పుకోడానిక్కూడా ఫీలవుతారు ఇక్కడ. 

స్వయంగా ఒక డైరెక్టరే "నేను ఫిలిం డైరెక్టర్‌ను" అని చెప్పుకోడానికి ఇబ్బంది పడుతుండటం నేనిక్కడ చూశాను. దానికి బదులు, "ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను" అని అబద్ధం చెప్పటం కూడా చూశాను.   

ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్‌లో హెల్ప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం మాట సాయానికి కూడా మైలు దూరంలో ఉంటారు... వణికిపోతారు. 

అక్కడ - ఒక కాల్ చేస్తే చాలు. "మన వాడు" అని ముందు డబ్బు అందుతుంది. డీల్‌లో కొందరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కాని, పని మాత్రం సమయానికి అవుతుంది. ఖచ్చితంగా చేస్తారు.  

బిజినెస్ ఈజ్ బిజినెస్.  

ఇక్కడ కథ వేరు. చాలా చాలా అరుదుగా ఎవరో ఒకరిద్దరు మహానుభావులు తప్ప... అసలలాంటి చాన్స్ ఇవ్వరు. చెయ్యాల్సిన హెల్ప్ చెయ్యరు. మీద నుంచి క్లాసులు, ఉచిత సలహాలు. 

పని కాదు. ప్రచారం మాత్రం ఫుల్! 

ఒక్క దెబ్బకి చులకనైపోతాం. అప్పటిదాకా "మీరు", "సార్" అన్నవాడు సింపుల్‌గా ఏకవచనంలోకి దిగుతాడు. 

కనీస స్థాయి కమ్యూనికేషన్ ఉండదు. కర్టెసీ ఉండదు.  

దీనికి ఆయా ప్రాంతాల సాంఘిక, ఆర్థిక నేపథ్యం ఎట్సెట్రా కారణాలు అని చెప్తారు కొందరు మేధావులు. 

కరెక్టే కావచ్చు. కాని, శతాబ్దాలైనా అంతేనా? 

మైండ్‌సెట్స్ మారవా?  

ఇలాంటి నేపథ్యం నుంచి - సినిమా కష్టాలన్నీ ఎదుర్కొని - ఇక్కడ ఎవరైనా ఫీల్డులో నెగ్గుకొచ్చి పైకొచ్చారంటే కారణం స్పష్టం. 

అన్‌కండిషనల్‌గా అక్కడి లాబీలకు పూర్తిగా కనెక్ట్ అయిపోవడం! 

వివిధ యాంగిల్స్‌లో మనచుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాల్ని గమనిస్తే అదే కరెక్టు. నా వ్యక్తిగత అనుభవాల నేపథ్యంలో ఆలోచించినప్పుడు కూడా అనిపిస్తుంది... అది మాత్రమే కరెక్టు అని.  

No comments:

Post a Comment