Thursday 9 March 2023

అసలు నిన్ను సినిమాల్లోకి ఎవడు పొమ్మన్నడ్రా బై ?


మైండ్‌సెట్ కోణంలో తప్ప ఈ పోస్టును మరోవిధంగా నెగెటివ్‌గా భావించవద్దని మిత్రులకు మనవి.

కట్ చేస్తే - 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచీ ఒక ప్రాంతం వాళ్లే ఎక్కువగా రావడానికి, ఉండటానికి, ఎక్కువగా సక్సెస్ అవడానికి కారణం... వాళ్లకు ఆ ప్రాంతం వాళ్ళిచ్చే సపోర్ట్! 

ఒక్క డబ్బు పరంగా అనే కాదు. సోషల్‌గా కూడా సినిమా ఫీల్డుకు వాళ్ళిచ్చే రెస్పెక్ట్ వేరే. 

"మావాడు రామానాయుడు స్టూడియోలో బాయ్‌గా పనిచేస్తున్నాడు" అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటారు అక్కడ. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్! తప్పేం లేదు... 

 "మావాడు డైరెక్టర్" అని చెప్పుకోడానిక్కూడా ఫీలవుతారు ఇక్కడ. 

స్వయంగా ఆ డైరెక్టరే "నేను ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా చేస్తున్నాను" అని చెప్పుకోడానికి ఇబ్బంది పడుతుంటాడు. కొన్ని చోట్ల "ఏదో ప్రయివేట్ జాబ్ చేస్తున్నాలే" అని అబద్ధమే చెప్పేస్తాడు! 

ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్‌లో హెల్ప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

అక్కడ - ఒక కాల్ చేస్తే చాలు. ముందు డబ్బు అందుతుంది. అనుకున్న డీల్ ప్రకారం తర్వాత తీసుకుంటారు. డీల్‌లో కొందరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కాని, పని మాత్రం అవుతుంది. చేస్తారు. 

బిజినెస్ ఈజ్ బిజినెస్. 

ఇక్కడ కథ వేరు. చాలా చాలా అరుదుగా ఎవరో ఒకరిద్దరు మహానుభావులు తప్ప... అసలా చాన్స్ ఇవ్వరు. బై మిస్టేక్ సిగ్గు విడిచి అడిగామా... అంతే. "అసలు నిన్ను ఆ సినిమాల్లోకి ఎవడు పొమ్మన్నడ్రా? ఇట్లైతదని నీకు ముందే చెప్పలే?! పైసల్ ఎక్కన్నుంచి వస్తయ్?..." 

చెయ్యాల్సిన హెల్ప్ చెయ్యరు. మీద నుంచి క్లాసులు, ఉచిత సలహాలు, తిట్లు. 

పని కాదు. ప్రచారం మాత్రం ఫుల్! 

ఒక్క దెబ్బకి చులకనైపోతాం. అప్పటిదాకా "మీరు", "సార్" అన్నవాడు సింపుల్‌గా ఏకవచనంలోకి దిగుతాడు. పని మాత్రం చెయ్యడు!    

దీనికి ఆయా ప్రాంతాల సాంఘిక, ఆర్థిక నేపథ్యం ఎట్సెట్రా కారణాలు చెప్తారు కొందరు మేధావులు. 

కరెక్టే కావచ్చు.

కాని, శతాబ్దాలైనా అంతేనా? 

ఇలాంటి నేపథ్యం నుంచి ఎవరైనా ఫీల్డులో నెగ్గుకొచ్చి పైకొచ్చారంటే కారణం... నేను చెప్పను...  

5 comments:

  1. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణా ప్రాంతంలో సినిమాల పట్ల వ్యామోహం హీరోలను అతిగా ఆరాధించడం వంటివి తక్కువ అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే అదే మంచిదేమో.

    ReplyDelete
  2. ఒకవేళ క్లిక్ అయ్యామా! "నేనే వాడ్ని భుజం తట్టి ఎంకరేజ్ చేశా. లేదంటేనా.. ఇంకా ఆమెకానిక్ పనే చేసుకుంటుండేవాడు"

    ReplyDelete
  3. చాలా మంది నటులు ,నిర్మాతలు వచ్చిన ప్రాంతాలు విజయవాడ, గుంటూరు , బాపట్ల, కాకినాడ లాంటి అభివృద్ధి చెందినవి .
    శ్రీకాకుళం, అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతాల నుండి మొదట్లో ఎవ్వరు రాలేదు , కారణం డబ్బు .
    అంతే .
    తెలంగాణ లో కూడా డబ్బున్నవాళ్ళు అప్పట్లో సినిమాలు తీశారు . బిజినెస్ లో ఎంకరేజ్మెంట్ లు ఉండవు , అంత నీకెంత నాకెంత అంతే

    ReplyDelete