Thursday 11 May 2023

నా జీవితంలో అతి ముఖ్యమైన ఆ 365 రోజులు!


సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల్ని శాసించేది - అందరూ మామూలుగా అనుకున్నట్టు - కథ, దర్శకత్వం, నిర్మాత, బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మేకింగ్, ప్రమోషన్... ఇలాంటివేవీ కావు. 

కలిసి పనిచెయ్యడానికి - మనం ఎన్నుకొనే వ్యక్తులు, మనం అసోసియేట్ అయ్యే వ్యక్తులే - మన జయాపజయాలకు మొట్టమొదటి కారణం అవుతారు. 

ఇది నా రిపీటెడ్ అనుభవం. 

కట్ చేస్తే - 

హీరోహీరోయిన్స్ గాని, డైరెక్టర్స్ గాని వాళ్ళదగ్గరికి ఎవరు సినిమా తీస్తామని వస్తే వాళ్ళతో చెయ్యరు. ఎవరినిపడితే వాళ్ళను కోర్ టీమ్‌లోకి తీసుకోరు.    

ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటివాళ్ళే సక్సెస్ సాధిస్తారు.  

తొందరపాటు నిర్ణయాలెప్పుడూ ఫెయిల్యూర్ దిశగా తీసుకెళ్తాయి. కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే... కొన్నికొన్నిసార్లు ఒక దశాబ్దకాలం జీవితాన్ని తినేస్తాయి. 

ఇలాంటివన్నీ అనుభవం మీదే తెలుస్తాయి. 

సీనియర్లు ఈ విషయం చెప్తే మనం వినం. పట్టించుకోం అసలు. 

యస్ యస్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి ఒక విషయం చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను... ఈయనేదో చెప్తాడ్లే అని. 

"నా దగ్గరికి వెయ్యికోట్లు పెడతాను అని ఒక నిర్మాత వచ్చాడని నేను అతన్ని తీసుకోలేను. అతనిలో నేను డబ్బుకన్నా ముందు ఇంక చాలా విషయాలు చూస్తాను. సినిమా మీద నాకున్నంత ప్యాషన్ ఉండాలి. అతని మైండ్‌సెట్ నాకు కనెక్ట్ కావాలి. యాటిట్యూడ్ నచ్చాలి. సరిపోదు అనిపిస్తే వెంటనే సారీ చెప్పేస్తాను". 

ఇంక చాలా చెప్పాడు రాజమౌళి.

కట్ చేస్తే - 

అప్పుడప్పుడూ ఫీల్డులోకి తొంగిచూసిన నా అతి చిన్న సినీ జర్నీలో - కనీసం ఒక నాలుగుసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. ఇబ్బందుల్లో ఇరుక్కొన్నాను.

సరిగ్గా 365 రోజుల క్రితం - నేను బాగా  ఆలోచించి, పూర్తి క్లారిటీతో - ఒకటికి పదిసార్లు అన్నీ కన్‌ఫర్మ్ చేసుకున్న తర్వాతే ప్రారంభించిన నా తాజా ప్రొఫెషనల్ జర్నీ కూడా నా జీవితంలో ఎప్పుడూ ఊహించని తీవ్రమైన ఇబ్బందుల్లో పడేసింది.  

ఇక్కడ నేను ఎవ్వర్నీ తప్పుపట్టలేను. బిజినెస్‌లో ప్లాన్స్ ఫెయిల్ కావడం సహజం. కాని, కమ్యూనికేషన్ ఫెయిల్ కాకూడదు. 

అయినా సరే, నిర్ణయం నాది కాబట్టి బాధ్యత నేనే తీసుకున్నాను. 

కట్ చేస్తే -  

నా జీవితం మొత్తంలోనే నన్ను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసిన ఈ తాజా అనుభవానికి నేను నిజంగా థాంక్స్ చెప్పక తప్పదు. 

పీకల్లోతు నెగెటివ్ వాతావరణంలో కూడా పూర్తి పాజిటివ్‌గా ఉన్నాను, కూల్‌గా ఉన్నాను.    

అలా ఉంటూనే - 

బయటివారి నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఈసారి. 

ఈ నిర్ణయానికున్న బ్యూటీ ఏంటంటే... మార్చుకోలేని ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాను దీనికి.

ఇది వందకి వంద శాతం నా నిర్ణయం. 

ఎవరి హామీలు లేవు. ఎలాంటి భ్రమలు లేవు. ఇందులో ఎలాంటి నెగెటివిటీకి అవకాశం లేదు. మొత్తం నేనే కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్... ఎవరిమీదో వేసి తప్పించుకోవడాల్లేవ్...   

So... No Regrets. No Negativity. Celebrate Life, Everyday! 

No comments:

Post a Comment