Monday 17 April 2023

సో... కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం!


ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర ఎప్పుడూ కనీసం ఒక డజన్ మంది రైటర్స్-డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. మన టర్న్ రావడానికి టైమ్ పడుతుంది. రాకపోవచ్చు కూడా.

గ్యాప్ అనేది అలాంటి గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. ఫెయిల్యూర్ కాదు. 

మళ్ళీ తాజాగా ఒక హిట్ ఇచ్చినా, 'బజ్‌'లో ఉన్నా పరిస్థితి వేరు అనుకోండి. 

అది వేరే విషయం. 

సో, ఇలాంటి నేపథ్యం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి - నాలాంటి చాలామందికి సినిమా చేయాలనుకుంటే 'ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్' ఒక్కటే దారి.

అంటే కొత్తగా మన ఇన్వెస్టర్స్‌ను మనమే వెతుక్కోవాలి. మన ప్రొడ్యూసర్స్‌ను మనమే కొత్తగా తయారుచేసుకోవాలి. 

సినిమా చేయటం అనేది అంత కష్టం కాదు. ఇంతకు ముందు కూడా చేశాను. నంది అవార్డు తీసుకున్నాను. 

కష్టం అది కాదు...  

సినిమా కోసం మన కోర్ టీమ్‌లో - మనతో అసోసియేట్ అయ్యే ముఖ్యమైన ఒకరిద్దరిని ఎన్నుకోడం అనేది చాలా చాలా కష్టం.

ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం. ఒకటికి పదిసార్లు టర్మ్స్ అన్నీ పాయింట్ బై పాయింట్ పర్‌ఫెక్ట్‌గా అనుకుంటాం. 

అంతా ఓకే, అందరూ ఓకే అనుకుంటాం. 

కాని, అనుకున్నట్టు జరగదు. 

అయితే - సమస్య ఇదొక్కటే కాదు. 

కట్ చేస్తే -

మన చుట్టూ ఉన్న వాతావరణంలో కొందరుంటారు. మాట్లాడితే నెగెటివిటీ తప్ప ఇంకోటి ఉండదు. 

వాళ్ళు చేస్తున్న పనులే చక్కగా చెయ్యలేరు. ఫిలిం ఇండస్ట్రీ గురించి, కలెక్షన్స్ గురించి, బిజినెస్ గురించి, హీరోహీరోయిన్స్ గురించి మాత్రం...  మొత్తం వాళ్ళకు తెలిసినట్టే మాట్లాడుతుంటారు. 

ఇండస్ట్రీవాళ్ల ఆఫీసుల్లోకి, బెడ్రూముల్లోకి యాక్సెస్ ఉన్నవాళ్లకు కూడా వీళ్ళు చెప్పేటన్ని విషయాలు తెలియవు! 

మీదనుంచి - వాళ్లేదో మన టేబుల్ పైన కోట్లు కుమ్మరించినా మనం పనిచేయకుండా జల్సాగా తిరుగుతున్నట్టు కామెంట్స్! 

ఉచిత సలహాలైతే లెక్కలేనన్ని! వాటికి ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరం లేదుకదా... 

ఏదైనా తట్టుకోవచ్చు. 

నెగెటివిటీ తట్టుకోలేం. 

నిజంగా పట్టించుకునేవాడికి ఇవన్నీ బీపీ తెప్పిస్తాయి. 

"ఇతన్నుంచి నెక్‌స్ట్ డైలాగ్ ఇలా వస్తుంది చూడు" అని కూల్‌గా పెయిన్ భరిస్తూనే ఎంజాయ్ చేస్తుంటాను కాబట్టి నాలాంటి వాడికి ఎంతో కొంత ఫరవాలేదు. 

అలాగని ఇది నా ఒక్కడి విషయం కాదు. ఒక్క సినిమాల విషయమే కాదు. 

ఏ బిజినెస్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా ఒక్కటే. 

నెగెటివిటీ అనేది ఉత్సాహాన్ని చంపేస్తుంది. మనకు తెలియకుండానే ఆ స్పేస్ అంతా నిరాశ, నిస్పృహలతో నిండిపోతుంది. ఏదో చెయ్యాలనుకున్నవాళ్లను ఏదీ చెయ్యలేకుండా చేస్తుంది. సమయం అత్యంత దారుణంగా వృధా అయిపోతుంటుంది. 

ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా ఉండేది... సమయం ఒక్కటే. 

డబ్బూ, దస్కం ఏదైనా వెనక్కి తెచ్చుకోవచ్చు. సమయం అలా కాదు. ఒక్క నిమిషం వృధా అయినా తిరిగి వెనక్కి తెచ్చుకోలేం. 

ఒక్క రోజు పోయిందంటే పోయినట్టే. 

మళ్ళీ రాదు. 

నిజంగా - అంత వృధాగా పోగొట్టుకునేంత సమయం మనకుందా అన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్. 

4 comments:

  1. Many things happen unnoticed in a 24-hour span, anything can become nothing, something can become some other thing, age goes on with the lapse of time, everything comes under the total control of time. time may seem slow, time may speed up, but at the final countdown, time is the only variable that remains constant.

    ReplyDelete
  2. Such a wonderful Post Thanks for sharing, this post has been extremely helpful to those who needed.
    Latest News Updates

    ReplyDelete