Saturday 29 April 2023

కొన్ని యుటోపియాలు నిజమవుతాయ్!


"అన్నా! మన కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి హోదాలో ఢిల్లీ నుంచి ఆయన ప్రెస్‌మీట్‌లు, స్పీచ్‌లు మనం చూస్తాం!"

గత 65 ఏళ్ళుగా మన తెలంగాణ నోచుకోని అభివృద్ధిని ఎలాగైతే ఇప్పుడు మన పెద్ద సార్ చేసి చూపించారో, అదే విధంగా గత 75 ఏళ్ళుగా మన దేశంలో జరగని అభివృద్ధిని కూడా ఆయన సాధించి చూపిస్తారు." 

"భారత ప్రధాని హోదాలో ఐక్యరాజ్యసమితి జెనరల్ అసెంబ్లీలో మన కేసీఆర్ గారు స్పీచ్ ఇచ్చే రోజుని మనం చూస్తాం. మన సార్ స్పీచ్ తర్వాత ప్రపంచ దేశాధినేతల స్టాండింగ్ ఒవేషన్ కూడా చూసి, మనిద్దరం పార్టీ చేసుకుందాం!"  

నిన్న సాయంత్రం నేనూ... నా ఆత్మీయ మిత్రుడు, ముఖ్యమంత్రి గారి పి ఆర్ వో మిట్టా సైదిరెడ్డి అన్న కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - అన్న నోటి నుంచి వచ్చిన మాటలివి. 

న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్ బిల్డింగును చూసి, "ఇన్నేండ్లయినా గిదే బిల్డింగా... నేను కట్టిస్తా చూడండి" అని ఐక్యరాజ్యసమితికి ఓ కొత్త బిల్డింగ్ కట్టిచ్చినా కట్టిస్తారు సార్!" అని చెప్పుకుంటూ ఆసక్తికరంగా ఇంకెన్నెన్నో చర్చించుకున్నాం. 


వినడానికి ఇదంతా ఒక యుటోపియాలా అనిపించొచ్చు. 

కాని... కొన్ని యుటోపియాలు నిజమవుతాయి. 

కట్ చేస్తే - 

ప్రత్యర్థులకు అస్సలు మింగుడుపడని మొట్టమొదటి యుటోపియా... తెలంగాణ రాష్ట్ర సాధన. 

ఏమయింది? 

ఒక తిరుగులేని ఉద్యమనాయకునిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపెట్టారు కేసీఆర్. 

అదే విధంగా -
24 గంటల కరెంటు.
కాళేశ్వరం. 
మిషన్ భగీరథ.
మిషన్ కాకతీయ.
ఒక్కరోజు ఇంటింటి సర్వే.
రైతు బంధు.
రైతు భీమా.
కళ్యాణలక్ష్మి.
కంటి వెలుగు.
టియస్ ఐ-పాస్.
షి టీమ్స్.
కమాండ్ & కంట్రోల్ సెంటర్ 
125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.

ఇప్పుడు -
ది వైట్ హౌజ్ ఆఫ్ తెలంగాణ... 

ఇట్లా కనీసం ఇంకో వందకు పైగా అతిముఖ్యమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో పరిచయం చేసి, సాధించి చూపెట్టారు కేసీఆర్. 

అంతకుముందు ఇవన్నీ కూడా మనకు యుటోపియాలే!  

కాని, చేసి చూపించారు కదా?


సో, చెప్పొచ్చేదేమిటంటే... కొన్ని యుటోపియాలు నిజమవుతాయి. 

అసాధ్యం అనుకున్న ఎన్నిటినో సుసాధ్యం చేయగల ఆ శక్తి, యుక్తి, ఏకాగ్రత కేసీఆర్ లాంటి అరుదైన నాయకులకే సాధ్యం. 

"తెలంగాణ శ్వేత సౌధం"... డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సమీకృత సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా... కేసీఆర్ గారికి, వారి మంత్రివర్గానికి, ప్రభుత్వంలోని వివిధ స్థాయిల అధికారులకు, సిబ్బందికి, యావత్ తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాభినందనలు...  

2 comments:

  1. కేసీఆర్ కార్యసాధకుడు. ఆయన పాలన కాలం లోని 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి ఒక అద్భుతం. అనితరసాధ్యం.

    సచివాలయం ప్రారంభోత్సవం లో ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన విధానం కేసీఆర్ గొప్పతనం చెబుతుంది. కష్టపడి పని చేసిన వారిని అభినందించడం గొప్ప నాయకుడి లక్షణం.

    We may not agree with him on some issues but we have to appreciate and thank him for his great contribution to Telangana state. He is capable for national role.

    ReplyDelete