Sunday 22 January 2023

నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి...


కొన్ని నిజాలు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి నిజమే ఇది కూడా.

అప్పుడే 19 ఏళ్లు!

నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా బావమరిది చీరాల పురుషోత్తం, IRS పుట్టినరోజు ఇవాళ!

కానీ .. తను మరణించి అప్పుడే 19 ఏళ్ళు అయ్యిందన్న నిజం నన్నీరోజు చాలా బాధపెడుతోంది.

దిస్ ఈజ్ లైఫ్.

అన్నీ మనం అనుకున్నట్టు జరగవు.

నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారిలాగే ఈరోజు కూడా బాధపడుతున్నాను. కానీ, అది తప్పని కూడా నీ జ్ఞాపకాలే నాకు గుర్తుచేస్తున్నాయి.

జీవితంలో ఎన్నెన్నో మనకు ఇష్టంలేనివి, మనం ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని అధిగమించగలిగే ఆత్మవిశ్వాసం ముఖ్యం.

ఆ ఆత్మవిశ్వాసానికి పర్యాయపదం నువ్వు.

అవధులులేని నీ ఆత్మ విశ్వాసం, నీ చిరునవ్వు, ఆ చిరునవ్వుతోకూడిన నీ ప్రతి పలకరింపు నేనెన్నటికీ మర్చిపోలేను.

హైద్రాబాద్ రోడ్లపైన అర్థరాత్రి తర్వాత తిరిగిన మనిద్దరి ఫుడీ తిరుగుళ్ళు, హుసేన్‌సాగర్ చుట్టూ మనకు నచ్చిన ప్రతిచోటా కారు ఆపుకొని చేసిన మన ఎడతెగని చర్చలు... అన్నీ గుర్తుకొస్తున్నాయ్. 

నువ్వుంటే కథ వేరేలా ఉండేది. 

అసలు నీ ప్రెజెన్సే నాకు ఒక పెద్ద కిక్. ఒక హై. ఒక కాన్‌ఫిడెన్స్.

మిస్ యూ పురుషోత్తమ్...

***** 

#ChiralaPurushotham   #IRS   #ChiralaPurushothamIRS   #PurushothamIRS

1 comment:

  1. జీవితంలో ఎన్నో ఇలాంటివి ఉంటాయండీ. తప్పదు. ఇప్పటికీ‌ నేను మా బేబీపిన్నిని మిస్ ఐనందుకు ఎప్పుడూ విచారిస్తూ ఉంటాను. నాకంటే‌ కేవలం ఒక్క యేడాది మాత్రమే పెద్దదైన అమెను పోగొట్టుకొని నలభైయేళ్ళు దాటిపోయినా ఇంకా ఆమె లేదంటే నమ్మలేకుండా ఉన్నాను.

    ReplyDelete