Wednesday 2 November 2022

ఓవర్‌నైట్‌లో హీరో కావడం ఎలా?


సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు... 

బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి ఎంతో సమయం పడుతుంది. 

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షలు, కోట్లలో ఖర్చు. అంతా కొత్తవాళ్లతోనే ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటే కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది... కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు!  

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. మామూలుగా జరిగేదే అది.  

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు. 

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.  ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు. 

"I'm gonna make him an offer he can't refuse." 
- The Godfather

4 comments:

  1. “వారసులకు” ఈ కష్టాలేం ఉండవేమో కదా? ప్రధాన వనరు (పెట్టుబడి) వాళ్ళ వాళ్లే పెడతారేమో లేదా ఏర్పాటు చేస్తారేమో?

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశ్నల్లోనే జవాబులు కూడా ఉన్నాయండీ. థాంక్యూ.

      Delete
  2. How do you convince young girls to become heroines ? curious to know ? commitment ??

    ReplyDelete
    Replies
    1. Why should we convince young girls to become heroines? Our casting directors will arrange auditions and we select the best one. That's it. Thank you.

      Regarding commitment... its a big subject and we cannot write about it in a single sentence. :-)

      Delete