Friday 10 February 2023

రాజకీయాలు వేరు, సంకుచిత ఆలోచనలు వేరు!


అందరూ కాదు గాని... 

అక్కడక్కడా కొంతమంది ఛోటా నాయకులు, గల్లీ లెవల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎంతో గొప్పగా ఊహించుకుంటుంటారు. 

ఊహించుకోవచ్చు. అది వారిష్టం. తప్పు లేదు. 

కాని, ఎంత సేపూ ఎవరో ఏదేదో చేసేస్తున్నారు, వాళ్ళకి అనవసరంగా ఏదో పేరొచ్చి కొంపలంటుకుపోతున్నాయి అన్నట్టు చాలా సంకుచితంగా ఆలోచిస్తుంటారు. పైకే అంటుంటారు. అదేపనిగా చెప్తుంటారు. 

ఎంతసేపూ ఇంకొకరెవరితోనో పోల్చుకుంటుంటారు. 

"నేను ఫలానా ఆమె/అతని కంటే ఏం తక్కువ... నాకెందుకు ఫలానా పోస్టు రాలేదు?"... అని ఓ తెగ బాధపడిపోతుంటారు. 

ఇలాంటివాళ్ల భాష కూడా సోషల్ మీడియాలో సూపర్ పాలిష్డ్‌గా ఉంటుంది. బయట మాటలు మాత్రం యమ చెత్తగా ఉంటాయి. వాళ్ళ గెటప్‌కు, వారి నోటి నుంచి వచ్చే భాషకు అసలు సంబంధమే ఉండదు!   

ఇలాంటివాళ్లంతా ఒక క్యాటగిరీ. ఎన్నాళ్లయినా అక్కడక్కడే ఉంటారు. ఉన్నచోటే ఉండిపోతారు. 

కట్ చేస్తే - 

అసలైన పొలిటీషియన్స్‌కు ఖచ్చితమైన లక్ష్యాలుంటాయి. వారి ఫోకస్ మొత్తం వారి లక్ష్యం మీదే ఉంటుంది. ఇంకొకరి గురించి ఆలోచించే అంత సమయం వారికుండదు. 

స్పష్టమైన వారి లక్ష్యం, వారి నిరంతర కృషి, వారి సంకల్పం, వారిలోని ఆత్మవిశ్వాసం... వారి చుట్టూ ఒకరకమైన 'ఆరా' క్రియేట్ చేస్తాయి. ఒక శక్తినిస్తాయి. 

ఇంకొకరెవరో వారిని దాటిపోతున్నారనో, తొక్కేస్తున్నారనో అనుకోరు. ఆ ఇంకొకరెవరూ తమ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేనంతగా పనిచేస్తూ లక్ష్యంవైపు దూసుకెళ్తుంటారు. 

చిన్నదో పెద్దదో... ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారు. అనుకున్నది సాధిస్తారు. అలా ఒక్కో లక్ష్యం సాధించుకుంటూ ముందుకెళ్తుంటారు. 

ఇదంతా కూడా రాజకీయమే. సిసలైన రాజకీయం ఇదే. 

ఇలాంటి రాజకీయం చేసేవాళ్లనే... అన్నీ వాటికవే ఎదురొచ్చి వరిస్తాయి. 

ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేసే వీరికీ... ఎలాంటి లక్ష్యం లేకుండా, కృషి లేకుండా, కనీస సామర్థ్యం లేకుండా ఎంతసేపూ ఇంకొకరితో పోల్చుకొనేవారికీ, అర్థంపర్థం లేకుండా అందర్నీ విమర్శించేవారికీ, ఏదేదో ఆశించి పనిచేసేవారికీ... జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది.  

ఇంకొకరి గురించి కుళ్ళుకోవడమో, చెత్తగా మాట్లాడటం ద్వారానో... ఎవ్వరూ ఏదీ సాధించలేరు.  

ఆశించటం తప్పు కాదు. కాని, ఆ స్థాయి సామర్థ్యం లేకుండా ఆశించడం మాత్రం ఒప్పు కాదు. 

"Politics is not a game. It's a task." 
- KTR

3 comments:

 1. Thanks for covering most of your experience in blog. Sure this will be very useful for those needed.

  Latest News Updates

  ReplyDelete
 2. గమనించారా?
  "చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రజాసామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) జాతీయ రాజకీయాలకు నేతృత్వం వహించాలని పలువురు జాతీయ నేతలు విజ్ఞప్తి చేశారు"

  ప్రజస్వామ్య పరిరక్షణకు ఇప్పటికే దేశమంతా కేసీఆర్ నామజపం చేస్తోందని కదా మన మేధావులు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు ప్రచురిస్తున్నారు!!

  ReplyDelete
  Replies
  1. పచ్చి అబద్ధాలు రాసే ఆంధ్రజ్యోతిని నేను అసలు పట్టించుకోను. ఆ విషయం అలా వదిలేయండి.

   రాజకీయాలకు సంబంధించి మన దృక్పథాలు వేరు. మీ కామెంట్స్ నా బ్లాగ్‌కు సంబంధించినవి, నిర్మాణాత్మకమైనవీ అయితేనే ఆ శ్రమ తీసుకోండి. మనిద్దరి సమయం చాలా విలువైనది.

   Delete